Static GK in Telugu: జీవులు క్విజ్ Quiz on Birds & Animals


ప్రస్తుతం జీవించి ఉన్న అతిపెద్ద పక్షి ఏది?
ఆస్ట్రిచ్ (ఉష్ట్రపక్షి / Ostrich)

ఉభయచరాల్లో (Amphibians) అతిపెద్దది ఏది?
చైనీస్ జెయింట్ సాలమండర్ (Chinese Giant Salamander)

జంతుజాలంలో అతిపెద్ద కళ్లు ఉన్న జీవి ఏది?
జెయింట్ స్క్విడ్ (Giant Squid)

ప్రపంచంలోనే అతి చిన్న కోతి ఏది?
పిగ్మీ మార్మోసెట్ (Pygmy Marmoset)

అత్యంత పొడవైన పాము ఏది?
రెటిక్యులేటెడ్ కొండచిలువ (Reticulated Python)

భూమి మీద నివసించే అతిపెద్ద జంతువు ఏది?
ఆఫ్రికన్ సవన్నా ఏనుగు (African Savanna Elephant)

ప్రపంచంలోనే అతి చిన్న సీతాకోకచిలుక ఏది?
వెస్ట్రన్ పిగ్మీ బ్లూ బటర్‌ఫ్లై (Western Pygmy Blue Butterfly)

ప్రపంచంలోనే అతిపెద్ద చేప ఏది?
వేల్ షార్క్ (Whale Shark)

గుడ్లు పెట్టే క్షీరదం (Mammal) ఏది?
ప్లాటిపస్ (Platypus)

సముద్రంలో అత్యంత లోతుగా డైవ్ చేయగల క్షీరదం ఏది?
స్పెర్మ్ వేల్ (Sperm Whale)

అత్యంత సుదూర వలస ప్రయాణం చేసే పక్షి ఏది?
ఆర్కిటిక్ టెర్న్ (Arctic Tern)

భూమిపై నివసించే అతిపెద్ద మాంసాహార జంతువు (Predator) ఏది?
పోలార్ బేర్ (ధృవపు ఎలుగుబంటి / Polar Bear)

బల్లుల జాతిలో (Lizards) అతిపెద్ద జీవి ఏది?
కొమోడో డ్రాగన్ (Komodo Dragon)

పిల్లి జాతిలో (Cat family) అతిపెద్ద జంతువు ఏది?
సైబీరియన్ పులి (Siberian Tiger)

కోతుల జాతిలో అతిపెద్ద జీవి ఏది?
మాండ్రిల్ (Mandrill)

వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ (WWF) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
గ్లాండ్, స్విట్జర్లాండ్ (Gland, Switzerland)

'చైనీస్ వాటర్ డ్రాగన్' అనేది ఏ రకమైన జీవి?
ఒక రకమైన బల్లి (A type of lizard)

హెలికాప్టర్ లాగా గాలిలో ఒకేచోట స్థిరంగా ఎగరగల పక్షి ఏది?
హమ్మింగ్‌బర్డ్ (Hummingbird)

సరీసృపాలలో (Reptiles) అతిపెద్ద జీవి ఏది?
సాల్ట్‌వాటర్ మొసలి (ఉప్పునీటి మొసలి / Saltwater Crocodile)

భూమి మీద అత్యంత వేగంగా ప్రయాణించే జీవి ఏది?
పెరెగ్రిన్ ఫాల్కన్ (Peregrine Falcon)

అత్యధిక కాళ్లు ఉన్న జీవి ఏది?
మిల్లీపీడ్ (Millipede)

భూమి మీద ఇప్పటివరకు జీవించిన వాటిలో అతిపెద్ద పక్షి ఏది?
ఏపియోర్నిస్ మాక్సిమస్ (ఎలిఫెంట్ బర్డ్ / Aepyornis maximus)

అతిపెద్ద గుడ్డును పెట్టే పక్షి ఏది?
ఆస్ట్రిచ్ (ఉష్ట్రపక్షి / Ostrich)

ప్రపంచంలోనే అతి చిన్న పక్షి ఏది?
బీ హమ్మింగ్‌బర్డ్ (Bee Hummingbird)

ప్రపంచంలోనే ఎగరగల అతి బరువైన పక్షి ఏది?
కోరి బస్టర్డ్ (Kori Bustard)

పక్షులలో అత్యంత పొడవైనది ఏది?
సారస్ కొంగ (Sarus Crane)

అతిపెద్ద హమ్మింగ్‌బర్డ్ ఏది?
జెయింట్ హమ్మింగ్‌బర్డ్ (Giant Hummingbird)

ప్రస్తుతం ఉన్న పక్షులలో అతిపెద్ద వింగ్‌స్పాన్ (రెక్కల విస్తృతి) కలిగిన పక్షి ఏది?
స్నోవీ ఆల్బట్రాస్ (Snowy Albatross)

ఎగరలేని పక్షులలో అతి చిన్నది ఏది?
ఇన్‌యాక్సెసిబుల్ ఐలాండ్ రైల్ (Inaccessible Island Rail)

వేటాడే పక్షులలో (Birds of prey) అతిపెద్దది ఏది?
ఆండియన్ కాండోర్ (Andean Condor)

ప్రపంచంలోనే అతిపెద్ద డేగ ఏది?
స్టెల్లర్స్ సీ ఈగల్ (Steller’s Sea Eagle)

ప్రపంచంలోనే అతి చిన్న చిలుక ఏది?
బఫ్-ఫేస్డ్ పిగ్మీ ప్యారెట్ (Buff-faced Pygmy Parrot)

అత్యంత వేగంగా ఎగిరే పక్షి ఏది?
గ్రే-హెడెడ్ ఆల్బట్రాస్ (Grey-headed Albatross)

అత్యంత నెమ్మదిగా ఎగిరే పక్షులు ఏవి?
అమెరికన్ వుడ్‌కాక్, యురేషియన్ వుడ్‌కాక్ (American/Eurasian Woodcock)

అత్యంత వేగంగా ఈదగల పక్షి ఏది?
జెంటూ పెంగ్విన్ (Gentoo Penguin)

ఎగరగలిగే పక్షులలో అత్యంత వేగంగా పరిగెత్తగల పక్షి ఏది?
గ్రేటర్ రోడ్‌రన్నర్ (Greater Roadrunner)

అత్యంత వేగంగా పరిగెత్తే పక్షి ఏది?
ఆస్ట్రిచ్ (ఉష్ట్రపక్షి / Ostrich)

సెకనుకు అత్యధిక సార్లు రెక్కలు ఆడిచే పక్షి ఏది?
రూబీ-థ్రోటెడ్ హమ్మింగ్‌బర్డ్ (Ruby-throated Hummingbird)

ప్రపంచంలోనే అత్యంత బిగ్గరగా శబ్దం చేసే పక్షి ఏది?
వైట్ బెల్‌బర్డ్స్ (White Bellbird)

అత్యంత ఎత్తైన 'పిచ్'లో (Pitch) శబ్దం చేసే పక్షి ఏది?
బ్లాక్ జాకోబిన్ హమ్మింగ్‌బర్డ్ (Black Jacobin Hummingbird)

Schools 360

Content Writer