అమరావతి: 10th Class Lesson & Study Material

సీ॥ సూర్యాది గ్రహరాశి సుప్రభాతము పల్కి
కరముల స్పృశియించు పురము నిలను
కృష్ణాతరంగిణీ కృతశుద్ధ పావన
గంభీరత నలరు కనక నగరి
బుద్ధాది మౌనింద్ర పుణ్యపాదములతో
వరమపావనమైన పురము భువిని
రాజాధిరాజుల రాజధానిగ వెళ్లి
యాంధ్ర జాతికి వన్నె యమరపురము
తే॥॥॥ తెలుగు వెలుగుల జిలుగులు చిలకరించి
కలములవెలది నిలయమై బలిమిబెంచి
సకలసురల యాశీస్సుల సారమారు
విశ్వయవనికపై వెల్గు వీటిగనుడు

ప్రశ్నలు – జవాబులు

1. పై పద్యములోని నగరం ఏ నది ఒడ్డున ఉంది ?
పై పద్యంలోని నగరం కృష్ణానది ఒడ్డున ఉంది.

2 పద్యంలో ఏ పట్టణం గురించి చెప్పారు ?
2. పద్యంలో అమరావతి పట్టణం గురించి చెప్పారు.

3. పద్యంలోని పట్టణం ఏ భాషాప్రాంతంలో ఉండి ఉంటుంది ?
2. పద్యంలోని పట్టణం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా కృష్ణానదీ తీరంలో “ఆంధ్ర” భాషా ప్రాంతంలో
ఉంది.

పాఠ్యాంశ ఉద్దేశం
ఆంధ్రప్రదేశ్ కు నూతన రాజధానిగా అమరావతి నిర్మితమౌతోంది. చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక
నేపథ్యం గల అమరావతిని గురించి ఈనాటి ఆంధ్రులు తెలుసుకోవలసిన అవసరం ఉంది. మన రాజధాని నగరపు
పూర్వ వైభవాన్ని తెలియజేయడమే ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశం.

కఠిన పదాలకు అర్థాలు

సంతతి సంతానము
అభిమానము ఆత్మగౌరవము
ఆముఖము ప్రారంభము
తీవరించు త్వరితపరచు
వైభవం ప్రసిద్ధి
వంశజులు వంశములో జన్మించినవారు
వైభవ+ఉపేతము వైభవోపేతము గొప్పతనముతో కూడినది.
మహిత గొప్పదైన
దివ్యము శ్రేష్ఠమైనది
స్ఫూర్తి పరిపూర్ణత
నవ్యము క్రొత్తది
ప్రబలం వంశములో జన్మించినవారు

ఇప్పటివరకు మీరు ఏ ఏ నగరాలు చూశారు? మీరు చూసిన నగరాలలో మీకు నచ్చిన అంశాలను, నచ్చని
అంశాలను తెలుపండి.

నేను మా తాతగారితో మార్చి 2వ తేదీన విశాఖపట్నం వెళ్లాను. విశాఖపట్నం చాలా అందమైన నగరం. నాకు చాలా నచ్చింది. మరునాడు మార్చి 3వ తేదీన కళాభారతికి వెళ్ళాము. అక్కడ సంగీత కచేరీ జరుగుతోంది. కళాభారతిని 1991 మార్చి 3వ తేదీన స్థాపించారని మా తాతగారు చెప్పారు. సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు సుసర్ల శంకర శాస్త్రిగారి కలలకు ప్రతీకగా కళాభారతి 11మే, 1991న ప్రారంభించబడిందని కూడా మా తాతగారు కాని, రోడ్లన్నీ గతుకులమయంగా ఉన్నాయి. మురికి కాలువ కంపు కూడా ఎక్కువ. ట్రాఫిక్ చాలా ఎక్కువ. అది నాకు నచ్చలేదు.

నేను మా మావయ్యతో మేలో చెన్నై వెళ్ళాను. చెన్నైలో మెరీనా బీచ్, గాంధీబీచ్, ప్లానిటోరియం, జంతుప్రదర్శన శాల, క్వీర్లాండ్, మహాబలిపురం మొదలైనవి చూశాను. చాలా బాగున్నాయి. కాని, ఎండ వేడి ఎక్కువ. ఆటోరేట్లు ఎక్కువ. అదే నాకు నచ్చలేదు.

నేను మా బావతో ఏప్రిల్ లో ఒకసారి విజయవాడ వెళ్ళాను. అక్కడ కృష్ణానది, ప్రకాశం బ్యారేజి చాలా బాగున్నాయి. అక్కడ కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు నివసించిన ప్రాంతం చూశాను. చాలా పొంగిపోయాను. కాని, జనాభా చాలా పెరిగిపోతున్నారు. కులాల పట్టింపు కొందరిలో కన్పించింది. అది నాకు నచ్చలేదు.

ముందు సంవత్సరం జూన్లో బెంగుళూరు వెళ్ళాను. బెంగుళూరులో ఎటుచూసినా పచ్చదనం. ఉద్యానవనాలు కనిపిస్తాయి. అందుకే దానిని భారతదేశపు ఉద్యానవనాల నగరం అంటారట. లాల్ బాగ్, కబ్బన్ పార్క్ లు చాలా బాగున్నాయి. బెంగుళూరులో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. కాని, రోడ్లపై రద్దీ ఎక్కువ. జీవన వ్యయం కూడా చాలా ఎక్కువ. సిటీ బస్సులు, ఎ.సి. బస్సులు కూడా ఎక్కువగా కనిపించాయి. వాటి చార్జీలు కూడా మామూలు బస్సుల కంటే ఎక్కువగా ఉన్నాయి. ఇది నాకు నచ్చలేదు.

నగర నిర్మాణంలో ఏఏ మౌళిక వసతులు ఏర్పాటు చెయ్యాలి ?

నగర నిర్మాణంలో అధునాతన సౌకర్యాలను ఏర్పాటుచేయాలి. మంచినీటి వసతి కల్పించాలి. భూగర్భ మురుగునీటి పారుదల సౌకర్యం కలిగించాలి. జనాభాకు తగిన ఆసుపత్రులు నిర్మించాలి. విద్యా సదుపాయం కలిగించాలి. భద్రతకు తగిన ఏర్పాట్లు చేయాలి. మార్కెట్ యార్డులు నిర్మించాలి. పటిష్టమైన రోడ్లు ఉండాలి. రవాణా వ్యవస్థ చేయాలి. ప్రకృతి వైపరీత్యాలు తట్టుకు నిలబడే విధంగా నగర నిర్మాణం జరగాలి. నివసించడానికి, కార్యాలయాలకు ప్రమాణాలననుసరించి భవంతులు నిర్మించాలి. పార్కులు ఏర్పాటు చెయ్యాలి.

ఈ పాఠం ఆధారంగా కింది విషయాలను వివరించండి.

శాతవాహనులు, ఆ) భిక్షువు, ఇ) చైత్యం, ఈ) శిల్పకళ, 4) ఆరామం

అ) శాతవాహనులు : క్రీ. పూ. 230 ప్రాంతంలో శాతవాహనులు స్వతంత్ర రాజులయ్యారు. శాతవాహన
వంశస్థాపకుని సోదరుడు కను (కృష్ణ) క్రీ. పూ. 207 నుండి క్రీ.పూ. 189 వరకు పాలించాడు.
కన్పుని వారసుడైన మొదటి శాతకర్ణి అశ్వమేధంతోబాటు అనేక యజ్ఞయాగాదులు జరిపించాడు. శాతవాహన
వంశానికి చెందిన 30 మంది పాలకుల జాబితా పురాణాలలో ఉంది. గౌతమీపుత్ర శాతకర్ణినే శాలివాహనుడు అంటారు. ఇతను శాతవాహనుల ప్రతిష్టను బాగా పెంచాడు. ఈయన గొప్ప హిందూ మతాభిమాని. 78లో విక్రమాదిత్యుని ఓడించి శాలివాహనయుగం లేదా శకయుగానికి నాంది పలికాడు. ఇప్పటికీ మరాఠీ ప్రజలు శాలివాహన యుగాన్నే అనుసరిస్తున్నారు. శాతవాహన చక్రవర్తులలో హాలుడు గాథా సప్తశతిని రచించి ప్రసిద్ధి పొందాడు. శాతవాహనులు కట్టించిన కట్టడాలు, స్తూపాలు నేటికీ కృష్ణానదీ పరీవాహక ప్రాంతాలలో ఉన్నాయి. అమరావతిలోని బౌద్ధస్తూపం చాలా ప్రసిద్ధిచెందింది. మహాయాన బౌద్ధం, ఆంధ్ర శిల్పకళ శాతవాహన చక్రవర్తులలో హాలుడు గాథా సప్తశతిని రచించి ప్రసిద్ధి పొందాడు. శాతవాహనులు కట్టించిన కట్టడాలు, స్తూపాలు నేటికీ కృష్ణానదీ పరీవాహక ప్రాంతాలలో ఉన్నాయి.
అమరావతిలోని బౌద్ధస్తూపం చాలా ప్రసిద్ధిచెందింది. మహాయాన బౌద్ధం, ఆంధ్ర శిల్పకళ శాతవాహనుల వర్తక
వాణిజ్యాల వలన ఆగ్నేయాసియాకు వ్యాపించాయి.

ఆ) భిక్షువు : భిక్షువు అంటే యాచకుడు అని అర్థం. అంటే యాచన చేసి జీవించు సన్యాసి. భిక్షువుకు ఇల్లు, సంసారం మొదలైనవేమీ ఉండవు. కేవలం దైవ ధ్యానంతో సమయాన్ని గడుపుతాడు. తక్కువగా భుజిస్తాడు.

ఇ) చైత్యం : చైత్యం అంటే బౌద్ధాలయం. ఈ బౌద్ధాలయంలో బౌద్ధ భిక్షువులు బుద్ధుని బోధనలను గూర్చి ఉపన్యాసాలు ఇస్తారు. ధ్యానం చేసుకుంటారు. బుద్ధుని ధర్మబోధనలను, జీవితాన్ని తెలియజేనే కీర్తనలు పాడతారు.

ఈ) శిల్పకళ : శిల్పము అంటే రాతితో కాని, కర్రతో కాని, లోహాలతో కాని తయారుచేసే బొమ్మలు, ఆ బొమ్మలను తయారుచేయడంలో ప్రదర్శించే నైపుణ్యాన్ని శిల్పకళ అంటారు. శిల్పాలను రకరకాల ఆకారాలలో తయారుచేస్తారు. రకరకాల భంగిమలలో కూడా శిల్పాలను తయారుచేస్తారు.

ఉ) ఆరామం : ఆరామం అంటే తోట, విహరించే ప్రాంతం లేదా విశ్రాంతి తీసుకునే ప్రాంతం. బౌద్ధారామాలంటే
బౌద్ధులు విశ్రాంతి తీసుకునే ప్రాంతాలు.


join Whatsapp