AP ASHA Worker Jobs: 913 ఆశా వర్కర్ పోస్టులకు నోటిఫికేషన్ త్వరలో, పూర్తి వివరాలు

Updated on
Prefer Schools360 on Google

Andhra Pradesh Health Minister Y Satya Kumar Yadav announced that the AP State government has approved the recruitment of 913 vacant ASHA (Accredited Social Health Activist) posts across the State through the upcoming notification. This outlines the recruitment of ASHA (Accredited Social Health Activist) workers under the National Health Mission (NHM) for tribal areas in the State.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ (NHM) ఆధ్వర్యంలో రాష్ట్రంలో 26 జిల్లాలలో ఖాళీగా ఉన్న 913 ఆశా వర్కర్ల ఉద్యోగాలకు ధరఖాస్తులు కోరుతున్నారు. అర్హతలు కలిగిన మహిళలు తమ ధరఖాస్తులను సంబంధిత జిల్లా కార్యాలయంలో అందజేయాలి. 

జీరో వేకెన్సీ విధానంలో ఈ పోస్టుల భర్తీ చేపడుతున్నామని మంత్రి తెలిపారు. గత రెండేళ్లలో ప్రభుత్వం 1294 ఆశా వర్కర్ల పోస్టుల్ని భర్తీ చేసిందన్నారు.

ముఖ్య వివరాలు:

  • పోస్టు పేరు: ఆశా (ASHA) కార్యకర్తలు.

  • ప్రాంతాలు: రంపచోడవరం, చింతూరు, పాడేరు డివిజన్ల పరిధిలోని వివిధ గ్రామాలు (ఉదా: డి.పోలవరం, చింతలచెరువు, పాడేరు, డుంబ్రిగుడ తదితర మండలాలు/గ్రామాలు).

అర్హతలు:

  • కేవలం మహిళలు మాత్రమే అర్హులు.

  • అభ్యర్థులు తప్పనిసరిగా సంబంధిత గ్రామానికి/ఆవాసానికి చెందిన స్థానికులై ఉండాలి.

  • వివాహిత, వితంతువు, విడాకులు తీసుకున్న వారు లేదా భర్త నుండి విడిపోయిన వారై ఉండాలి.

  • నాయకత్వ లక్షణాలు, మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు కలిగి ఉండాలి.

  • కనీస విద్యార్హత 10వ తరగతి ఉత్తీర్ణత (పధాన్యత ఇవ్వబడుతుంది).

వయస్సు:

  • 25 నుండి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన తేదీలు:

  • దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07-02-2026

  • దరఖాస్తుకు చివరి తేదీ: 20-02-2026

  • ప్రొవిజనల్ మెరిట్ జాబితా విడుదల: 23-02-2026

  • అభ్యంతరాల స్వీకరణ: 24-02-2026 నుండి 26-02-2026 వరకు.

దరఖాస్తు విధానం:

  • అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తులను నిర్ణీత గడువులోగా సంబంధిత అధికారులకు (విలేజ్ హెల్త్ శానిటేషన్ & న్యూట్రిషన్ కమిటీ లేదా పీహెచ్‌సీ ద్వారా) సమర్పించాలి.

వెబ్‌సైట్:

పూర్తి వివరాల కోసం https://allurisitharamaraju.ap.gov.in ను సందర్శించవచ్చు.

Schools 360

Schools360 Team of Content Researchers, Writers and SEO Analysts are very passionate to Provide Genuine and Detailed information on Education, Career and Goverment Notifications.