East Godavari ASHA Workers Recruitment 2026 ఆశా కార్యకర్తల భర్తీకి నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తూర్పు గోదావరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నేషనల్ హెల్త్ మిషన్ (NHM) కింద జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న ఆశా కార్యకర్త (ASHA Worker) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ నెం. 01/2026 విడుదల చేసింది. స్థానికంగా నివసించే అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

East Godavari ASHA Workers Recruitment 2026 Overview

నియామక సంస్థ

జిల్లా ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ యూనిట్, నేషనల్ హెల్త్ మిషన్ (NHM), తూర్పు గోదావరి

నోటిఫికేషన్ నంబర్

01/2026 (తేదీ: 15-09-2026)

పోస్టు పేరు

ఆశా కార్యకర్త (ASHA Worker)

మొత్తం ఖాళీలు

44 పోస్టులు

ఉద్యోగ ప్రాంతం

తూర్పు గోదావరి జిల్లా (రూరల్ & అర్బన్)

దరఖాస్తు విధానం

ఆఫ్‌లైన్ (సంబంధిత పీహెచ్‌సీ/యూపీహెచ్‌సీలో సమర్పించాలి)

ముఖ్యమైన తేదీలు

ముఖ్యమైన ఘట్టంతేదీ
నోటిఫికేషన్ విడుదల తేదీ

15-09-2026

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ

25-09-2026

ప్రొవిజనల్ మెరిట్ జాబితా & అభ్యంతరాల స్వీకరణ

12-10-2026

తుది మెరిట్ జాబితా మరియు ఎంపిక వివరాల ప్రకటన

19-10-2026

సంబంధిత మెడికల్ ఆఫీసర్లకు అనుమతి పత్రాల జారీ

27-10-2026

ఆశా కార్యకర్త పోస్టులు ఖాళీల వివరాలు

తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా మొత్తం 44 ఆశా కార్యకర్త పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో గ్రామీణ ప్రాంత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (PHC) పరిధిలో 40 పోస్టులు, రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలోని యూపీహెచ్‌సీలలో (UPHC) 4 పోస్టులు కేటాయించారు.

మండలం పేరుపీహెచ్‌సీ / యూపీహెచ్‌సీ పేరుస్వర్ణ గ్రామం / వార్డు సచివాలయంఖాళీల సంఖ్య
అనపర్తికుతుకులురుపెదపర్తి

1

అనపర్తిరామవరం అనపర్తిఅనపర్తి-3

1

అనపర్తిరామవరం అనపర్తిఅనపర్తి-5

1

అనపర్తికొంకుదురుపండలపాక-2

1

చాగల్లుబ్రాహ్మణగూడెంబ్రాహ్మణగూడెం-1

1

దేవరపల్లిదేవరపల్లిత్యాజంపూడి-1

1

దేవరపల్లియాదవోలుయర్నగూడెం-2

1

దేవరపల్లిగౌరీపట్నందుద్దుకూరు-2

1

దేవరపల్లిగౌరీపట్నంఇసుకపట్లపంగిడి-1

1

గోకవరంగోకవరంగోకవరం-4

1

గోపాలపురంహుకుంపేటగుడ్డిగూడెం

1

గోపాలపురంఅన్నదేవరపేటచిత్యాల-1

1

కడియంకడియంకడియం-3

1

కడియంకడియపులంకకడియపులంక-3

1

కడియంకడియపులంకమురమండ-2

1

కోరుకొండదోసకాయలపల్లిమధురపూడి

1

కోరుకొండకోటికేశవరంకోటికేశవరం

1

కోరుకొండకోరుకొండకోరుకొండ-1

1

కోరుకొండకోరుకొండగాదరాడ-1

1

కొవ్వూరుదొమ్మేరువాడపల్లి-1

1

కొవ్వూరుమార్కొండపాడుమద్దూరు లంక

1

నల్లజర్లపోతవరంఅనంతపల్లి-2

1

పేరవలిపేరవలిఖండవల్లి-3

1

రాజమహేంద్రవరం రూరల్పాలాచర్లకొలమూరు-4

1

రాజమహేంద్రవరం రూరల్ధవళేశ్వరంబొమ్మూరు-3

1

రాజమహేంద్రవరం రూరల్ధవళేశ్వరంశాటిలైట్ సిటీ-1

1

రాజమహేంద్రవరం రూరల్ధవళేశ్వరంశాటిలైట్ సిటీ-4

1

రాజమహేంద్రవరం రూరల్ధవళేశ్వరంపిడింగొయ్య-4

1

రాజానగరంరాజానగరంజి. ఎర్రంపాలెం

1

రాజానగరంరాజానగరంవెలుగుబంద

1

రాజానగరంరాజానగరంరాజానగరం-2

1

రాజానగరంరాజానగరంకొత్త తుంగపాడు

1

నల్లజర్లనల్లజర్లఆవపాడు

1

రంగంపేటరంగంపేటవడిసలేరు-1

2

రంగంపేటరంగంపేటవెంకటాపురం

1

రంగంపేటరంగంపేటఏలకొలను

1

సీతానగరంబొబ్బిల్లంకమునికూడలి

1

సీతానగరంసీతానగరంసీతానగరం-2

1

ఉండ్రాజవరంఉండ్రాజవరంకె. సవరం

1

రాజమండ్రి అర్బన్బృహన్నాలపేట యూపీహెచ్‌సీఆడెమ్మదిబ్బ

1

రాజమండ్రి అర్బన్ఆవా వాంబే కాలనీ యూపీహెచ్‌సీఆదర్శనగర్

1

రాజమండ్రి అర్బన్అద్దేపల్లి కాలనీ యూపీహెచ్‌సీవిద్యుత్ కాలనీ

1

రాజమండ్రి అర్బన్వి.ఎల్. పురం యూపీహెచ్‌సీవి.ఎల్. పురం

1

మొత్తం ఖాళీలు

44

విద్యార్హతలు

  • అభ్యర్థిని తప్పనిసరిగా కనీసం 10వ తరగతి (ఎస్సెస్సీ) ఉత్తీర్ణులై ఉండాలి.

  • అభ్యర్థిని సంబంధిత గ్రామం లేదా పట్టణ వార్డు/స్లమ్ క్లస్టర్‌కు చెందిన స్థానిక నివాసి అయి ఉండాలి.

  • మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు మరియు స్థానిక భాషపై పట్టు ఉండాలి.

వేతనం

ఎంపికైన ఆశా వర్కర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు నేషనల్ హెల్త్ మిషన్ మార్గదర్శకాల ప్రకారం నెలకు నిర్ణీత గౌరవ వేతనం (Honorarium) అందుతుంది.

వయోపరిమితి (Age Limit)

  • దరఖాస్తుదారులు సాధారణంగా 25 నుంచి 45 సంవత్సరాల వయోపరిమితి కలిగి ఉండాలి.

  • వివాహిత, వితంతువు, విడాకులు తీసుకున్న లేదా ఒంటరి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

  • అర్హత కలిగిన మహిళలు అందుబాటులో లేని సందర్భాల్లో వయస్సు, విద్యా అర్హతల్లో సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ

గ్రామ/వార్డు స్థాయిలో విలేజ్ హెల్త్ శానిటేషన్ అండ్ న్యూట్రిషన్ కమిటీ (VHNC / VHSNC / UHSNC) ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఆమోదించిన తీర్మాన ప్రతులను పరిగణనలోకి తీసుకుంటారు. అనంతరం జిల్లా సెలక్షన్ కమిటీ మెరిట్ ఆధారంగా పరిశీలించి తుది ఎంపికను ఖరారు చేస్తుంది.

దరఖాస్తు రుసుము

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి దరఖాస్తు రుసుము లేదు (పూర్తిగా ఉచితం).

దరఖాస్తు చేసుకునే విధానం

  • నోటిఫికేషన్‌తో పాటు ఇచ్చిన దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని సరిగ్గా పూరించాలి.

  • దరఖాస్తు ఫారమ్‌కు 10వ తరగతి సర్టిఫికెట్ నకలు (పుట్టిన తేదీ ధ్రువీకరణ కొరకు) జతచేయాలి.

  • స్థానిక వీహెచ్‌ఎన్‌సీ (VHNC) తీర్మానం మరియు ఆమోద కాపీని తప్పనిసరిగా జతపరచాలి.

  • తహసీల్దార్ జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రం (SC/ST/BC అభ్యర్థులు) కాపీని జోడించాలి.

  • నివాస ధ్రువీకరణ పత్రం లేదా రేషన్ కార్డు లేదా గుర్తింపు కార్డు నకలును జతచేయాలి.

  • దివ్యాంగుల కోటా కింద దరఖాస్తు చేసేవారు సదరం (SADAREM) సర్టిఫికెట్‌ను జతపరచాలి.

  • పూర్తి చేసిన దరఖాస్తు పత్రాన్ని అవసరమైన ధ్రువపత్రాలతో కలిపి సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC/UPHC)లో సెప్టెంబర్ 25, 2026 లోపు అందజేయాలి.

అధికారిక లింకులు

వివరాలులింక్
అధికారిక వెబ్‌సైట్eastgodavari.ap.gov.in
నోటిఫికేషన్ & దరఖాస్తు పత్రం

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం / స్థానిక పీహెచ్‌సీల వద్ద అందుబాటులో కలదు

 

Schools 360

Schools360 Team of Content Researchers, Writers and SEO Analysts are very passionate to Provide Genuine and Detailed information on Education, Career and Goverment Notifications.