AP 10th Class SSC Latest New Model Exam Pattern: AP Govt and School Education Department has Revised Exam Pattern for AP SSC / 10th Class Public Exams. The main point to note is Internal Marks will not be considered for Public Exams. So, Total Marks in this Annual Exams will be taken for Ranking, Grading. From this Year, This new System in the Exam Papers will be implemented.
AP 10th Class New Pattern Model Papers 2020 (Download)
Article Contents
Revised Exam Paper Pattern of AP Public Exams Mar/Apr 2020
Category | No. Of Questions | Marks for Each Question | Total Marks |
PAPER–1 / PAPER-2 Total Marks: 50 Time: 2 hr 30 Minutes |
|||
Group – 1 (Objective Type) | 12 | 1/2 | 6 |
Group – 2 (one word Answer) | 8 | 1 | 8 |
Group – 3 (Short Answer) | 8 | 2 | 16 |
Group – 4 (Essay Questions) | 5 | 4 | 20 |
Total Questions | 33 | – | 50 |
Note:
- Same Format is followed for Paper-1 & Paper–2 and for All Subjects.
- There is no Weight-age given to Lessons. Weight-age will be given for Academic Standards.
- Note that BIT PAPER will be given along with Main Paper which is descriptive type.
- It shall be 2.45 hrs, including Reading of Question Paper – 15 min, writing of Answers – 2.30 hrs
- OSSC Main Language/First Language Composite Course – 3.15 hrs.
టెన్త్ పేపర్లలో ఏ,బీ,సీ,డీలకు చెల్లు – ఇక అన్నీ రాతపూర్వక సమాధానాలే – ప్రధాన ప్రశ్నపత్రంలోనే బిట్ పేపర్
పదో తరగతి పరీక్ష విధానంలో సంస్కరణలకు ప్రభుత్వం తెరదీసింది. ఇక నుంచి ప్రశ్నపత్రం స్వరూపం మారబోతోంది. నిరంతర సమగ్ర మూల్యాంకనం(సీసీఈ) విధానంలో భాగంగా గత మూడేళ్లుగా అమలు చేసిన అంతర్గత మార్కుల పద్ధతిని ప్రభుత్వం ఎత్తివేసిన నేపథ్యంలో ప్రశ్నావళి సరళిలో పలు మార్పులు తెచ్చారు. గతంలో మెయిన్ పేపర్.. బిట్ పేపర్ విడివిడిగా ఉండేవి. ఇకపై మెయిన్ పేపర్లోనే బిట్లు కూడా కలిసే ఉంటాయి. పాత మోడల్లో బిట్ పేపర్లో ఏ, బీ, సీ, డీ.. మల్టిపుల్ చాయి్‌సతో కొన్ని ప్రశ్నలు ఉండేవి. అయితే, ఇప్పుడు ఈ విధానాన్ని రద్దు చేసి దాని స్థానంలో లక్ష్యాత్మక ప్రశ్నలు ఇస్తారు. అంటే విద్యార్థి ప్రతి ప్రశ్నకు కనీసం ఒకటి లేదా రెండు పదాలతో కూడిన సమాధానం రాయాలి. పలు మార్పులతో కూడిన ప్రశ్నపత్రంతో పాటు విద్యా ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని ఒక ముసాయిదా(బ్లూప్రింట్)ను పాఠశాల విద్యా శాఖ కమిషనరేట్ సిద్ధం చేసింది. దీని ప్రకారం.. 2019-20 విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి పరీక్షల్లో అంతర్గత మార్కులు ఉండవని స్పష్టమైంది. ఇంటర్నల్ మార్కుల వల్ల కార్పొరేట్ స్కూళ్లకే లబ్ధి కలుగుతోందనే ఆరోపణలు ఉన్నాయని అన్నారు. అందుకే మొత్తం మార్కులకు పదోతరగతి పరీక్ష నిర్వహిస్తామని, పరీక్షలో ప్రత్యేకంగా ఇచ్చే బిట్ పేపర్ తొలగిస్తామని వెల్లడించారు. ఇకపై బిట్ పేపర్‌ను ప్రశ్నాపత్రంలో అంతర్భాగంగా చేరుస్తామని వివరించారు. మంత్రి ఆదిమూలపు సురేష్ గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘‘టెన్త్‌లో పేపర్–1లో 50 మార్కులు, పేపర్–2లో 50 మార్కులు ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్, వెరీ షార్ట్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్, ఎస్సే టైప్ ప్రశ్నలు ఇస్తారు. ఎస్సే టైప్‌లో 5 ప్రశ్నలు మొత్తం 20 మార్కులకు ఉంటాయి. షార్ట్ ప్రశ్నలు 8 మొత్తం 16 మార్కులకు ఉంటాయి.
మార్కుల్లో మార్పు లేదు
ప్రశ్న పత్రంలో మార్పులు జరిగినా.. మార్కుల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదు. ప్రతి సబ్జెక్టులోనూ 100 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో సబ్జెక్టులో రెండు పేపర్లు 50 మార్కుల చొప్పున ఉంటాయి. హిందీలో మాత్రం ఒకే పేపర్ 100 మార్కులకు నిర్వహిస్తారు. గతంలో మాదిరిగానే ఆరు సబ్జెక్టుల్లో కలిపి మొత్తం 600 మార్కులకు పదో తరగతి పరీక్షలు జరుగుతాయి. పాత విధానంలో ఆయా సబ్జెక్టుకు సంబంధించిన రెండు పేపర్లలో కలిపి(ఒకదాంట్లో 20, మరో దాంట్లో 15 చొప్పున వచ్చినా) 100 మార్కులకు 35 మార్కులు వస్తే ఉత్తీర్ణత సాధించినట్టు ప్రకటించారు. కానీ, ఇప్పుడు ప్రతి పేపర్లోనూ 18 మార్కులు సాధిస్తేనే పాస్ అయినట్లు ప్రకటిస్తారు. ఉదాహరణకు సైన్స్ సబ్జెక్ట్‌కు సంబంధించిన రెండు పేపర్లలో ఒకదాంట్లో 20 మార్కులు వచ్చి, రెండో పేపర్లో 15 వచ్చినా.. పాసైనట్టు పరిగణించరు. ఖచ్చితంగా రెండు పేపర్లలోనూ 18+18 రావాల్సిందే. ఇక, ప్రశ్నపత్రంలో 1/2 మార్కు, 1 మార్కు, 2 మార్కులు, 4 మార్కులతో కూడిన ప్రశ్నలు ఉంటాయి.
సింపుల్ ఆన్సర్ ప్రశ్నలు 8 మొత్తం 8 మార్కులకు ఉంటాయి. వెరీ సింపుల్ ప్రశ్నలు 12 మొత్తం 6 మార్కులకు ఉంటాయి. సబ్జెక్ట్ వారీగా జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తాం. ఒక్కో సబ్జెక్ట్‌లో రెండు పేపర్లలో వచ్చిన మార్కులను కలిపి పాస్ మార్కులను పరిగణనలోకి తీసుకుంటాం. పరీక్ష సమయం 2.30 గంటలు ఉంటుంది. దీనికి అదనంగా ప్రశ్నాపత్రం చదివేందుకు 10 నిమిషాలు, సమాధానాలు సరిచూసుకునేందుకు మరో 5 నిమిషాల సమయం ఇస్తాం. సమాధాన పత్రాలు గతంలో లూజ్ షీట్లు ఉండేవి. దానివల్ల కాపీయింగ్‌కు ఆస్కారం ఉండేది. అందుకే ఇప్పుడు 18 పేజీల బుక్లెట్ ఇవ్వబోతున్నాం. విద్యార్థుల్లోని విజ్ఞానాన్ని పరీక్షించేలా ప్రశ్నాపత్రాన్ని రూపొందిస్తాం. మూల్యాంకనం పకడ్బందీగా నిర్వహిస్తాం. కంప్యూటర్ సంస్థకు ఈ బాధ్యతలు అప్పగిస్తాం. దీనికి పాఠశాల విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి చైర్మన్‌గా ఉంటారు’
32 ప్రశ్నలు.. 50 మార్కులు
1/2 మార్కు ప్రశ్నలు 12. వీటికి 6 మార్కులు(పాత విధానంలో 1/2 మార్కు ప్రశ్నలు 20 ఉండేవి). 1 మార్కు ప్రశ్నలు 8. వీటికి 8 మార్కులు ఉంటాయి. 2 మార్కుల ప్రశ్నలు 8. వీటికి 16 మార్కులు. 4 మార్కుల ప్రశ్నలు 5. వీటికి 20 మార్కులు.
అన్నీ రాయాల్సిందే
ప్రశ్న పత్రానికి సంబంధించి అన్ని సమాధానాలను విద్యార్థి రాత పూర్వకంగానే పేర్కొనాలి. 1/2 మార్కు ప్రశ్నకు ఒక పదంతో, 1 మార్కు ప్రశ్నకు ఒకటి లేదా రెండు వాక్యాల్లో, 2 మార్కుల ప్రశ్నకు మూడు నుంచి 4 వాక్యాల్లో, 4 మార్కుల ప్రశ్నకు ఆరు నుంచి 8 వాక్యాల్లో సమాధానం రాయాలి.
15 నిమిషాల పెంపు
పాత విధానంలో పరీక్ష సమయం 2.30 గంటలు ఉండేది. కొత్త విధానంలో మరో 15 నిమిషాలు పెంచారు. దీంతో పరీక్ష సమయం 2.45 గంటలు ఉంటుంది. అయితే, కాంపోజిట్ తెలుగు, సంస్కృతం, హిందీ పరీక్షలకు 3 గంటల సమయం ఇస్తారు. కాగా, ఈ పేపర్లను 70 మార్కులకే నిర్వహిస్తారు.
సర్కారు ఆమోదానికి ముసాయిదా
ప్రశ్నల సరళి, మార్కుల కేటాయింపు, పరీక్ష కాలవ్యవధి.. తదితర సంస్కరణలతో రూపొందించిన ముసాయిదాను పాఠశాల విద్యా కమిషనరేట్ సర్కారుకు పంపించింది. ప్రభుత్వం దీనిని ఆమోదిస్తే ఈ ఏడాది నుంచే ఈ విధానం అమల్లోకి రానుంది.
You may Also Like These Articles
- AP 10th Maths Question Papers 2023 (PDF) AP SSC Mathematics Latest Model Papers
- AP 10th Class Biology Question Papers 2023 (PDF) EM/TM AP SSC NS Model Papers Download
- AP 10th Sanskrit Question Papers 2023 (PDF) AP SSC SANSKRIT Study Material
- AP 10th Class English Question Papers 2023 (PDF) AP SSC Model Papers Download
- AP 10th Hindi Model Papers 2023 (Latest) SSC Previous Question Papers