AP CBSE Telugu Matru bhavana Lesson Notes and Material PDF is Available here.
10 వ తరగతి తెలుగు మాతృభావన పాఠ్యాంశ కీలక భావన
భారతీయ సంస్కృతి ప్రీలకు గొప్ప స్థానాన్నిచ్చి పూజించింది. పరస్త్రీలను తల్లులుగా, ఇతరుల పామ్ముమ గడ్డిపరకతో సమానంగా భావించాలని చెప్పింది. ప్రస్తుత సమాజంలో స్త్రీలను పీడించి, అగౌరవపరచి, వారిపై దాడులు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతున్నది. ఇది మానవ సమాజానికి మంచిది కాదు. ఈ విపరీత ధోరణిని నివారించాలి. అందరం స్త్రీలను విధిగా గౌరవించాలి. పెద్దలు “యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతా!” అన్నారు. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ పాడిపంటలకు, ఐశ్వర్యానికి లోటు ఉండదు. భావి భారత పౌరులైన విద్యార్థులలో స్త్రీలపట్ల గౌరవాన్ని పెంపొందించడానికి “మాతృభావన” పాఠం పెట్టడం జరిగింది. అత్యున్నత వ్యక్తిత్వంగల ఆదర్శపురుషుడైన “శివాజీ” చరిత్ర ఆధారంగా ” శ్రీ గడియారం వేంకట శేషశాస్త్రి గారు రచించిన ‘శ్రీ శివభారతము’ నుండి ఈ పాఠం గ్రహించబడినది.
ఈ పాఠం నేర్చుకున్న విద్యార్థికి “స్త్రీలను గౌరవించాలి” అనే భావన దృఢంగా కలగాలి. తన ప్రవర్తన ద్వారా దీనిని వ్యక్తీకరించినపుడు ఈ పాఠ్య బోధన విజయవంతమైనట్లే. ఉపాధ్యాయుడు తన లక్ష్యాన్ని సాధించినట్లే. చారిత్రక కావ్య ప్రక్రియకు చెందిన ఈ పాఠం భారతీయ సంస్కృతికి, మత సామరస్యానికి, ఆదర్శ పాలనకు నిలువెత్తు నిదర్శనం.
నేపథ్యం
మొదటి దండయాత్రలో కళ్యాణి దుర్గం జయించిన తరువాత అబ్బాజీసో దేవుడు, విజయోత్సాహంతో శివాజీ వద్దకు వస్తాడు. అప్పుడు సోనీదేవుడు శివాజీతో “దేవా మీ ఆజ్ఞ ప్రకారం కళ్యాణిని జయించి దాని సర్దారులను పట్టి బంధించి, సర్వస్వాన్నీ, రాణివాస స్త్రీలను బందీలుగా తెచ్చాను” అని మనవి చేశాడు. ఇది విన్న శివాజీ పరస్త్రీలు తల్లులతో సమానం అని చెప్పి, ఆమెకు అగౌరవం కల్గించినందుకు చింతిస్తూ, ఇలా చేయడం తగదని హితవు పలికిన సందర్భంలోనిదీ పాఠ్యాంశం.
కవి పరిచయం
ఆధునికాంధ్ర కవుల్లో ప్రముఖులు, శతావధాని డా॥ గడియారం వేంకటశేష శాస్త్రి. ఈయన తల్లిదండ్రులు – నరసమాంబ, రామయ్యలు. కడపజిల్లా, జమ్మలమడుగు తాలూకా నెమళ్ళ దిన్నె గ్రామంలో జన్మించాడు.
ఈయన దుర్భాక రాజశేఖర శతావధానితో కలసి కొన్ని కాష్యనాటకాలు రాశాడు. గడియారం వారి పేరు చెప్పగానే “శ్రీ శివభారతము” కావ్యం గుర్తుకు వస్తుంది. పారతంత్ర్యాన్ని నిరసించి స్వాతంత్ర్య కాంక్షను అణువణువునా రగుల్కొల్పిన మహాకావ్యం ఇది. ‘మురారి’. “పుష్పబాణవిలాసము’, ‘రఘునాథీయము’, ‘మల్లికా మారుతము మొదలైన కావ్యాలు, వాస్తు జంత్రి (అముద్రిత వచన రచన), శ్రీనాథ కవితా సామ్రాజ్యము’ (విమర్శ) ఈయన లేఖిని నుండి వెలువడ్డాయి. కవితావతంస, కవిసింహ, అవధాన పంచానన’ అనే బిరుదులను అందుకున్నాడు.
Download the Lesson and Guide
Download మాతృభావన Text Book PDF | Click Here |
Download మాతృభావన Study Material PDF | Click Here |
Download మాతృభావన Lesson Video | Click Here to Watch Lesson Video |
ప్రశ్నలు
1. “పావనంబైన జనయిత్రి పాదజలము” అంటే ఏమిటి?
– జనయిత్రి అంటే తల్లి, జన్మనిచ్చిన తల్లి సర్వదేవతల కంటే ఎక్కువ. అటువంటి తల్లి యొక్క పాదాలు కడిగిన
నీరు చాలా పవిత్రమైనది. విష్ణువు పాదాల నుండి జన్మించింది. గంగ అది ఎంతో పవిత్రమైంది. అటువంటి
పవిత్రత కలిగిందే తల్లి పాదాలు కడిగిన నీరు
2. తల్లి పాదజలం దేనికంటే గొప్పదని తెలుసుకొన్నారు? ఎందుకు?
తల్లి పాదజలం అన్ని తీర్థాలలోని (పుణ్యనదులలోని నీటి కంటే పవిత్రమైనదని తెలుసుకొన్నాం. ఆ నదులలోని
నీరు ఆ నదీ తీరాలలోని దైవం లేదా దైవాల పాఠాలకు తగలడం వల్ల అవి పవిత్రమై పుణ్యనదులుగా
లెక్కింపబడతాయి. కానీ, తల్లి సమస్త దేవతల కంటే ఎక్కువ కనుక తల్లి పాదాలు కడిగిన నీరు పుణ్యనదీ జలముల కంటే గొప్పది.
3. కుమారునికి అన్నింటికంటే ఏది మిన్న? ఎందుకు?
– కుమారునికి అంటే సంతానమందరికీ అన్నింటికంటే తల్లి యొక్క పాదాలు కడిగిన నీరు పరమ పవిత్రమైనది.
ఎందుకంటే తన కడుపులో 9 నెలలు మోసి, కని, పెంచి, పోషిస్తూ, రక్షించే ఆ దైవం కంటే గొప్పది. దైవం
కనబడడు. తల్లి కనబడే దైవం. అటువంటి తల్లి యొక్క పాదాలు కడిగిన నీరు దేవుడికి అభిషేకం చేసిన
నీటికంటే పవిత్రమైనది.
4. ఈ పద్యం ద్వారా తల్లికిగల స్థానమేమిటని గ్రహించారు?
మన సంప్రదాయం, మన సంస్కృతి తల్లికి అత్యున్నత స్థానమిచ్చింది. ఈ పద్యం కూడా తల్లి యొక్క మహోన్నత
స్థానం గుర్తుచేసింది. ‘మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ…. అని ఉపనిషత్తులు కూడా తల్లికి
మొదటిస్థానం ఇచ్చాయి. దైవం కంటే గొప్పదైన తల్లికి నమస్కరించాలి. అపారజలం సంతానానికి ఆరోధార్యం
అని ఈ పద్యం ద్వారా గ్రహించాము.
5. “ప్రతి స్త్రీ మూర్తి మనకు తల్లితో సమానం” అని ఎందుకంటారు?
స్త్రీ లేకపోతే సృష్టి లేదు. భగవంతుడు అందరి వద్దా ఉండలేడు. కనుక తనకు మారుగా తల్లిని సృష్టించాడు.
ప్రతి స్త్రీలోనూ తన తల్లిని చూసుకోగలిగినవాడే మహాత్ముడు. రామకృష్ణ పరమహంస తన భార్య శారదాదేవిలో కూడా తన తల్లిని, జగన్మాతను సందర్శించి పూజించాడు. అందుచేత ప్రతి స్త్రీని తల్లిలాగా చూడాలి. గౌరవించాలి. ఆదరించాలి.
Previous Year Questions
క్రింది పాత్రల స్వభావాలను రాయండి.
1. శివాజీ
శివాజీ మరాఠా వీరుడు. ఆదర్శవాది. మహాబల పరాక్రమవంతుడు. పరస్త్రీని తన తల్లిగా భావిస్తారు. స్త్రీలకు అవమానం జరిగితే సహించడు. స్త్రీలకు కష్టాన్ని కల్గించే వారెవరినైనా శిక్షిస్తాడు. స్త్రీలను అవమానించే వారిని సహించడు.
2. సోన్ దేవుడు.
సోన్ దేవుడు: శివాజీ సేనాని. బలగర్వం ఎక్కువ. మితిమీరిన ఉత్సాహం, శివాజీ పట్ల భయభక్తులు కలవాడు.
‘కళ్యాణి’ దుర్గం జయించాడు. రాణివాసాన్ని కూడా బంధించి తెచ్చాడు. శివాజీ కోప్పడ్డాడు. క్షమార్పణ చెప్పి
శాంతింపజేశాడు. తన తప్పును తాను తెలుసుకొని పశ్చాత్తాపపడే స్వభావం కలవాడు.
క్రింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో వ్యాసరూప సమాధానాలు రాయండి.
౧. సోన్ దేవుని రాజభక్తిని విశ్లేషించండి.
అబ్బాజీసోన్ దేవుడు, శివాజీ మహారాజు వద్ద పనిచేసే ఒక సైన్యాధిపతి. సోన్ దేవుడు, శివాజీ ఆజ్ఞలను తప్పకుండా పాటిస్తాడు. శివాజీ, సోన్ దేవుడిని కళ్యాణి దుర్గముపై దండయాత్రకు పంపాడు. మహావీరుడైన సోన్ దేవుడు, శివాజీ ఆజ్ఞ ప్రకారం కళ్యాణి దుర్గాన్ని జయించి, దాని సర్దారులను పట్టి బంధించి తెచ్చాడు. అంతేకాకుండా ఆ దుర్గంలోని రాణివాస స్త్రీలను కూడా బంధించి తెచ్చాడు. రాణివాస స్త్రీలను బంధించి తెచ్చాడని విని, శివాజీ కోపంతో సోన్ దేవునిపై మండిపడ్డాడు. వెంటనే రాణివాస స్త్రీల బంధాన్ని తొలగించి సభలోకి తీసుకొని రమ్మని శివాజీ సోన్ దేవుడిని ఆజ్ఞాపించాడు. రాజభక్తి గల సోన్ దేవుడు, వెంటనే రాణివాస స్త్రీల బంధాలు తొలగించి వారిని సభలోకి తీసుకువచ్చాడు. తనను మన్నింపుమని సోన్ దేవుడు, శివాజీ మహారాజును కోరాడు. కోటను జయించిన ఉత్సాహంతో, అలా స్త్రీలను బంధించి తెచ్చాననీ, తనకు చెడు ఆలోచన లేదనీ, శివాజీ మహారాజును బ్రతిమాలాడు. శివాజీ సోన్ దేవుడి రాజభక్తిని గుర్తించి అతడిని మన్నించాడు. సోన్ దేవుడు గొప్ప రాజభక్తి కల సర్దారు.
2. సోన్ దేవుడు తప్పు చేసినా సరిదిద్దుకొనే స్వభావం కలవాడు అని నిరూపించండి.
సోన్ దేవుడు శివాజీ మహారాజు యొక్క సైన్యాధిపతి. శివాజీ సోన్ దేవుడిని కళ్యాణి దుర్గంపై దండయాత్రకు పంపాడు. సోన్ దేవుడు కళ్యాణి దుర్గాన్ని జయించి, దాని సర్దారును పట్టి బంధించి, ఆ దుర్గంలోని రాణివాస స్త్రీలను కూడా బంధించి శివాజీ వద్దకు తీసుకువచ్చాడు. పుణ్యానికి నిలయమైన అంతఃపురకాంతను బందీగా తీసుకురావడం తప్పని, తన ఆజ్ఞను అతడు అతిక్రమించాడనీ శివాజీ మహారాజు సోన్ దేవునిపై ఉగ్రుడయ్యాడు. వెంటనే రాణివాస స్త్రీలను బంధవిముక్తుల్ని చేసి తీసుకురమ్మని శివాజీ సోన్ దేవుడిని ఆజ్ఞాపించాడు. సోన్ దేవుడు తాను చేసిన తప్పును దిద్దుకొనే స్వభావం కలవాడు. అందువల్లనే సోన్ దేవుడు మరో మాట మాట్లాడకుండా, తాను బంధించి తెచ్చిన అంతఃపుర స్త్రీల బంధాలు విడిపించి, రాజు వద్దకు వారిని తెచ్చి, తనను క్షమించమని శివాజీని బ్రతిమాలాడు. విజయోత్సాహంతో తాను తప్పు చేశాననీ, తనలో చెడు ఆలోచన లేదనీ, శివాజీకి విన్నవించాడు. దీనిని బట్టి సోన్ దేవుడు తప్పుచేసినా, సరిదిద్దుకొనే స్వభావం కలవాడని తెలుస్తోంది.
3. శివాజీకి స్త్రీల పట్ల ఉండే గౌరవభావాన్ని మీ సొంతమాటల్లో వివరించండి.
శివాజీ మహారాజుకు స్త్రీల పట్ల గొప్ప గౌరవం ఉంది. అంతఃపురకాంతలు పుణ్యమునకు నిలయమైనవారనీ, వారిని బంధించడం కానీ, అవమానించడం కానీ, ఏ భారతీయుడు చేయరాదనీ, శివాజీ అభిప్రాయము. అందుకే కళ్యాణి దుర్గంలోని అంతఃపురకాంతను బంధించి తెచ్చిన తన సైన్యాధిపతి సోన్ దేవుడి పై శివాజీ మండిపడ్డాడు. వెంటనే ఆమెను విడిపించి, ఆమెను గౌరవించి తన సైన్యాన్ని తోడిచ్చి ఆమెను వారి కోటకు సీలు భారత భూమిపై తిరిగే పుణ్యదేవతలని, శివాజీ చెప్పాడు. మనదేశంలో పుట్టిన అనసూయ, సావిత్రి, మెచ్చుకున్నాడు. సీత, సుమతి వంటి పతివ్రతలు, తమ పాతివ్రత్యంతో తమ పుట్టింటికీ, అత్తవారింటికీ కీర్తిని తెచ్చారని, పతివ్రతల పట్ల అపచారం చేసేవారు నశిస్తారనీ, వారి వంశం నిలవదనీ, రావణాసురుడు అలాగే నశించాడనీ, శివాజీ చెప్పాడు. స్త్రీలు రత్నముల వంటివారనీ, వారు పూజింపదగినవారనీ, శివాజీ అభిప్రాయపడ్డాడు.
4. సమాజంలో స్త్రీలను ఎలా గౌరవించాలి ?
సమాజంలో స్త్రీలను తన కన్న తల్లులుగా, తన సోదరీమణులయిన అక్కాచెల్లెండ్రుగా గౌరవించాలి. స్త్రీలను కామ ప్రవృత్తితో చూడకూడదు. తన ఇంటిలో తన తల్లినీ, చెల్లినీ, అక్కనూ ఎలా ప్రేమాదరములతో చూస్తారో, అలాగే పరస్త్రీలను కూడా గౌరవంగా చూడాలి. ముఖ్యంగా మనతో చదువుకొనే తోడి బాలికలను, మన స్వంత సోదరీమణులుగా చూడాలి. వారికి ఏ విధమైన కీడు చేయరాదు. స్త్రీల పట్ల అనుచితంగా ప్రవర్తించేవారిని చూసి సహించరాదు. మన శక్తి కొద్దీ స్త్రీలకు జరిగే అన్యాయాలను ఎదిరించి, పోరాడాలి. అవసరం అయితే పోలీసులకు తెలియజేయాలి. స్త్రీలు అందరూ మనకు తల్లులవంటివారు. స్త్రీలు పుట్టింటికీ, అత్తింటికీ గౌరవాన్ని తీసుకువస్తారు. స్త్రీ, ఒక వ్యక్తికి భార్యగా, ఇంకొకరికి కన్నబిడ్డగా, మరొకరికి కన్నతల్లిగా ఉండి, సమాజానికి ఎంతో సేవ చేస్తోంది. స్త్రీలు భారతదేశపు భాగ్య కల్పలతలు. వారు అసల జ్యోతుల వంటివారు. స్త్రీల పట్ల పాపం చేస్తే, వారి వంశమూ, సంపదలూ నశిస్తాయి. కాబట్టి స్త్రీలను దేవతామూర్తులవలె, మాతృమూర్తులవలె గౌరవించాలి.
5. మీ తోటి బాలికల పట్ల ఏ విధమైన గౌరవభావాన్ని వ్యక్తపరుస్తావు?
మేము మా తోటి బాలికలను అక్కలుగా, చెల్లెళ్ళుగా భావించి, వారిని ప్రేమాదరాలతో గౌరవిస్తాము. వారికి ఏ సహాయం కావలసినా, మేము మా తోటి బాలురతో కలిసి సాయం చేస్తాము. మా తోటి బాలికలు బడికి వచ్చేటప్పుడు లేక వారు ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు, వారికి ఏ విధమైన కష్టం కలుగకుండా చూస్తాము. ఎవరైనా ఆకతాయి, అల్లరి పిల్లలు వారిని అల్లరి పెడితే, మేము ఆ పిల్లలను బెదరించి వారిని తరిమి వేస్తాము, అవసరం అయినప్పుడు మా నోట్సులు వారికి ఇస్తాము. మా తోడి బాలికలను స్వంత అన్నదమ్ములవలె మేము చేదోడు వాదోడుగా నిలబడతాము. అవసరం అయితే వారి కోసం మేము మా ప్రాణాలు కూడా ఇచ్చి సాయం చేస్తాము. వారికి రక్షణ సైన్యంగా నిలబడతాము.
స్త్రీల వలన సమాజానికి కలుగు ప్రయోజనాలను వివరిస్తూ వ్యాసం రాయండి.
స్త్రీలు, సమాజాభివృద్ధిలో ప్రధానపాత్ర వహిస్తారు. స్త్రీ, ఒక పురుషునికి భార్యగా బిడ్డలను కని, వారిని చక్కగా పెంచి, విద్యాబుద్ధులు నేర్పిస్తుంది. ఆమె భర్తకు తోడు నీడగా ఉండి, వంటా వార్పూ చేసి, భర్తకూ, పిల్లలకూ కడుపు నింపుతుంది. బిడ్డలను కని వారికి పాలిచ్చి పెంచుతుంది. భర్తకూ, బిడ్డలకూ, తన ప్రేమామృతాన్ని పంచి పెడుతుంది. కుటుంబంలో ఒడిదుడుకులు లేకుండా దాని సమత్వాన్ని కాపాడుతుంది. దేశంలో స్త్రీలు, పురుషులతో అన్ని విధాలా సమానులు. అంతేకాదు. పురుషుల కంటే స్త్రీలే దేశ సౌభాగ్యానికి కుటుంబ రక్షణకూ ఎక్కువగా తోడ్పడుతున్నారు. స్త్రీ, భర్త సంపాదించి తెచ్చిన దానిని పొదుపుచేసి, కుటుంబాన్ని అభివృద్ధిలోకి తెస్తుంది. అంతేకాదు. నేటి స్త్రీలు, తాము కూడా తమ భర్తలతో పాటు సంపాదించి కుటుంబాన్ని చక్కగా పోషిస్తున్నారు. నేడు పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా కష్టపడుతున్నారు. స్త్రీలను పురుషులు కన్నతల్లులుగా, అక్కాచెల్లెళ్ళుగా గౌరవించాలి. స్త్రీలు పిల్లలను కని, వారికి పాలిచ్చి పెంచి, వారికి మంచిబుద్ధులు నేర్పిస్తారు. పిల్లలకు, కన్నతల్లులే మొదటి గురువులు. స్త్రీలు విద్యావంతులయితే, దేశం పురోగతి చెందుతుంది. నేడు స్త్రీలు విద్యావంతులై డాక్టర్లుగా, ఇంజనీర్లుగా MLAలుగా, MPలుగా ముఖ్యమంత్రులుగా దేశ సేవ చేస్తున్నారు. స్త్రీలు డ్వాక్రా సంఘాలలో చేరి తమ తెలివితేటలతో సంపాదిస్తున్నారు. దేశాభివృద్ధికి అన్ని రంగాల్లో స్త్రీలు చేయూత నిస్తున్నారు. స్త్రీలు ఏ దేశాభివృద్ధికైనా మూలస్తంభాల వంటివారు. స్త్రీలు లక్ష్మీ స్వరూపులు. శక్తి స్వరూపిణులు. మహిళలు మంచి కళాకారిణులు. వారు దేనినైనా అందంగా మలచి మంచి రూపాన్ని ఇవ్వగలరు.