AP DSC 2021 Notification: Dates, Syllabus, Eligibility, Vacancies, Application

AP DSC 2021 News: త్వరలో డిఎస్‌సి నోటిఫికేషన్‌ -నోటిఫికేషన్ వివరాలు వెల్లడించిన మంత్రి సురేష్ Andhra Pradesh Education Minister Adimulapu Suresh has announced that the AP TET 2021 (Teacher Eligibility Test) will be held soon during First three months of 2021. Speaking in a meeting in Guntur he Said Govt is committed to Release Fresh Job notifications for 2021 on 1st Jan.

Uppdated on 20th October 2021

పాఠశాల విద్యాశాఖలో పదవీ విరమణలతో 10,673 టీచర్‌ పోస్టులు ఖాళీ అయినట్లు విద్యాశాఖ అంచనా వేసింది. అందులో అత్యధికంగా సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) పోస్టులు ఉండగా, మిగతావి స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ) పోస్టులు, హెడ్‌మాస్టర్‌ (హెచ్‌ఎం) పోస్టులు ఉన్నాయి. అయితే వాటన్నింటినీ డైరెక్టు రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేసే వీలు లేదు. అందులో 6 వేలకు పైగా ఎస్‌జీటీ పోస్టులను డైరెక్టు రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉండగా, ఎస్‌ఏ ఖాళీల్లో 70 శాతం పోస్టులను పదోన్నతుల ద్వారా, 30 శాతం పోస్టులను డైరెక్టు రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తోంది.

వచ్చే విద్యా సంవత్సరంలో…

వచ్చే విద్యా సంవత్సరంలో (2021-22) మరో 2,264 మంది ఉపాధ్యాయులు పదవీ విరమణ పొందనున్నారని విద్యాశాఖ లెక్కలు తేల్చింది. అందులో అత్యధికంగా నల్గొండ జిల్లాలో 199 మంది ఉపాధ్యాయులు పదవీ విరమణ పొందనున్నారు. ఆ తరువాత అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 186 మంది టీచర్లు రిటైర్‌ కానున్నారు. అలాగే సంగారెడ్డిలో 152 మంది, సిద్దిపేట్‌ జిల్లాలో 139 మంది, నిజామాబాద్‌లో 136 మంది, వరంగల్‌ అర్బన్‌లో 106 మంది, కరీంనగర్‌లో 99 మంది, మిగతా వాటిలో ఒక్కో జిల్లాలో 8 మంది నుంచి 99 మందిలోపు టీచర్లు పదవీ విరమణ పొందనున్నట్లు లెక్కలు తీసింది.

AP DSC 2021-మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటన : నోటిఫికేషన్?

త్వరలో డిఎస్‌సి నోటిఫికేషన్‌ -నోటిఫికేషన్ వివరాలు వెల్లడించిన మంత్రి సురేష్
★ డిఎస్‌సి-2021 నోటిఫికేషన్‌కు షెడ్యూల్‌ త్వరలో విడుదల చేస్తామని మంత్రి సురేష్‌ వెల్లడి.
★ మైనార్టీ, మున్సిపల్‌, సాంఘిక సంక్షేమ శాఖల నుంచి ఖాళీ పోస్టుల వివరాలు రాలేదన్నారు. జనవరిలో టెట్‌ నోటిఫికేషన్‌ ఇస్తామని వ్యాఖ్య.
★ డిఎస్‌సి-2018 పోస్టుల భర్తీ పూర్తికాకపోవడంతో డిఎస్‌సి-2021 నోటిఫికేషన్‌కు అడ్డంకిగా మారిందన్నారు.
★ ప్రభుత్వ పాఠశాలల్లో అకడమిక్‌ విద్యావాలంటీర్ల నియామకం త్వరలో చేపడతామని వెల్లడి.
★ ఇందుకు సంబంధించిన ఫైల్‌ ప్రస్తుతం ఆర్థిక శాఖ వద్ద ఉందని వివరణ.
ap dsc 2020
ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఏటా జనవరిలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ చేపడతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టమైన ప్రకటన చేసిన నేపథ్యంలో ఆ దిశగా పాఠశాల విద్యాశాఖ తన పరిధిలోని టీచర్ పోస్టుల నియామకాలపై దృష్టి సారించింది.
ఈ మేరకు ఉపాధ్యాయ ఖాళీలు, జిల్లాల వారీ రోస్టర్ పాయింట్లు, ఇతర సాంకేతిక అంశాలతో కూడిన సమాచారాన్ని అధికారులు రప్పిస్తున్నారు. డిసెంబర్ 31 తేదీ నాటికి ఖాళీగా ఉన్న పోస్టులన్నిటినీ భర్తీచేసేలా ఏర్పాట్లు చేపట్టారు. జనవరిలో నోటిఫికేషన్లను విడుదల చేయడానికి అవసరమైన ముందస్తు ప్రక్రియలపై దృష్టి సారించామని పాఠశాల విద్యాశాఖ వర్గాలు వివరించాయి. పాఠశాల విద్యాశాఖ పరిధిలో దాదాపు 12వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉండవచ్చని అంచనా వేస్తున్నామని, అలాగే మున్సిపల్ స్కూళ్లలో మరో 2వేల వరకు పోస్టులు ఖాళీగా ఉంటాయని, మొత్తంగా 12నుంచి 14వేల వరకు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడే అవకాశముందని పేర్కొన్నాయి. జిల్లాల వారీ డిసెంబర్ ఆఖరుకు ఉండే ఖాళీలు, ఇతర అంశాలతో కూడిన సమగ్ర సమాచారం వచ్చాకనే పోస్టులపై కచ్చితమైన గణాంకాలు తేలనున్నాయి. కాగా, ఈసారి టీచర్ పోస్టుల భర్తీకి టీచర్ ఎలిజిబులిటీ టెస్టు (టెట్), టీచర్ రిక్రూట్‌మెంటు టెస్టు (టీఆర్టీ-డీఎస్సీ) వేర్వేరుగా నిర్వహించేలా అధికారులు సన్నాహాలు చేపట్టారు. అలాగే గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన డీఎస్సీ-2021 పలు న్యాయ వివాదాలతో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. జనవరిలో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్లకు ముందుగానే ఈ న్యాయవివాదాలను పరిష్కరింపచేయాలని అధికారులు అవసరమైన చర్యలు చేపట్టారు. డిసెంబర్ ఆఖరుకల్లా ఈ నియామకాలు పూర్తిచేయనున్నామని వారు పేర్కొంటున్నారు.

AP DSC 2021 Tentative Schedule

Exam Name AP DSC 2021
Conducting Organization Andhra Pradesh Public Service Commission APPSC
Total Posts to be filled Nearly 20,000
Notification Release Date  Jan 2021
Applications Start Date Jan 2021
Last Date for Online Applications Feb 2021
Hall Tickets Downloaded from May 2021
AP DSC 2018 Exam Date May 2021
APDSC Key Release Date May 2021
APDSC 2018 Result Date June 2021
Official Website psc.ap.gov.in

join Whatsapp