AP TS School Assembly News Headlines on 11th December 2025 నేటి పాఠశాల అసెంబ్లీ వార్తలు అనే ఈ విభాగంలో ప్రతీరోజు స్కూల్ అసెంబ్లీ సమయంలో చదవడానికి ఉపయోగపడే వార్తలు ఉంచబడును.. ఈ పేజీ ప్రతీదీనం అప్డేట్ అగును.
🏵️Vandemaataram 🌻Maa Telugu Talliki 🌺Nature prayer *💥🌳🌴💥ప్రకృతి ప్రార్ధన💥🦜🪿💥* *🌸కిలకిలరావాలతో ప్రభాత గీతం పాడే పక్షి జాతికి, ప్రాణవాయువునిచ్చి పచ్చదనాన్ని నింపే వృక్షకోటికి వినమ్రతతో నమస్కరిస్తున్నాను* *🌻చిట్టిచీమలతో శ్రమజీవన సౌందర్యాన్ని , కాకుల గుంపులతో సమైక్యతా సందేశాన్ని ఉపదేశిస్తున్న ఓ ఆపస్ ప్రకృతి మాతా ! నీకు పాదాభివందనం చేస్తున్నాను* *🌸నేను ప్రకృతిలో ఒక భాగం మాత్రమేనని గుర్తిస్తున్నాను. నాలాగే ఉడతకైనా, చిరుతకైనా జీవించే హక్కు ఉంటుంది. కాబట్టి వాటి ఆవాసాలకు ఆటంకం కలిగించననీ, ప్రకృతి వనరులను దుర్వినియోగం చేయననీ, విష రసాయనాలతో, ప్లాస్టిక్ వ్యర్థాలతో కాలుష్యం కలిగించనని కలిగించనని ప్రమాణం చేస్తున్నాను* *🌻విచక్షణతో వ్యవహరిస్తూ, మూఢనమ్మకాలు నిర్మూలించేందుకు కృషి చేస్తాను* *🌸 ప్రకృతిని పరిరక్షించేందుకు జీవవైవిధ్యాన్ని కాపాడతానని శాస్త్రీయ దృక్పథం కలిగిన విద్యార్థిగా మెలుగుతానని ఆపస్ ప్రకృతి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను* 🏵️PLEDGE (English ) ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు🌀 ఢిల్లీకి నోయిడా…. తెలంగాణకు కొడంగల్, అంతర్జాతీయ స్థాయిలో లగచర్ల పారిశ్రామికవాడ, మహిళల ఉత్పత్తుల విక్రయానికి అమెజాన్తో సంప్రదింపులు, కొడంగల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి . 🌀 సిజెఐ జస్టిస్ సూర్యకాంత్ ను ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మ , హాజరైన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ,ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి , తొలి రోజే 17 కేసులు విచారించిన సీజేఐ . 🌀 దిగ్గజ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర కన్నుమూత , షోలే తో బాలీవుడ్లో తిరుగులేని గుర్తింపు, రొమాంటిక్, యాక్షన్ చిత్రాలకు ప్రసిద్ధి . 🌀 సమగ్ర , సమ్మిళిత అభివృద్ధే లక్ష్యం .విద్యా, వైద్యం, పారిశుధ్యం, స్వచ్ఛ వాతావరణం, భద్రతకు పెద్దపీట. ఐటీ, ఏఐ, సైబర్ సెక్యూరిటీలో ఆధునిక నైపుణ్య శిక్షణ. తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ 2047 పై శాఖల వారిగా నేటి నుంచి సీఎం సమీక్ష. 🌀 రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూలు నోటిఫికేషన్ జారీకి రంగం సిద్ధమైంది. 31 జిల్లాల్లోని 545 గ్రామీణ మండలాల్లోని 12,760 పంచాయతీలు ,1,13,534 వార్డుల్లో నోటిఫికేషన్ జారీ కానుంది. 🌀 అడ్డగోలుగా ఎల్ఓసి జారీ చేస్తారా! మార్గదర్శకాలు పట్టించుకోరా ?విదేశీ పౌరసత్వం ఉన్న వారిపై ఇలా చేస్తే ఎలా ? పోలీసుల నిలదీసిన హైకోర్టు. 🏆 క్రీడా వార్తలు 🏆 అందుల ప్రపంచకప్ ను గెలుచుకుని స్వదేశానికి చేరుకున్న భారత జట్టు. ఫైనల్ లో నేపాల్ ను ఓడించింది. బ్యాడ్మింటన్‌లో, లక్ష్య సేన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ 500 టైటిల్‌ను గెలుచుకుని, ఈ సీజన్‌లో తన మొదటి విజయాన్ని నమోదు చేసుకున్నాడు. 📖 నేటి సూక్తి 📖 సమాజంలో పెద్ద మొత్తంలో సలహాలు ఉచితంగా లభిస్తాయి కానీ సహాయం మాత్రం అరకొరగా మాత్రమే ఉంటుంది. 🩺 ఆరోగ్య చిట్కా 🩺 చలికాలంలో శరీరానికి వ్యాయామం చాలా అవసరం. 🌻 Importance of the dayఅంతర్జాతీయ మహిళా హింసా వ్యతిరేక దినోత్సవం: నవంబర్ 25 ను “అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేక దినోత్సవం” (International Day for the Elimination of Violence against Women) గా జరుపుకుంటారు. ఈరోజు పదముResilience (రిజిలియన్స్) – కష్టాలు, సమస్యల నుంచి త్వరగా కోలుకునే శక్తి. 🌺General knowledge ( GK ) 🏵️English News 🌻HM’s note National Anthem మహిళలపై హింసా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా, విద్యార్థులు సమానత్వం మరియు గౌరవం అనే అంశంపై ప్రతిజ్ఞ చేయవచ్చు.
|









