ప్రత్యక్ష దైవాలు AP 10th Class Telugu 1st Lesson Material

at

WhatsApp Channel Join Now
arattai Join Arattai Channel Join Now
Telegram Channel Join Now

AP SCERT has revised the 10th-Class Textbooks for the Academic Year 2024-25. Students need to Study the Latest Textbook for upcoming Exams in March/April 2025. Note that for CBSE Schools, the old textbook is to be followed.

For AP State Board Recognized Schools Revised New textbooks must be considered. Here in this Article AP 10th Class Telugu 1st Lesson ప్రత్యక్ష దైవాలు Pratyaksha Daivalu is given.రాష్ట్ర ప్రభుత్వ సిలబస్ కలిగిన అన్ని పాఠశాలలు క్రొత్త సిలబస్ ప్రకారం అనుసరించవలెను. ఇక్కడ మీకోసం పదో తరగతి తెలుగు మొదటి పాఠం గైడ్ , మెటీరీయల్ ఇస్తున్నాం..

1. ప్రత్యక్ష దైవాలు Pratyaksha Daivalu

చదవండి ఆలోచించి చెప్పండి

ఆ.వె. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు
పుట్టనేమి? వాఁడు గిట్టనేమి?
పుట్టలోన చెదలు పుట్టదా! గిట్టదా!
విశ్వదాభిరామ వినురవేమ.

-వేమన శతకం


భావం: పుట్టలో చెదపురుగులు పుడతాయి, చనిపోతాయి. వాటి జీవనం వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. అలాగే
జన్మనిచ్చిన తల్లిదండ్రులంటే ఎటువంటి దయ, కనికరం లేనివాడు పుట్టినా, చనిపోయినా ఏమీ ప్రయోజనం |
లేదు. అటువంటి వారి పుట్టుక వృథా అని పద్యభావం..

ప్రశ్నలు


1. పుత్రులు ఎవరి మీద దయ కలిగి ఉండాలి ?

జ. ఈ లోకంలో పుత్రులకు తల్లిదండ్రులకంటే గొప్పవారు ఎవ్వరూ లేరు. తల్లిదండ్రులు పుత్రులకు జన్మనిచ్చి పెంచి
పెద్ద చేస్తారు. వారికి అవసరమైన అన్నింటినీ అందిస్తారు. అందుకే, పుత్రులు తమ తల్లిదండ్రుల పట్ల ఎంతో
దయతో, గౌరవంగా ఉండాలి. వారికి ఎల్లప్పుడూ సాయం చేయాలి.

2. కవి చెదపురుగులతో ఎవరిని పోల్చాడు ? ఎందుకు ?


జ. కవి చెదపురుగులతో తల్లిదండ్రుల పట్ల దయ చూపని పుత్రులను పోల్చాడు. ఎందుకంటే, పుట్టలో పుట్టి, చనిపోయే
చెదపురుగుల వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు. అదే విధంగా, తల్లిదండ్రులకు ఎటువంటి సహాయం చేయకుండా,
వారి పట్ల గౌరవం లేకుండా ఉండే పుత్రులు కూడా చెదపురుగుల లాంటివారే.

3. తల్లిదండ్రుల సేవలో తరించిన మహనీయుల పేర్లు చెప్పండి.

జ. తల్లిదండ్రుల సేవతో తరించిన మహానుభావులు:
శ్రీరాముడు : చిన్ననాటి నుండి తల్లిదండ్రుల మాటను పాటించి, వారి ఆదేశాలను శిరసావహించి, వారి సేవలో
మునిగి తరించిన మహనీయుడు శ్రీరాముడు.
గరుత్మంతుడు తన తల్లిని దాస్యం నుండి విముక్తి చేయడానికి అమృతం తెచ్చిన గరుత్మంతుడు తల్లి పట్ల తన
భక్తిని చాటిచెప్పాడు.
శివాజీ : తన తల్లి జిజియాబాయి సలహాలను పాటించి, ఒక గొప్ప రాజుగా ఎదిగాడు.
శ్రవణ కుమారుడు; తన తల్లిదండ్రులకు ఎంతో సేవ చేసి, వారి ఆశీస్సులు పొందిన మహాభక్తుడు శ్రవణ
కుమారుడు.

కవి పరిచయం

కవిపేరు – ఎఱ్ఱన
కాలం – 14వ శతాబ్ద
తల్లిదండ్రులు – పోతమ్మ, సూరన
జన్మస్థలం – పాకనాడు సీమ అని పిలువబడే ప్రకాశం జిల్లా కందుకూరు సమీపంలోని గుడ్లూరు గ్రామం.
ఆస్థానం – అద్దంకిని రాజధానిగా చేసుకొని పరిపాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థానకవి.
రచనలు – రామాయణం, హరివంశం, మహాభారతం (అరణ్యపర్వశేషం), నృసింహపురాణం.
బిరుదులు – శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు.
రచనాశైలి – ఎఱ్ఱన రచనాశైలి సూక్తివైచిత్రిగా పేరెన్నికగన్నది.
ప్రత్యేకతలు మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో ఎఱ్ఱన మూడవవాడు.

పాఠం యొక్క ఉద్దేశం

లోకంలో కంటికి కనిపించే దేవతలు అమ్మానాన్నలు. వారిని ఎల్లప్పుడూ సేవించడమే ధర్మాలన్నింటిలో ఉత్తమ ధర్మం. ఆ ధర్మాన్ని అనుసరించాలని చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం.

ప్రక్రియ – ఇతిహాసం

ఇతిహాసం అంటే ‘ఇలా జరిగింది’ అని అర్థం. ఇది ఒక కాలంలో ఒక రాజవంశానికో, ఒక జాతికో సంబంధించిన చారిత్రకాంశం గల బృహద్రచన. ఇవి తొల్లిటి కథలు. ఇవి గ్రంథ రూపంలోకి రాకముందు ఆశు రూపంలో ఉండేవి. ఇతిహాసాలు చతుర్విధ పురుషార్థాలు, ఉపదేశాలు, పూర్వ వృత్తాంత కథలతో కూడి ఉంటాయి. ఇతిహాసాలలో కథా కథనానికి ప్రాధాన్యం ఉంటుంది. రామాయణ, మహాభారతాలు ఇతిహాసాలు,

నేపథ్యం

అరణ్యవాసంలో ఉన్న ధర్మరాజుతో మార్కండేయ మహర్షి కౌశికుని గాథను చెబుతాడు. కౌశికుని విద్యాభ్యాసం ముగిసినట్లు గురువు ప్రకటిస్తాడు. గృహస్థాశ్రమం స్వీకరించి తల్లిదండ్రులను సేవించమని చెబుతాడు. కౌశికుడు మరింత జ్ఞానార్జన చేసి సకల ధర్మాలను తెలుసుకోవాలని బయలుదేరతాడు. ఒకనాడు మర్రిచెట్టు నీడలో కూర్చుని వేదాధ్యయనం చేస్తుంటాడు. చెట్టుపైన ఉన్న పక్షి ఆయనపై రెట్ట వేస్తుంది. కోపంతో దాని ఒక చూడగా అది కాలి బూడిదవుతుంది. ఆ తర్వాత మధ్యాహ్న సమయంలో ఒక ఇంటి ముందు నిలబడి భిక్ష కోరతాడు. ఆ ఇంటి ఇల్లాలు అదే సమయంలో ఇంటికి వచ్చిన భర్తను సేవిస్తూ ఉండడం వల్ల భిక్ష వేయడం ఆలస్యమవుతుంది. నిర్లక్ష్యం చేసిందనే కోపంతో కౌశికుడు ఇల్లాలి వంక చూడగా “మహాత్మా ! నేను చెట్టు పైన ఉన్న పక్షిని కాను, సన్యాసికి ఇంత కోపం తగదు” అని మంచిమాటలు చెప్పి, ఇంకా ధర్మసూక్ష్మాలను తీసుకోవాలని కోరిక ఉంటే మిథిలానగరంలో నివసించే ధర్మవ్యాధుని కలవమని చెబుతుంది. కౌశికుడు ధర్మవ్యాధుడి దగ్గరకు వెళ్తాడు. ఆ నేపథ్యంలోనిదే ఈ పాఠ్యాంశం.

PDF
ప్రత్యక్ష దైవాలు 1st Lesson Guide
Click Here
Share This Article

Choose Schools360 on Google

Schools 360

Content Writer