‘దీపం’ AP Free Gas Cylinder Scheme – How to Get Money

By Aasvika Reddy

at


Deepam Scheme AP Free Gas Cylinders Scheme 2025 Apply Online, Eligibility, Documents: Chief Minister of Andhra Pradesh N Chandrababu Naidu launched the ‘Deepam‘ scheme, which offers three free Gas Cylinders in a Year, to eligible women from October 31(Deepavali), as part of Super six poll promises for 2024 elections. This Scheme cost the state goverment of Rs 13,423 crore in next five years.

ఏపీ ప్రభుత్వం దీపావళి నుంచి ‘దీపం పథకం’ ప్రారంభిస్తుంది. ఈ పథకం కింద మహిళలకు ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తుంది. అక్టోబర్ 24 నుంచి బుకింగ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. పీఎం ఉజ్వల యోజన పథకం లబ్దిదారులకు ఈ స్కీమ్ ద్వారా సిలిండర్లు అందిస్తారు.

గ్యాస్‌ సిలిండర్‌ రిటైల్‌ మార్కెట్‌ ధర రూ.876లు కాగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సిలిండర్‌కు రూ.25ల సబ్సిడీ ఇస్తుండగా, ప్రస్తుతం ప్రతి సిలిండర్‌ పై రూ.851లు రాష్ట ప్రభుత్వం భరిస్తుంది.

This Article clearly Explains eligibility, how to Apply, and Application links for the Andhra Pradesh Free Gas Cylinder Scheme by Chief Minister Sri Nara Chandra Babu Naidu.

మూడు సిలిండర్లు ఎలా అందిస్తారు?

ఒక సంవత్సరాన్ని నాలుగేసి నెలల చొప్పున మూడు భాగాలుగా విభజించి .. ప్రతి 4 నెలల వ్యవధిలో అర్హులైన కుటుంబాలకు ఒక్కో సిలిండర్ ప్రకారం అందిస్తారు.

ముందుగా లబ్దిదారులు నగదు చెల్లి గ్యాస్ సిలిండర్ తీసుకోవాలి. ఆ తర్వాత లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో గ్యాస్ సబ్సిడీని 2 రోజుల వ్యవధిలో జమ చేస్తారు.

ఎప్పటి నుంచి బుకింగ్ అంటే?

దీపావళి(అక్టోబర్ 31) నుంచి ఉచిత సిలిండర్ల పథకం ప్రారంభమవుతుంది. అయితే అక్టోబర్ 24 నుంచే సిలిండర్లను బుకింగ్ చేసుకోవచ్చు.

ఎవరు అర్హులు

పీఎం ఉజ్వల యోజన పథకం కింద అర్హులైన వారికి మాత్రమే దీపం పథకంలో 3 సిలిండర్లు ఉచితంగా అందించనున్నారు.

అయితే మిగతా వారు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దానికై కొన్ని నిబంధనలు ఉన్నాయి.

ముఖ్య అర్హతలు

దీపం పథకం కింద ఉచిత సిలిండర్లు పొందాలంటే ప్రాధమికంగా క్రింది అర్హతలు కావాలి.

  • లబ్దిదారులు ఆంధ్రప్రదేశ్ పౌరులై ఉండాలి.
  • తెల్లరేషన్ కార్డు కలిగి ఉండాలి.
  • మహిళా నివాసితులకు కనీసం 18 సంవత్సరాల వయసు ఉండాలి.
  • ఒక ఇంట్లో ఒకే గ్యాస్ కనెక్షన్ ఉండాలి.
  • దీపం పథకం కలిగిన గ్యాస్ కనెక్షన్ కలిగి ఉండాలి.
  • బీపీఎల్ కుటుంబాలు మాత్రమే అర్హులు

అవసరమయ్యే పత్రాలు

ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు లబ్దిదారుల ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు, మొబైల్ నంబర్, కరెంట్ బిల్లు, స్థానికత సర్టిఫికెట్ అవసరం. దీపం పథకం కింద 3 సిలిండర్ల కోసం ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అధికారులు సూచించిన విధంగా లబ్దిదారుల పేరు, చిరుమానా నమోదు చేయాలి. ఇతర డాక్యుమెంట్స్ ఫొటోలు ఆన్ లైన్ లో అప్లోడ్ చేయాలి. దరఖాస్తుదారులు వివరాలను పరిశీలించి, అర్హులకు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తారు.

  1. ఆధార్ కార్డ్
  2. రేషన్ కార్డు
  3. గ్యాస్ కనెక్షన్ పత్రాలు
  4. ఓటరు గుర్తింపు కార్డు
  5. బ్యాంక్ పాస్ బుక్
  6. ప్రస్తుత బిల్లు
  7. గ్యాస్ కనెక్షన్ బుక్

Choose Schools360 on Google

For More Educational News Updates on Sarkari NaukriSarkari Result, and Employment News Notification. Join us on Twitter | Join Our WhatsApp Groups | Connect with our Telegram Channel
Share This Article

Aasvika Reddy

Content Writer