CBSE Class 10 Telugu Telangana (089) Syllabus 2026-27 PDF


CBSE Class 10 Telugu-Telangana Syllabus 2026-27: Download the CBSE Class 10 Telugu (Telangana) Syllabus in a PDF document for your exam preparation. Here, Schools360.The team provides you with the CBSE Class 10 Telugu-Telangana Exam Pattern & Syllabus in detail.

CBSE తెలంగాణా తెలుగు Syllabus 2026-27

Name of the Education BoardCentral Board of Secondary Education
Parent organizationMinistry of Human Resource Development
Type of EducationGovernmental Board of Education
Standard10th class / Class X
CategorySyllabus
Name of the SubjectTelugu Telangana
Syllabus DownloadPDF Format Download
official Websitewww.cbse.nic.in

CBSE Class 10 Telugu-Telangana Syllabus 2026-27

Here is the detailed syllabus for the Vennela-5 (Class 10) curriculum for the academic year 2026-27.

వెన్నెల – ౫ వార్షిక ప్రణాళిక (Vennela 5 Curriculum 2026-2027)

Lesson Number & Lesson Name (పాఠం క్రమసంఖ్య & పాఠం పేరు)Number of Periods (కాలాంశాల సంఖ్య)Marks Weightage (మార్కుల ప్రాధాన్యత)Learning Objectives (అభ్యసన లక్ష్యాలు)Teaching Learning Process (బోధనాభ్యసన ప్రక్రియ)Learning outcome with specific competency (నిర్దిష్ట సామర్థ్యాలతో కూడిన అభసన ఫలితాలు)

1. చల్దులారగించుట (1. Chaldulaaraginchuta)

10

01 మార్కు (Marks), 02 మార్కులు (Marks)

పద్యాలను రాగ, భావయుక్తంగా పాడగలుగుతారు. పాఠ్యభాగ సారాంశాన్ని, బాల్యస్మృతులను సొంత మాటలలో చెప్పగలుగుతారు. రాయగలుగుతారు. పాఠ్యభాగం ఆధారంగా లేఖ, దినచర్య రాయగలుగుతారు. నైతిక విలువలను గురించి చెప్పగలుగుతారు.

ఖండపద్దతి (Khanda Paddhati), గాన పద్ధతి (Gaana Paddhati), వ్యాఖ్యాన పద్ధతి (Vyaakhyaana Paddhati), అనుభవ పద్ధతి (Anubhava Paddhati).

పద్యాలను రాగ, భావయుక్తంగా పాడగలగాలి. పద్యభావాలు, పాఠ్యభాగ సారాంశాలు, స్వీయ అనుభవాలను సొంతమాటలలో చెప్పగలగాలి, రాయగలగాలి. భాగవతంలోని కథలను చెప్పగలగాలి, రాయగలగాలి.

2. పొడుపు కథలు (2. Podupu Kathalu)

10

01 మార్కు (Mark), 02 మార్కులు (Marks), 04 మార్కులు (Marks)

విన్న, చదివిన అంశాల ఆధారంగా అభిప్రాయాన్ని చెప్పగలుగుతారు. రాయగలుగుతారు. ఒక విషయంపై ప్రాథమిక అవగాహన కలుగజేసే ముందుమాట’ విధానాలను వివరించగలుగుతారు. భాషలో పొడుపు కథల ప్రాధాన్యాన్ని వివరిస్తూ లేఖ, సంభాషణ రాయగలుగుతారు.

అర్థగ్రాహ్య పద్ధతి (Arthagrahya Paddhati), వివరణాత్మక పద్ధతి (vivaranaatmaka), చర్చా పద్ధతి (Charcha Paddhati), రచన సవరణ పద్దతి (Rachana savarana Paddhati).

పాఠ్యభాగ పూర్వావగాహన ప్రారంభచర్చలు చేయగలగాలి. సారాంశాన్ని సొంతమాటలలో వివరించగలగాలి. భాషలో పొడుపు కథల ప్రాధాన్యాన్ని వివరిస్తూ లేఖ, సంభాషణ రాయడానికి సరైన వాక్యనిర్మాణం చేయగలగాలి.

3. ప్రపంచ పదులు (3. Prapancha Padulu)

10

01 మార్కు (Marks), 02 మార్కులు (Marks)

గేయాన్ని రాగ, భావయుక్తంగా పాడగలుగుతారు. పాఠ్యభాగ సారాంశాన్ని, సొంత మాటలలో చెప్పగలుగుతారు, రాయగలుగుతారు. లేఖ రాయగలుగుతారు. నైతిక విలువలను గురించి చెప్పగలుగుతారు.

అర్థగ్రాహ్య పద్ధతి (Arthagrahya Paddhati), చర్చా పద్ధతి (Charcha Paddhati), సృజనాత్మక పద్ధతి (Srujanatmaka Paddhati).

గేయాన్ని రాగ, భావయుక్తంగా పాడగలగాలి. గేయ సారాంశాన్ని, స్వీయ అనుభవాలను సొంతమాటలలో చెప్పగలగాలి, రాయగలగాలి. గేయంలో చెప్పిన విలువలను నిజజీవితంతో అన్వయించి చెప్పగలగాలి, రాయగలగాలి.

4. భాగ్యోదయం (4. bhaagyodayam)

10

01 మార్కు (Mark), 02 మార్కులు (Marks), 04 మార్కులు (Marks)

విన్న, చదివిన అంశాల ఆధారంగా అభిప్రాయాన్ని చెప్పగలుగుతారు, రాయగలుగుతారు. జీవిత చరిత్రల వలన కలిగే ప్రయోజనాలు చెప్పగలుగుతారు. సాంఘిక అసమానతలను తొలగించడానికి చదువుప్రాధాన్యత గురించి సంభాషణ రాయగలుగుతారు.

కథన పద్ధతి (Kathana Paddhati), చిత్ర ప్రదర్శన పద్దతి (chitra Pradarshana Paddhati), పరికల్పన పద్ధతి (Parikalpana Paddhati), చర్చా పద్ధతి (Charcha paddhati).

పాఠ్యభాగ పూర్వావగాహన ప్రారంభచర్చలు చేయగలగాలి. సారాంశాన్ని సొంతమాటలలో వివరించగలగాలి. తెలుసుకున్న విషయం ఆధారంగా సంభాషణలు రాయగలగాలి.

5. నీతి పరిమళాలు (5. Neeti Parimalaalu)

10

01 మార్కు (Mark), 02 మార్కులు (Marks), 06 మార్కులు (Marks)

పద్యాలను రాగ, భావయుక్తంగా పాడగలుగుతారు. పాఠ్యభాగ సారాంశాన్ని, సొంత మాటలలో చెప్పగలుగుతారు, రాయగలుగుతారు. పాఠ్యభాగం ఆధారంగా లేఖ రాయగలుగుతారు. నైతిక విలువలను గురించి చెప్పగలుగుతారు.

గాన, వ్యాఖ్యాన పద్ధతి (Gaana, vyaakhyaana Paddhati), ఉదాహరణ పద్దతి (Udaaharana Paddhati), ప్రశ్నోత్తర పద్ధతి (Prashnottara Paddhati), పూర్ణపద్ధతి (Poorna Paddhati).

పద్యాలను రాగ, భావయుక్తంగా పాడగలగాలి. పద్యభావాలు, పాఠ్యభాగ సారాంశాలు, స్వీయ అనుభవాలను సొంతమాటలలో చెప్పగలగాలి, రాయగలగాలి. నైతిక విలువల గురించి చెప్పగలగాలి, రాయగలగాలి.

6. తెలుగు మహిళ (6. Telugu Mahila)

10

01 మార్కు (Mark), 02 మార్కులు (Marks), 04 మార్కులు (Marks)

విన్న, చదివిన అంశాల ఆధారంగా అభిప్రాయాన్ని చెప్పగలుగుతారు, రాయగలుగుతారు. ప్రాంతీయ సంస్కృతి, సంప్రదాయాల కాపాడంలో స్త్రీల పాత్ర గురించి వివరించగలుగుతారు. తెలిసిన విషయం గురించి సంభాషణ రాయగలుగుతారు.

అర్థగ్రాహ్య పద్ధతి (Arthagrahya paddhati), వ్యవహారిక అన్వయ పద్దతి (vyvaharika Anvaya Paddhati), చర్చా పద్ధతి (Charcha paddhati), రచన సవరణ పద్దతి (Rachana savarana paddhati).

పాఠ్యభాగ పూర్వావగాహన ప్రారంభచర్చలు చేయగలగాలి. సారాంశాన్ని సొంతమాటలలో వివరించగలగాలి. తెలుసుకున్న విషయం ఆధారంగా సంభాషణలు రాయగలగాలి.

7. శ్రమజీవి (7. Sramajeevi)

8

01 మార్కు (Mark), 02 మార్కులు (Marks)

గేయాన్ని రాగ, భావయుక్తంగా పాడగలుగుతారు. పాఠ్యభాగ సారాంశాన్ని, సొంత మాటలలో చెప్పగలుగుతారు, రాయగలుగుతారు. శ్రమజీవన సౌందర్యాన్ని గురించి అందులోని నైతిక విలువలను గురించి చెప్పగలుగుతారు. దానికి సంబంధించి సంభాషణ, దినచర్య రాయగలుగుతారు.

భావాత్మక పఠన పద్ధతి (Bhaavaatmaka Pathana Paddhati), వ్యక్తిగత అనుభవ పద్ధతి (Vyaktigata Anubhava Paddhati), ప్రత్యక్ష అనుభవ పద్దతి (Pratyaksha Anubhava Paddhati), చర్చా పద్ధతి (Charcha paddhati).

గేయాన్ని రాగ, భావయుక్తంగా పాడగలగాలి. గేయ సారాంశాన్ని, స్వీయ అనుభవాలను సొంతమాటలలో చెప్పగలగాలి, రాయగలగాలి. గేయంలో చెప్పిన విలువలను నిజ జీవితంతో అన్వయించి వివిధ రకాలుగా రాయగలగాలి.

8. హస్తకళా నైపుణ్యం (8. hastakalaa naipunyam)

10

01 మార్కు (Mark), 02 మార్కులు (Marks), 04 మార్కులు (Marks)

విన్న, చదివిన అంశాల ఆధారంగా అభిప్రాయాన్ని చెప్పగలుగుతారు, రాయగలుగుతారు. ప్రాంతీయ హస్తకళలను, కళాకారుల గొప్పదనం గురించి వివరించగలుగుతారు. తెలిసిన విషయం గురించి సంభాషణ రాయగలుగుతారు.

దృశ్య శ్రవణ పద్ధతి (Drushya Shravana Paddhati), చర్చా పద్ధతి (Charcha paddhati), పరికల్పన పద్ధతి (Parikalpana Paddhati), క్షేత్ర సందర్శన పద్ధతి (Kshetra Sandarshana Paddhati).

పాఠ్యభాగ పూర్వావగాహన ప్రారంభచర్చలు చేయగలగాలి. ప్రాంతీయ హస్తకళల అస్తిత్వం గురించి సొంతమాటలలో వివరించగలగాలి. తెలుసుకున్న విషయం ఆధారంగా సంభాషణలు రాయగలగాలి.

9. హంస ఎవరిది? (9. hamsa evaridi)

6

04 మార్కులు (Marks)

కథలోని సంఘటనలు, పాత్రలు, పరిణామాలను చదివి, రాయగలుగుతారు. కథలోని పాత్రలను, సంఘటనలను వివిధ కోణాలనుంచి పరిశీలించి విమర్శనాత్మకంగా చెప్పగలుగుతారు. కథలోని నీతిని, విలువలను, సమాజంతో అనుసంధానం చేసి చెప్పగలుగుతారు.

కథాకథన పద్ధతి (Kathaa Kathana Paddhati), ప్రాత్రాభినయ పద్ధతి (Paatraabhina Paddhati), ప్రశ్నోత్తర పద్ధతి (Prashnottara Paddhati), చర్చా పద్ధతి (Charcha Paddhati).

కథలోని సంఘటనల క్రమాన్ని చెప్పగలగాలి. కథద్వారా నేర్పే మానవీయ విలువలను గుర్తించి, సమాజ సందర్భాలతో అనుసంధానం చేయగలగాలి. అభిప్రాయాన్ని తార్కికంగా వివరించగలగాలి.

10. సమయస్ఫూర్తి (10. samayasphoorti)

6

04 మార్కులు (Marks)

కథలోని సంఘటనలు, పాత్రలు, పరిణామాలను చదివి, రాయగలుగుతారు. పాత్రలను, సంఘటనలను విమర్శనాత్మకంగా చెప్పగలుగుతారు. కథలోని నీతిని, విలువలను, సమాజంతో అనుసంధానం చేసి చెప్పగలుగుతారు.

కథాకథన పద్ధతి (Kathaa Kathana Paddhati), పాత్రాభినయ పద్ధతి (Paatraabhina Paddhati), ప్రశ్నోత్తర పద్ధతి (Prashnottara Paddhati), చర్చా పద్ధతి (Charcha Paddhati).

కథలోని సంఘటనల క్రమాన్ని చెప్పగలగాలి. కథద్వారా నేర్పే మానవీయ విలువలను గుర్తించి, సమాజ సందర్భాలతో అనుసంధానం చేయగలగాలి. అభిప్రాయాన్ని తార్కికంగా వివరించగలగాలి.

11. ఊరు – అడవి (11. Ooru Adavi)

6

04 మార్కులు (Marks)

కథలోని సంఘటనలు, పాత్రలు, పరిణామాలను చదివి, రాయగలుగుతారు. కథలోని పాత్రలను, సంఘటనలను వివిద కోణాలనుంచి పరిశీలించి విమర్శనాత్మకంగా చెప్పగలుగుతారు. కథలోని నీతిని, విలువలను, సమాజంతో అనుసంధానం చేసి చెప్పగలుగుతారు.

భావాత్మక పఠన పద్దతి (Bhaavaatmaka Paddhati), ప్రశ్నోత్తర పద్ధతి (Prashnottara Paddhati), చర్చా పద్ధతి (Charcha Paddhati).

కథలోని సంఘటనల క్రమాన్ని చెప్పగలగాలి. కథద్వారా నేర్పే మానవీయ విలువలను గుర్తించి, సమాజ సందర్భాలతో అనుసంధానం చేయగలగాలి. అభిప్రాయాన్ని తార్కికంగా వివరించగలగాలి.

12. రిక్షావాలా (12. rikshaavaalaa)

6

04 మార్కులు (Marks)

కథలోని సంఘటనలు, పాత్రలు, పరిణామాలను చదివి రాయగలుగుతారు. కథలోని పాత్రలను, సంఘటనలను వివిధ కోణాలనుంచి పరిశీలించి విమర్శనాత్మకంగా చెప్పగలుగుతారు. కథలోని నీతిని, విలువలను, సమాజంతో అనుసంధానం చేసి చెప్పగలుగుతారు.

భావాత్మక పఠన పద్ధతి (Bhaavaatmaka Paddhati), ప్రశ్నోత్తర పద్ధతి (Prashnottara Paddhati), చర్చా పద్ధతి (Charcha Paddhati).

కథలోని సంఘటనల క్రమాన్ని చెప్పగలగాలి. కథద్వారా నేర్పే మానవీయ విలువలను గుర్తించి, సమాజ సందర్భాలతో అనుసంధానం చేయగలగాలి. అభిప్రాయాన్ని తార్కికంగా వివరించగలగాలి.

సంస్కృత సంధులు

5

04 మార్కులు (Marks)

వాక్యాలలో సంధి పదాలను గురించగలుగుతారు. విడదీయగలుగుతారు. కలుపగలుగుతారు.

అనుమానోపపత్తి పద్ధతి (Anumaanopapatti Paddhati), సందర్భ ఆధారిత పద్ధతి (Sandarbha Adhaarita Paddhati).

సంధి పదాన్ని గుర్తించి దాన్ని సూత్రంతో అన్వయించగలగాలి. సంధి పదాన్ని విడదీయ గలగాలి. మూలపదాన్ని నిర్మించగలగాలి. సంధి పదాలను వర్గీకరించగలగాలి. సందర్భానుసారంగా పదాలను ఉపయోగించగలగాలి.

సమాసాలు

3

04 మార్కులు (Marks)

వాక్యాలలో సమాస పదాలను గురించగలుగుతారు. సమాస పదానికి విగ్రహవాక్యం రాయగలుగుతారు.

నిగమనోపపత్తి పద్ధతి (nigamanopapatti Paddhati), యత్నలోప పద్ధతి (Yatnalopa paddhati), సందర్భ ఆధారిత పద్ధతి (Sandarbha Adhaarita Paddhati).

సమాస పదాన్ని గుర్తించి దాన్ని సూత్రంతో అన్వయించగలగాలి. సమాస పదానికి విగ్రహవాక్యాన్ని రాయగలగాలి. విగ్రహవాక్యాన్ని సమాసపదంగా మార్చగలగాలి. సమాస పదాలను వర్గీకరించగలగాలి. సందర్భానుసారంగా పదాలను ఉపయోగించగలగాలి.

విభక్తులు

4

04 మార్కులు (Marks)

సందర్భానుసారంగా విభక్తిని ఉపయోగించి మాట్లాడగలుగుతారు. రాయగలుగుతారు.

సందర్భ ఆధారిత పద్ధతి (Sandarbha Adhaarita Paddhati), వాక్య నిర్మాణ పద్ధతి (Vaakya Nirmaana Paddhati).

సందర్భానుసారంగా సరైన విభక్తిని ఉపయోగించి మాట్లాడగలగాలి, రాయగలగాలి. సరైన వాక్య నిర్మాణ విధానాన్ని ప్రదర్శించ గలగాలి. లేఖ/దినచర్య/సంభాషణలలో సందర్భానుసారంగా ఉపయోగించగలగాలి.

పర్యాయపదాలు

4

04 మార్కులు (Marks)

దైనందిన జీవితంలో సందర్భోచిత పదజాలాన్ని ఉపయోగించి రాయగలుగుతారు.

వాక్య నిర్మాణ పద్ధతి (Vaakya Nirmaana Paddhati), క్రీడా పద్ధతి (Kridaa Paddhati), ఉదాహరణ పద్ధతి (Udaaharana Paddhati).

దైనందిన జీవితంలో సరైన విధంగా ఉపయోగించగలగాలి. లేఖ/దినచర్య/సంభాషణలలో సందర్భానుసారంగా ఉపయోగించగలగాలి.

పారిభాషిక పదాలు

2

04 మార్కులు (Marks)

సరైన వివరణలు చెప్పగలుగుతారు, రాయగలుగుతారు.

వివరణాత్మక పద్ధతి (Vivaranaatmaka paddhati), క్రీడా పద్ధతి (Kridaa Paddhati).

సరైన వివరణలను చెప్పగలగాలి. అర్థగ్రహణం చేయగలగాలి.

ప్రక్రియలు

2

02 మార్కులు (Marks)

వివిధ ప్రక్రియల లక్షణలను చెప్పగలుగుతారు. రాయగలుగుతారు. ఆయా ప్రక్రియలను గుర్తించగలుగుతారు.

ఉదాహరణ పద్ధతి (Udaaharana Paddhati), ఆకాంక్ష పద్ధతి (Aakaanksha Paddhati), చర్చా పద్దతి (Charcha Paddhati).

సాహిత్య ప్రక్రియలను గుర్తించగలగాలి. వాటి లక్షణాలను చెప్పగలగాలి.

జాతీయాలు

4

02 మార్కులు (Marks)

అంతరార్థాన్ని గ్రహించగలుగుతారు. సందర్భోచితంగా ఉపయోగించగలుగుతారు.

ఉదాహరణ పద్ధతి (Udaaharana Paddhati), నటన పద్ధతి (Natana Paddhati), చిత్ర వినిమయ పద్ధతి (Chira Vinimaya Paddhati).

దైనందిన జీవితంలో సరైన విధంగా ఉపయోగించగలగాలి. లేఖ/దినచర్య/సంభాషణలలో సందర్భానుసారంగా ఉపయోగించగలగాలి.

సామెతలు

4

02 మార్కులు (Marks)

అంతరార్థాన్ని గ్రహించగలుగుతారు. సందర్భోచితంగా ఉపయోగించగలుగుతారు.

నటన పద్ధతి (Natana Paddhati), చిత్ర వినిమయ పద్ధతి (Chira Vinimaya Paddhati), ఉదాహరణ పద్ధతి (Udaaharana Paddhati).

దైనందిన జీవితంలో సరైన విధంగా ఉపయోగించగలగాలి. లేఖ/దినచర్య/సంభాషణలలో సందర్భానుసారంగా ఉపయోగించగలగాలి.

లేఖా రచన (lekhaarachana)

04 మార్కులు (Marks)

లేఖారచన విధివిధానాలు చెప్పగలుగుతారు. సందర్భోచితంగా ఉపయోగించగలుగుతారు.

తార్కిక పద్దతి (Taarkika Paddhati), చర్చా పద్ధతి (Charcha Paddhati), ఉదాహరణ పద్ధతి (Udaaharana Paddhati).

సమాచార వినిమయం చేయగలగాలి. భావాభివ్యక్తి చేయగలగాలి. సమకాలీన అంశాలపై విశ్లేషణ చేయగలగాలి.

దినచర్య (Dinacharya)

10

04 మార్కులు (Marks)

దినచర్య విధివిధానాలు చెప్పగలుగుతారు. స్వీయ అనుభూతులను సందర్భోచితంగా వ్యక్తంచేయగలుగుతారు.

ఉదాహరణ పద్ధతి (Udaaharana Paddhati), ఆకాంక్ష పద్ధతి (Aakaanksha), చర్చా పద్ధతి (Charcha paddhati).

సమాచార వినిమయం చేయగలగాలి. భావాభివ్యక్తి చేయగలగాలి. సమకాలీన అంశాలపై విశ్లేషణ చేయగలగాలి.

సంభాషణ (Sambhaashana)

04 మార్కులు (Marks)

సంభాషణ విధివిధానాలు రాయగలుగుతారు. సందర్భోచితంగా వాక్యనిర్మాణం చేయగలుగుతారు.

ఉదాహరణ పద్ధతి (Udaaharana Paddhati), తార్కిక పద్ధతి (Taarkika Paddhati), చర్చా పద్ధతి (Charcha Paddhati).

సమాచార వినిమయం చేయగలగాలి. భావాభివ్యక్తి చేయగలగాలి. సమకాలీన అంశాలపై విశ్లేషణ చేయగలగాలి.


Internal Assessment – (నిర్మాణాత్మక మూల్యాకనం)

S. No.Type of assessment (అసెస్‌మెంట్ రకం)Marks
1.

పీరియాడిక్ టెస్టులు (Periodic Tests): నిర్మాణాత్మక మూల్యాకనం – 1, నిర్మాణాత్మక మూల్యాకనం – 2, నిర్మాణాత్మక మూల్యాకనం – 3

05

2.

పోర్ట్‌ఫోలియో (Portfolio): విద్యార్థుల పనులను, ఆలోచనలను, సృజనాత్మకతను ప్రదర్శించే పద్ధతి. ఇందులో ఏకీకృత కళాత్మక విద్య (Art Integrated Learning), విద్యార్థికి కేటాయించిన పనులు (Assignments), వ్యాఖ్యానం (annotations), సంక్షిప్తంగా క్రమపద్ధతిలో విషయాన్ని కూర్చడం (Summarization and Organisation of ideas), ఫోటోలు (Photos), ప్రెజెంటేషన్స్ (presentations) మొదలయినవి ఉంచాలి.

05

3.

సబ్జెక్ట్ ఎన్‌రిచ్‌మెంట్ (Subject Enrichment): Listening Skills, Speaking skills, Reading Skills, లేఖన నైపుణ్యం (writing skills), ఆహ్వాన / అభినందన/ధన్యవాద పత్రికలు (Invitation/Greetings/thanking cards), సమీక్షలు (Reviews), యాత్రాచరిత్ర (Travelogue), నాటకరచన (Skit writing), రేడియోకార్యక్రమ రూపకల్పన (Creating Radio Show), గోడపత్రికలు (Wall Posters), చిత్ర వర్ణన (Description of Images), సమాచార పలకలు (Information Boards), కృతజ్ఞతా సమర్పణ (Vote of thanks), పద్య పఠన పోటీలు (Recitation Competitions), ఏకపాత్రాభినయం (Mono action) etc.

05

4.

మల్టిపుల్ అసెస్‌మెంట్స్ (Multiple Assessments): విద్యార్థుల పనుల/ ప్రవర్తనల పరిశీలన (Observation), మౌఖిక పరీక్షలు (Oral Tests), వ్యక్తిగత కృత్యాలు (Individual Work), జట్టు పనులు (Group Work), తరగతి గది చర్చలు (Class discussions), పర్యటనలు/ పరిశీలనలు (Field – work), భావనా పటాలు (Consept maps), ఆకృతి పటాలు (Graphic Organisers), దృశ్య ప్రాతినిధ్యం (Visual representation), క్విజ్ (Quiz), ప్రాజెక్టు పని (Project work), స్వీయ మూల్యాంకనం (Self-assessment), సహచర మూల్యాంకనం (Peer Assessment), సామూహిక ప్రాజెక్టులు (collaborative projects), ప్రయోగాలు (Experiments), ప్రదర్శనలు (demonstrations) మొదలయినవి.

05

Schools 360

Content Writer