కరెంట్ అఫైర్స్ క్విజ్: 14 జూన్ 2026 Daily GK in Telugu


భారతదేశపు 'సముద్ర మంథన్ మిషన్'లో (Samudra Manthan Mission) భాగంగా, ఆయిల్ ఇండియా లిమిటెడ్ (OIL) ఏ సముద్రంలోని అన్వేషక బావిలో సహజ వాయువు నిల్వలను కనుగొన్నట్లు నిర్ధారించింది?
అండమాన్ సముద్రం

భారత సైన్యాధిపతిగా (Chief of the Army Staff) ఇటీవల ఎవరు నియమితులయ్యారు?
లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్
Chief of the Army Staff Lt Gen Dhiraj Seth
Chief of the Army Staff Lt Gen Dhiraj Seth

భారత రక్షణ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ, నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA)లో శిక్షణ పూర్తి చేసుకున్న మొట్టమొదటి మహిళా క్యాడెట్ల బ్యాచ్ ఇటీవల ఏ సాయుధ దళాలలోకి అధికారికంగా చేరింది (Commissioned)?
భారత రక్షణ దళాలు (Defence Forces – ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్)

జూన్ 2026లో ఏ రాష్ట్రంలోని లార్సెన్ అండ్ టూబ్రో (L&T) హజీరా (Hazira) కేంద్రంలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన జోరావర్ లైట్ ట్యాంక్ (Zorawar light tank) మరియు తేజాస్త్ర (TEJASTRA) వ్యవస్థలను భారతదేశం ప్రదర్శించింది?
గుజరాత్

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డిప్యూటీ గవర్నర్‌గా ఇటీవల ఎవరి పదవీకాలాన్ని ప్రభుత్వం మరో రెండేళ్లపాటు పొడిగించింది?
స్వామినాథన్ జానకిరామన్

ఇటీవలే నాలుగు వసంతాలు (నాలుగేళ్లు) పూర్తి చేసుకున్న 'జన్ సమర్థ్ పోర్టల్' (Jan Samarth Portal), ఇప్పటివరకు సుమారు ఎన్ని లక్షల రుణ దరఖాస్తులను ప్రాసెస్ చేసింది?
54 లక్షలు

నేషనల్ ఇ-గవర్నెన్స్ అవార్డ్స్ 2026లో ఏ కార్యక్రమం లేదా చొరవ ప్రతిష్టాత్మక గోల్డ్ అవార్డును గెలుచుకుంది?
పంచాయతీ అడ్వాన్స్‌మెంట్ ఇండెక్స్ (Panchayat Advancement Index)

రష్యాకు చెందిన యువ క్రీడాకారిణి మిర్రా ఆండ్రీవా (Mirra Andreeva) ఇటీవల ఏ గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను గెలుచుకుని తన కెరీర్‌లో తొలి ప్రధాన ఛాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకుంది?
ఫ్రెంచ్ ఓపెన్

15 ఏళ్ల వయసులోనే భారత సీనియర్ క్రికెట్ జట్టుకు ఎంపికై సంచలనం సృష్టించిన వైభవ్ సూర్యవంశీ, ఏ దిగ్గజ ఆటగాడి పేరిట ఉన్న 36 ఏళ్ల పాత రికార్డును బద్దలు కొట్టాడు?
సచిన్ టెండూల్కర్

స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) వారి 2026 నివేదిక ప్రకారం, భారతదేశం వద్ద సుమారు ఎన్ని అణ్వాయుధాలు ఉన్నట్లు అంచనా?
190

ప్రపంచ మహాసముద్రాల దినోత్సవాన్ని (World Oceans Day) ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు?
జూన్ 8

ఇటీవల తీవ్ర భీభత్సాన్ని సృష్టించి ఉత్తర దిశగా పయనించిన 'జాంగ్మీ' (Jangmi) టైఫూన్ ప్రభావంతో ఏ దేశంలో 23 మంది గాయపడ్డారు?
జపాన్

యూట్యూబ్ లైవ్ యోగా స్ట్రీమ్‌లో (YouTube Live Yoga Stream) అత్యధిక వీక్షకులతో (Largest Viewership) ప్రపంచ రికార్డును నెలకొల్పడమే లక్ష్యంగా జూన్ 14న ప్రపంచవ్యాప్త ఆన్‌లైన్ యోగా కార్యక్రమాన్ని (Global Online Yoga Event) ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ నిర్వహించింది?
కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ (Ministry of Ayush)

డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ (తపాలా శాఖ) ద్వారా 'డ్రోన్ ఆధారిత మెయిల్ ట్రాన్స్‌మిషన్ సర్వీస్' (Drone-Based Mail Transmission Service)ను ఏ రాష్ట్రంలో ఇటీవల ఏ కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య ఎమ్. సింథియాప్రకటించారు?
హిమాచల్ ప్రదేశ్‌లో

Schools 360

Content Writer