ముడి చమురు మరియు సహజ వాయువు అన్వేషణ మరియు ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ రెండు ఈశాన్య రాష్ట్రాలతో చారిత్రాత్మక త్రైపాక్షిక అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది?
అస్సాం మరియు నాగాలాండ్
ఇటీవల కన్నుమూసిన ఆసియా క్రీడల మాజీ స్వర్ణ పతక విజేత మరియు ప్రముఖ భారతీయ షూటర్ ఎవరు?
జస్పాల్ రాణా (49)
ఇండియా టుడే నేషనల్ టూరిజం సర్వే 2026లో భారతదేశపు నంబర్ 1 రైల్ టూరిజం రూట్‌గా (No.1 rail tourism route) ఏ మార్గం నిలిచింది?
విశాఖపట్నం-అరకు విస్టాడోమ్
నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీ నిర్వహించిన ప్రతిష్టాత్మక 'స్లింగ్‌షాట్ ఛాలెంజ్-2026'లో గ్లోబల్ టాప్-50 లో నిలిచిన 'లెర్నింగ్ టు కోఎగ్జిస్ట్ విత్ స్నేక్స్' (Learning to Coexist with Snakes) ప్రాజెక్ట్‌ను రూపొందించిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వన్యప్రాణి ప్రేమికుడు ఎవరు?
సంపత్ కాంతిమహంతి
జూన్ 11, 2026 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ (CCEA) సమావేశంలో, ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో దేని నిర్మాణానికి ఆమోదం ముద్ర వేశారు?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం కార్యాలయ (CGGPOA) మరియు నివాస (GPRA) సముదాయాల నిర్మాణం (సుమారు రూ. 2,534 కోట్ల అంచనా వ్యయంతో)




