AP Police SI and Constable Syllabus 2026 in Telugu: ఎపి పోలీసు శాఖ అతి త్వరలో పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయబోతోంది. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలండర్ ప్రకారం వేలాది సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్లు అతి త్వరలో రాబోతున్నాయి. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఇంటర్ (SC/ST అయితే టెన్త్ చదివి ఇంటర్ చదువుతూ ఉండొచ్చు ), ఎస్సై ఉద్యోగాలకు డిగ్రీ అర్హత.
ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ సిలబస్ తెలుగులో
కానిస్టేబుల్ , ఎస్సై ఉద్యోగాలకు ముందుగా ప్రిలిమినరీ రాత పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. దీనిలో జనరల్ అభ్యర్ధులు 40% మార్కులు, BC అభ్యర్ధులు 35%, ఎస్సి, ఎస్టీ అభ్యర్ధులు 30% మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇలా అర్హత సాధించిన అభ్యర్ధులు తదుపరి శారీరక ధృడత్వ మరియు ఫైనల్ పరీక్షలకు అనుమతి పొందుతారు.
ప్రిలిమ్స్ పరీక్షా విధానం
ప్రిలిమినరీ పరీక్ష కానిస్టేబుల్ పోస్టులకు ఒకే పేపర్ గా మూడు గంటల వ్యవధితో జరుగుతుంది. అలాగే ఎస్సై పోస్టులకు రెండు పేపర్లుగా ఒక్కోటి 100 మార్కులకు మూడేసి గంటల వ్యవధితో ఉంటుంది. అభ్యర్ధులు రెండు పేపర్లలోనూ అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది.
కానిస్టేబుల్ ప్రాధమిక పరీక్షా విధానం
| పేపర్ | ఒకటి |
| ప్రశ్నలు ( ఆబ్జెక్టివ్) | 200 |
| స్థాయి | పదవ తరగతి మరియు ఇంటర్ |
| మార్కులు | 200 |
| వ్యవధి | మూడు గంటలు |
ఎస్సై ప్రాధమిక పరీక్షా విధానం
| పేపర్ | ప్రశ్నల స్థాయి | ప్రశ్నలు | మార్కులు | వ్యవధి |
పేపర్ -1 ప్రశ్నలు ( ఆబ్జెక్టివ్) అర్దిమేటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ | పదో తరగతి (ఇంగ్లీష్ మాత్రం డిగ్రీ స్థాయిలో ఉంటుంది) | 100 | 100 | మూడు గంటలు |
పేపర్ -2 ప్రశ్నలు ( ఆబ్జెక్టివ్) జనరల్ స్టడీస్ | డిగ్రీ | 100 | 100 | మూడు గంటలు |
| మొత్తం | 200 | 200 | 6 గంటలు (ఉదయం / మధ్యాహ్నం సెషన్స్) |
కానిస్టేబుల్ ప్రాధమిక పరీక్ష సిలబస్ ( టెన్త్ స్థాయి)
1. English (SSC స్థాయిలో)
2. అరిథ్ మెటిక్ (SSC స్థాయిలో)
3. టెస్ట్ ఆఫ్ రీజనింగ్ / మెంటల్ ఎబిలిటీ
4. జనరల్ సైన్స్
5. భారతదేశ చరిత్ర, సంస్కృతి, జాతీయోద్యమం
6. ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ మరియు ఎకానమీ
7. జాతీయ అంతర్జాతీయ వర్తమాన అంశాలు
*The questions relating to “English in the syllabus” will be set in English only in the Telugu/ Urdu version of the question paper also. తెలుగు / ఉర్దూ మీడియం ప్రశ్నా పత్రాలలో ఇంగ్లీషు కి సంబం ధించిన ప్రశ్నలు కేవలం ఇంగ్లీషులోనే ఇవ్వబడుతాయి.
| English/ Arithmetic (SSC Standard)/ Test of Reasoning/ Mental Ability /General Science / History of India, Indian culture, Indian National Movement. / Indian Geography, Polity and Economy / Current events of national and international importance. |
ఎస్సై ప్రాధమిక పరీక్ష సిలబస్ (డిగ్రీ స్థాయిలో)
1. అరిథ్ మెటిక్ (SSC స్థాయిలో)
3. టెస్ట్ ఆఫ్ రీజనింగ్ / మెంటల్ ఎబిలిటీ
4. జనరల్ సైన్స్
5. భారతదేశ చరిత్ర, సంస్కృతి, జాతీయోద్యమం
6. ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ మరియు ఎకానమీ
7. జాతీయ అంతర్జాతీయ వర్తమాన అంశాలు
అరిథ్ మెటిక్ సిలబస్
ఈ విభాగంలో సంఖ్యామానం (Number System), సరళ వడ్డీ (Simple Intrest), బారువడ్డీ (Compound Intrest), నిష్పత్తి & అనుపాతం (Ratio and Proportion), సగటు (సరాసరి) (Average), శాతములు (Percentage), లాభ నష్టాలు (Profit & Loss), కాలము – పని (Time & Work), పని – వేతనాలు (Work & Wages), కాలము – దూరము (Time & Distance), గడియారం లెక్కలు (clocks), క్యాలెండర్ లెక్కలు (Calendars), భాగస్వామ్యాలు (Partnership), క్షేత్రమితి (Mensuration) మొదలైన అంశాలనుంచి ప్రశ్నలు ఇవ్వబడతాయి.
1) సంఖ్యామానం (Number System):
– అంకెలు (Digits), సంఖ్యలు (Numbers), సంఖ్యలు – వర్గాలు (Classification of Numbers) – సహజ సంఖ్యలు (Natural Numbers), పూర్ణాంకాలు (Whole Numbers), పూర్ణ సంఖ్యలు (Integers), స్థాన విలువ (Place Value), ముఖ విలువ (Face Value), సరి సంఖ్యలు (Even Numbers), బేసి సంఖ్యలు (Odd Numbers), ప్రధాన సంఖ్యలు (Prime Numbers), సంయుక్త సంఖ్యలు (Composite Numbers), సహ ప్రధాన సంఖ్యలు (Co-primes), అకరణీయ సంఖ్యలు (Rational Numbers), కరణీయ సంఖ్యలు (Irrational Numbers), వాస్తవ సంఖ్యలు (Real Numbers), భాజనీయతా సూత్రాలు (Divisibility Rules).
2) ద్విసంఖ్యామానం (Binary Number System):
– ద్విసంఖ్యామానం (Binary System), దశాంశమానం నుంచి ద్విసంఖ్యామానంలోకి మార్చడం (Decimal to Binary Conversion), ద్విసంఖ్యామానం నుంచి దశాంశమానంలోకి మార్చడం (Binary to Decimal Conversion).
3) భిన్నాలు (Fractions):
– దశాంశ భిన్నాలు (Decimal Fractions), భిన్నాలు (Fractions) – క్రమ (Proper), అపక్రమ (Improper), సజాతి (Like), విజాతి (Unlike), విలోమ భిన్నాలు (Reciprocal Fractions), భిన్నాలను పోల్చుట (Comparison of Fractions), భిన్నాలపై చతుర్విధ ప్రక్రియలు (Fundamental Operations on Fractions), దశాంశ భిన్నాలు (Decimal Fractions), అవధి (Period), వ్యవధి (Periodicity), ఆవృత (Recurring), శుద్ధ ఆవృత (Pure Recurring), మిశ్రమ ఆవృత దశాంశాలు (Mixed Recurring Decimals).
4) సూక్ష్మీకరణలు (Simplifications):
– సూక్ష్మీకరణలు (Simplifications) – BODMAS సూత్రాన్ని అనువర్తింపచేయుట (Application of BODMAS Rule).
5) వర్గమూలాలు & ఘనమూలాలు (Square Roots & Cube Roots):
– వర్గము (Square), వర్గమూలాలు (Square Roots), ఖచ్చిత వర్గ సంఖ్య అయ్యేందుకు నియమాలు (Properties of Perfect Squares), ఘనములు (Cubes), ఘనమూలాలు (Cube Roots), ఖచ్చితమైన ఘనసంఖ్య అయ్యేందుకు నియమాలు (Properties of Perfect Cubes).
6) గుణిజం (Multiple), సామాన్య గుణిజం (Common Multiple), కనిష్ట సామాన్య గుణిజం (L.C.M), భాజకము లేదా కారణాంకము (Factor), గరిష్ట సామాన్య భాజకం (H.C.F), భిన్నముల క.సా.గు, గ.సా.భా (L.C.M & H.C.F of Fractions), దశాంశముల క.సా.గు, గ.సా.భా (L.C.M & H.C.F of Decimals).
7) శ్రేణులు (Progressions): అంకశ్రేఢి (Arithmetic Progression – AP), గుణ శ్రేఢి (Geometric Progression – GP), హరాత్మక శ్రేఢి (Harmonic Progression – HP).
8) బీజగణితం (Algebra): బీజగణిత ప్రాధమిక సూత్రాలు (Basic Algebraic Identities), కరణులు (Surds), కరణుల మూలాలు (Indices of Surds), ఘాతాంకాలు (Exponents), ఘాతాంక న్యాయాలు (Laws of Indices).
9) నిష్పత్తి & అనుపాతం (Ratio and Proportion):
– నిష్పత్తి (Ratio), ద్విగుణ లేదా వర్గ నిష్పత్తి (Duplicate Ratio), ఉప లేదా వర్గమూల నిష్పత్తి (Sub-duplicate Ratio), త్రిగుణ లేదా ఘన నిష్పత్తి (Triplicate Ratio), ఉప త్రిగుణ లేదా ఘనమూల నిష్పత్తి (Sub-triplicate Ratio), బహుళ లేదా సంకీర్ణ నిష్పత్తి (Compound Ratio), విలోమ నిష్పత్తి (Inverse Ratio), అనుపాతము (Proportion), అనులోమానుపాతం (Direct Proportion), విలోమానుపాతం (Inverse Proportion), ఉమ్మడి అనుపాతం (Joint Proportion), మిశ్రమానుపాతం (Compound Proportion), అనుపాత నియమాలు (Proportionality Rules), మధ్యమ అనుపాతం (Mean Proportion), తృతీయ అనుపాత రాశి (Third Proportion), చతుర్ధ అనుపాత రాశి (Fourth Proportion).
10) భాగస్వామ్యాలు (Partnership):
– భాగస్వామ్యము (Partnership), భాగస్వామ్యంలో రకాలు – సామాన్య భాగస్వామ్యం (Simple Partnership), సంయుక్త భాగస్వామ్యం (Compound Partnership), నిర్వాహక భాగస్వామి (Working Partner), పనిచేయని భాగస్వామి (Sleeping/Dormant Partner).
11) వయస్సులు (Ages):
– వ్యక్తుల వయస్సులను పోల్చుతూ అడిగే ప్రశ్నలు (Problems based on Ages).
12) సగటు / సరాసరి (Average):
– సగటు (Average), సరాసరి లెక్కించడం (Calculation of Mean).
13) మిశ్రమాలు (Alligation or Mixtures):
– రెండు లేదా అంతకంటే ఎక్కువ వస్తువులను కలపడం లేదా మిశ్రమాలు చేయడం ఆధారంగా చేసుకుని రూపొందించే ప్రశ్నలు (Problems on Alligation and Mixtures).
14) శాతములు (Percentages):
– శాతము పరిచయం (Introduction to Percentage), శాతమును భిన్నంగా మార్చడం (Percentage to Fraction), దశాంశ భిన్నమును శాతంగా మార్చడం (Decimal to Percentage), ముఖ్యమైన శాతములు – వాటి భిన్నాలు (Important Percentage-Fraction Equivalents), శాతముల ఆధారిత ప్రశ్నలు (Problems on Percentages).
15) లాభ నష్టాలు (Profit & Loss):
– కొనుగోలు ధర (Cost Price – CP), అమ్మకపు ధర (Selling Price – SP), లాభము (Profit), నష్టము (Loss), లాభశాతము (Profit Percentage), నష్టశాతము (Loss Percentage).
16) డిస్కౌంట్ (Discount):
– ముద్రిత వెల (Marked Price / List Price), డిస్కౌంట్ (Discount), డిస్కౌంట్ లను లెక్కించడం (Calculation of Discount), వరుస తగ్గింపులు ఇచ్చినపుడు డిస్కౌంట్ లెక్కించడం (Successive Discounts).
17) బారు వడ్డీ (Simple Interest):
– బారువడ్డీ సాధారణ సూత్రాలు (Basic Formulas of Simple Interest), వడ్డీ (Interest), వడ్డీరేటు (Rate of Interest), అసలు (Principal), వడ్డీ, కాలము మధ్య ప్రశ్నలు (Problems on P, T, R).
18) చక్రవడ్డీ (Compound Interest):
– చక్రవడ్డీ సాధారణ సూత్రాలు (Compound Interest Formulas), వడ్డీ (Interest), వడ్డీరేటు (Rate of Interest), అసలు (Principal), మొత్తము (Amount), వడ్డీ, కాలము మధ్య ప్రశ్నలు (Compound Interest Calculations).
19) బారువడ్డీ మరియు చక్రవడ్డీల మధ్య సంబంధం (Relation between Simple Interest and Compound Interest).
20) కాలము – పని (Time & Work), పని – వేతనాలు (Work & Wages):
– పని చేయడానికి పట్టే కాలము (Time taken to complete work), మనుషుల సంఖ్య మరియు పని రోజుల మధ్య సంబంధం (Relation between Efficiency & Time), పనికి తగిన వేతనం లెక్కకట్టుట (Calculation of Wages).
21) పైపులు – తొట్టెలు (Pipes & Cisterns):
– పైపులు – తొట్టెలు నిండటం (Inlet Pipes), ఖాళీకావడం (Outlet/Leakage) పై లాజికల్ ప్రశ్నలు.
22) కాలము – దూరము (Time & Distance):
– దూరం, సమయం, వేగం మధ్య సంబంధం (Relation between Speed, Time & Distance), సగటు వేగం (Average Speed), సాపేక్ష వేగం (Relative Speed).
23) రైళ్ల లెక్కలు (Problems on Trains):
– రైళ్లు: సిగ్నల్ స్థంభాన్ని దాటడం (Crossing a Pole), నిలిచి ఉన్న మనిషిని దాటడం (Crossing a stationary person), ప్లాట్ ఫారమ్ దాటడం (Crossing a Platform/Bridge), మరొక రైలును దాటడం (Crossing another train), రైళ్ల సాపేక్ష వేగాలు (Relative Speeds of trains).
24) పడవలు – ప్రవాహాలు (Boats & Streams):
– ఎగువ ప్రవాహం (Upstream), దిగువ ప్రవాహం (Downstream), నిలకడ నీరు (Still Water), పడవ వేగం (Speed of Boat), ప్రవాహ వేగం (Speed of Stream/Current).
25) గడియారం లెక్కలు (Clocks):
– ముల్లుల కదలిక – వేగం (Angular Speed of Hands), ముల్లులు ఏకీభవించడం (Coinciding), ఖండించుకోవడం / లంబంగా ఉండటం (Perpendicular/Right angles), ముళ్ల మధ్య కోణము (Angle between Hands).
26) క్యాలెండర్ లెక్కలు (Calendars):
– సాధారణ సంవత్సరం (Ordinary Year), లీపు సంవత్సరం (Leap Year), విషమరోజులు (Odd Days), తేదీని బట్టి వారాన్ని గుర్తించడం (Finding Day of the Week).
27) రేఖాగణితం (Geometry):
– ప్రాధమిక రేఖాగణిత భావనలు (Basic Geometric Concepts) – రేఖలు (Lines), కోణాలు (Angles), త్రిభుజాలు (Triangles), చతుర్భుజాలు రకాలు (Types of Quadrilaterals).
28) క్షేత్రమితి – ద్విపరిమాణ క్షేత్రమితి (2D Mensuration / Plane Mensuration):
– పొడవు, వెడల్పు, చుట్టుకొలత (Perimeter), వైశాల్యం (Area): దీర్ఘచతురస్రం (Rectangle), చతురస్రం (Square).
29) త్రిభుజాలు (Triangles) – సమబాహు (Equilateral), సమద్విబాహు (Isosceles), విషమబాహు (Scalene), లంబకోణ త్రిభుజాలు (Right-angled Triangles).
30) బహుభుజులు (Polygons): సమాంతర చతుర్భుజం (Parallelogram), సమలంబ చతుర్భుజం (Trapezium), రాంబస్ (Rhombus).
31) వృత్తము (Circle), అర్ధవృత్తము (Semicircle), చాపము (Arc), వృత్తాకారపు బాటలు (Circular Paths/Rings).
32) క్షేత్రమితి – త్రిపరిమాణ క్షేత్రమితి (3D Mensuration / Solid Mensuration):
– సమఘనము (Cube), దీర్ఘఘనము (Cuboid), గది నాలుగు గోడలు (Area of four walls) – ఉపరితల వైశాల్యాలు (Lateral Surface Area), సంపూర్ణతల వైశాల్యాలు (Total Surface Area), ఘనపరిమాణాలు (Volumes).
33) స్థూపము (Cylinder), శంఖువు (Cone), గోళము (Sphere), అర్ధగోళము (Hemisphere).
34) త్రికోణమితి (Trigonometry):
– త్రికోణమితీయ నిష్పత్తులు (Trigonometric Ratios), ఎత్తులు దూరాలు (Heights and Distances) – అనువర్తనాలు (Applications).
35) సంవర్గమానాలు (Logarithms):
– సంవర్గమాన సూత్రాలు (Laws of Logarithms).
36) ప్రస్థారాలు – సంయోగాలు (Permutations & Combinations):
– ప్రాధమిక సూత్రాలు (Fundamental Principles of Counting), ప్రస్థారాలు (Permutations), వృత్తాకార ప్రస్థారాలు (Circular Permutations), సంయోగాలు (Combinations).
37) సంభావ్యతలు (Probability):
– ప్రయోగాలు (Experiments), యాదృశ్చిక ప్రయోగాలు (Random Experiments), శాంపిల్ స్పేస్ (Sample Space), ఘటనలు (Events), సంభావ్యత (Probability of an Event).
టెస్ట్ ఆఫ్ రీజనింగ్ / మెంటల్ ఎబిలిటీ
ఈ విభాగంలో వెర్బల్ (Verbal) మరియు నాన్-వెర్బల్ (Non–Verbal) విభాగాలకు చెందిన సారూప్యతలు (అనాలజీ) (Analogy), పోలికలు మరియు తేడాలు (Similarities and differences), ప్రాదేశిక దృశ్యీకరణ (Spatial Visualisation), ప్రాదేశిక నిర్దేశం (Spatial Orientation), సమస్యల పరిష్కారం (Problem Solving), విశ్లేషణ (Analysis), తీర్పు (Judgement), నిర్ణయాలు తీసుకోవడం (Decision making) మరియు దృశ్య జ్ఞాపకశక్తి (Visual Memory) వంటి విభాగాల నుంచి ప్రశ్నలు ఇవ్వబడతాయి.
1) సంఖ్యా శ్రేణులు (Number Series):
– శ్రేణిలో తరువాత సంఖ్య (Next number in the series), శ్రేణిలో లోపించిన సంఖ్య (Missing number in the series).
2) అక్షర శ్రేణులు (Letter Series):
– శ్రేణిలో తరువాత అక్షర సమూహం (Next letter group in the series), శ్రేణిలో లోపించిన అక్షర సమూహం (Missing letter group in the series).
3) అక్షరమాల సమస్యలు (Alphabetical Problems):
– అక్షరమాలలో అక్షరం స్థానంపై ఆధారపడి ప్రశ్నలు (Problems based on Alphabetical Position/Order).
4) కోడింగ్ – డీకోడింగ్ (Coding – Decoding):
– రహస్య సంకేతాలు (Secret Codes), నంబర్ కోడింగ్ (Number Coding), లెటర్ కోడింగ్ (Letter Coding), నంబర్ లెటర్ కోడింగ్ (Number-Letter Coding), సెంటెన్స్ కోడింగ్ (Sentence/Substitution Coding).
5) పోలిక పరీక్ష (Analogy):
– పదాల మధ్య పోలిక (Word Analogy), అక్షరాల మధ్య పోలిక (Letter Analogy), సంఖ్యల మధ్య పోలిక (Number Analogy).
6) భిన్న పరీక్ష (Odd Man Out / Classification):
– పదాల భిన్న పరీక్ష (Word Classification), సంఖ్యల భిన్న పరీక్ష (Number Classification), అక్షరాల భిన్న పరీక్ష (Letter Classification).
7) దిశాత్మక పరీక్ష (Direction Sense Test):
– దిక్కులు (Directions), ప్రయాణాలు (Travel/Distance Path), స్థానములు (Positions/Orientation).
8) సంబంధాలు – రక్త సంబంధాలు (Blood Relations):
– కుటుంబ సంబంధాలపై ఆధారపడి అడిగే ప్రశ్నలు (Problems based on family relations/lineage).
9) గణిత పరిక్రియలు (Mathematical Operations):
– గణితంలో గుర్తులను తారుమారు చేస్తూ అడిగే ప్రశ్నలు (Interchanging of Signs and Symbols).
10) మిస్సింగ్ నంబర్ / పజిల్ (Missing Number / Puzzle Test):
– పటములలో పరస్పర సంబంధాలు కలిగిన సంఖ్యలు ఇచ్చినపుడు, ప్రశ్నార్థకం (?) స్థానంలో వచ్చే సంఖ్యను గుర్తించడం (Finding the missing character in diagrams/grids).
11) ర్యాంకింగ్, సీక్వెన్స్ లేఖల పునరావృత పరీక్ష (Number Ranking, Sequence and Letter Repeat Test):
– విద్యార్థుల ర్యాంక్ (Ranking of students), పునరావృత అంశాలు (Repeated elements), విజువల్ రిపీట్ టెస్ట్ (Visual sequence/Repeat test).
12) సీటింగ్ అరేంజ్మెంట్ (Seating Arrangement):
– కూర్చున్న వరుస ఆధారంగా స్థానాలను గుర్తించుట (Linear and Circular seating arrangements).
13) అర్థమెటికల్ రీజనింగ్ (Arithmetical Reasoning):
– అంకగణిత, బీజగణిత ప్రాధమిక సూత్రాలను అనుసరించి సాధించగల ప్రశ్నలు (Reasoning problems based on basic arithmetic/algebraic logic).
14) పాచికలు (Dice):
– పాచికల ముఖాలపై ఉండే సంఖ్యలు లేదా గుర్తులను గుర్తించడం (Problems based on standard and non-standard dice).
15) కామన్ సెన్స్ టెస్ట్ (Common Sense Test):
– ఇంగిత జ్ఞానం (General awareness), సునిశిత పరిశీలనాశక్తి (Observation skills), తార్కిక శక్తి (Logical power), లోకజ్ఞానం ఆధారిత ప్రశ్నలు (Worldly knowledge based questions).
16) ప్రకటనలు – తీర్మానాలు (Statements & Conclusions):
– ఇచ్చిన వాక్యాల ఆధారంగా సరైన ముగింపును గుర్తించడం (Deriving conclusions from given statements).
17) ప్రకటనలు – ఊహలు (Statements & Assumptions):
– ప్రకటన వెనుక ఉన్న అంతర్లీన ఉద్దేశ్యాలను గుర్తించడం (Identifying implicit assumptions).
18) ప్రకటనలు – వాదనలు (Statements & Arguments):
– ఇచ్చిన విషయంలో బలమైన మరియు బలహీనమైన వాదనలను గుర్తించడం (Strong and Weak arguments).
19) వాక్యం – తీసుకోవాల్సిన చర్యలు (Statement & Course of Action):
– ఒక సమస్యకు సరైన పరిష్కార మార్గాన్ని సూచించడం (Suggested practical steps for a given problem).
20) నిశ్చితం & కారణం (Assertion & Reason):
– ఒక వాస్తవం మరియు దానికి ఇవ్వబడిన వివరణ సరిగ్గా ఉన్నాయో లేదో పరీక్షించడం (Testing the validity of a claim and its justification).
21) నిర్ణయాధికారం (Decision Making / Eligibility Test): – కొన్ని నిబంధనలు (Criteria) ఇచ్చి, ఒక వ్యక్తి ఆ ఉద్యోగానికి లేదా కోర్సుకి అర్హుడా కాదా అని నిర్ణయించడం (Determining eligibility for a job or course based on specific criteria or conditions)
22) పదాల అమరిక (Logical Arrangement of Words): – అర్థవంతమైన క్రమంలో (Logical Sequence) పదాలను అమర్చడం (ఉదా: విత్తనం → మొక్క → చెట్టు → పువ్వు → పండు)
23) డిక్షనరీ క్రమం (Dictionary Order / Alphabetical Order): – ఇంగ్లీష్ డిక్షనరీ ప్రకారం పదాలను వరుస క్రమంలో అమర్చడం (Arranging words in alphabetical order as per the English dictionary)
నాన్ వెర్బల్ రీజనింగ్
1) భిన్న చిత్రమును ఎంచుకోవడం (Oddman Out)
2) ఖాళీ గడిని పూర్తి చేయు బొమ్మను గుర్తించుట (Figure Complition)
3) క్రమానుగత శ్రేణిలో సరిపోయే బొమ్మను గుర్తించుట (Image Series Test)
4) జంట బొమ్మల సంబంధంతో నాల్గవ బొమ్మను గుర్తించుట (Picture Analogy)
5) దర్పణ ప్రతిబింబాలు (Mirror Images)
6) నీటి ప్రతిబింబాలు (Water Images)
7) కాగితాన్ని మడవడం మరియు కత్తిరించడం (Paper Folding & Cutting)
8) చిత్రాల గణన (Counting Figures)
9) ఘనములు (Cubes – Image Based Questions)
దత్తాంశ విశ్లేషణ
1) పట్టిక ఆధారిత సమస్యలు (Data Tables / Tabular DI)
2) లైన్ గ్రాఫ్స్ (Line Graphs)
3) బార్ గ్రాఫ్స్ (Bar Graphs)
4) పై చిత్రాలు / వృత్తరేఖా చిత్రాలు (Pie Charts)
5) లాజికల్ వెన్ చిత్రాలు (Logical Venn Diagrams)
6) కేంద్ర స్థాన విలువల కొలతలు (Measures of Central Tendency): అంకమధ్యమం (Mean), మధ్యగతం (Median), బాహుళకం (Mode)
7) విస్తరణ కొలతలు (Measures of Dispersion): వ్యాప్తి (Range), ప్రామాణిక విచలనం (Standard Deviation), విస్తృతి (Variance).
జనరల్ సైన్స్
భౌతిక శాస్త్రము (Physics)
1) కొలతలు – ప్రమాణాలు (Units & Measurements):
* ప్రాథమిక మరియు ఉత్పన్న రాశులు (Fundamental and Derived quantities), SI ప్రమాణాలు (SI Units), కొలిచే సాధనాలు (Measuring instruments – Vernier callipers, Screw gauge).
2) గతిశాస్త్రం (Dynamics):
* న్యూటన్ గమన నియమాలు (Newton’s Laws of Motion), జడత్వం (Inertia), ఘర్షణ (Friction), వృత్తాకార గతి (Circular motion), ప్రక్షేపక గతి (Projectile motion).
3) కాంతి – లేసర్లు (Light & Lasers):
* పరావర్తనం (Reflection), వక్రీభవనం (Refraction), సంపూర్ణ అంతర పరావర్తనం (Total Internal Reflection), విక్షేపణం (Dispersion), కంటి దోషాలు (Eye defects – Myopia, Hypermetropia), లేసర్ల ఉపయోగాలు (Applications of Lasers).
4) అయస్కాంతత్వం (Magnetism):
* అయస్కాంత పదార్థాలు (Magnetic materials – Dia, Para, Ferro), భూ అయస్కాంతత్వం (Terrestrial magnetism), అయస్కాంత క్షేత్రం (Magnetic field).
5) ధ్వని మరియు తరంగ చలనం (Sound & Wave Motion):
* అనుదైర్ఘ్య మరియు తిర్యక్ తరంగాలు (Longitudinal and Transverse waves), ధ్వని వేగం (Speed of sound), ప్రతిధ్వని (Echo), సోనార్ (SONAR), డాప్లర్ ప్రభావం (Doppler effect), అతిధ్వనులు (Ultrasonics).
6) విద్యుదయస్కాంత తరంగాలు (Electromagnetic Waves):
* విద్యుదయస్కాంత వర్ణపటం (Electromagnetic Spectrum – X-rays, UV, IR, Microwaves, Radio waves).
7) విద్యుత్ (Electricity):
* ఓమ్ నియమం (Ohm’s Law), నిరోధాల శ్రేణి మరియు సమాంతర సంధానం (Series and Parallel circuits), AC & DC కరెంట్, ఫ్యూజ్ (Fuse), విద్యుత్ సామర్థ్యం (Electric Power).
8) ఉష్ణం (Heat):
* ఉష్ణోగ్రత ప్రమాణాలు (Scales of Temperature – Celsius, Fahrenheit, Kelvin), విశిష్టోష్ణం (Specific Heat), ఉష్ణ ప్రసార పద్ధతులు (Conduction, Convection, Radiation).
9) స్థితిస్థాపకత (Elasticity):
* హుక్ నియమం (Hooke’s Law), యంగ్ గుణకం (Young’s Modulus), ప్రతిబలం మరియు వికృతి (Stress and Strain).
10) ప్రవాహి ధర్మాలు (Fluid Mechanics):
* స్నిగ్ధత (Viscosity), తలతన్యత (Surface Tension), కేశనాళికీయత (Capillarity), బెర్నౌలీ సూత్రం (Bernoulli’s Principle), ఆర్కిమెడిస్ సూత్రం (Archimedes’ Principle).
11) కేంద్రక (పరమాణు) భౌతిక శాస్త్రం (Atomic & Nuclear Physics):
* ఐసోటోపులు (Isotopes), రేడియో ధార్మికత (Radioactivity), కేంద్రక విచ్ఛిత్తి (Nuclear Fission), కేంద్రక సంలీనం (Nuclear Fusion), అణు రియాక్టర్లు (Nuclear Reactors).
12) విశ్వకిరణాలు (Cosmic Rays):
* విశ్వకిరణాల స్వభావం మరియు మూలాలు (Nature and Sources of Cosmic Rays).
13) అర్ధవాహకాలు మరియు ఎలక్ట్రానిక్స్ (Semiconductors & Electronics):
* అంతర్గత మరియు బాహ్య అర్ధవాహకాలు (Intrinsic and Extrinsic Semiconductors – P-type, N-type), డయోడ్లు (Diodes), ట్రాన్సిస్టర్లు (Transistors), LED, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు (ICs).
14) గురుత్వాకర్షణ (Gravitation):
* విశ్వ గురుత్వాకర్షణ నియమం (Universal Law of Gravitation), పలాయన వేగం (Escape velocity), కక్ష్యా వేగం (Orbital velocity), కృత్రిమ ఉపగ్రహాలు (Artificial Satellites).
15) పని, శక్తి మరియు సామర్ధ్యం (Work, Power & Energy):
* గతిజ శక్తి (Kinetic Energy), స్థితిజ శక్తి (Potential Energy), శక్తి నిత్యత్వ నియమం (Law of Conservation of Energy).
రసాయన శాస్త్రము (Chemistry)
1) రసాయన శాస్త్రం – పరిచయం (Introduction to Chemistry):
* పదార్థం వర్గీకరణ (Classification of Matter), మిశ్రమాలు (Mixtures), సమ్మేళనాలు (Compounds), భౌతిక మరియు రసాయన మార్పులు (Physical and Chemical changes).
2) పరమాణు నిర్మాణం (Atomic Structure):
* పరమాణు నమూనాలు (Atomic models – Bohr, Rutherford), ఉప-పరమాణు కణాలు (Sub-atomic particles – Electrons, Protons, Neutrons), ఎలక్ట్రాన్ విన్యాసం (Electronic configuration).
3) మూలకాల వర్గీకరణ – ధర్మాలు (Classification of Elements & Properties):
* ఆధునిక ఆవర్తన పట్టిక (Modern Periodic Table), పీరియడ్లు మరియు గ్రూపులు (Periods and Groups), ఆవర్తన ధర్మాలు (Periodic properties).
4) ఆక్సీకరణం – క్షయకరణం (Oxidation & Reduction):
* ఆక్సీకరణ సంఖ్య (Oxidation Number), రెడాక్స్ చర్యలు (Redox reactions), తుప్పు పట్టడం (Corrosion/Rusting).
5) వాయువులు – వాటి ధర్మాలు (Gases & their Properties):
* వాయు నియమాలు (Gas Laws – Boyle’s, Charles’s), ఆదర్శ వాయు సమీకరణం (Ideal Gas Equation), వ్యాపనం (Diffusion).
6) ఆమ్లాలు, క్షారాలు, లవణాలు (Acids, Bases & Salts):
* pH స్కేల్ (pH scale), సూచికలు (Indicators), ఆమ్లరాజం (Aqua regia), లవణాల ఉపయోగాలు (Uses of Salts).
7) కర్బన సమ్మేళనాల రసాయన శాస్త్రం (Organic Chemistry):
* హైడ్రోకార్బన్లు (Hydrocarbons), ఫంక్షనల్ గ్రూపులు (Functional groups), ఇథనాల్ (Ethanol), ఎసిటిక్ ఆమ్లం (Acetic acid).
8) కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ (Carbohydrates & Proteins):
* పిండి పదార్థాలు (Starches), చక్కెరలు (Sugars), అమినో ఆమ్లాలు (Amino acids), ఎంజైములు (Enzymes).
9) సామాన్య రసాయన శాస్త్రం (General Chemistry):
* రసాయన నామాలు (Chemical names), ఫార్ములాలు (Formulae), రసాయన సమీకరణాలు (Chemical equations).
10) లోహ శాస్త్రం: లోహాలు మరియు అలోహాలు (Metallurgy: Metals & Non-Metals):
* ధాతువులు (Ores), ఖనిజాలు (Minerals), సంగ్రహణ పద్ధతులు (Extraction methods), మిశ్రమ లోహాలు (Alloys).
11) రసాయన బంధాలు (Chemical Bonding):
* అయానిక్ మరియు సమ్యోజనీయ బంధాలు (Ionic and Covalent bonds), సిగ్మా మరియు పై బంధాలు ($\sigma$ and $\pi$ bonds), హైడ్రోజన్ బంధం (Hydrogen bonding).
12) పాలిమర్లు, ప్లాస్టిక్స్ మరియు కృత్రిమ దారాలు (Polymers, Plastics & Synthetic Fibers):
* వల్కనైజేషన్ (Vulcanization), బేకలైట్ (Bakelite), నైలాన్ (Nylon), టెఫ్లాన్ (Teflon), PVC.
13) ద్రావణాలు (Solutions):
* ద్రావణాల గాఢత (Concentration of Solutions – Molarity, Normality), కొలాయిడ్లు (Colloids), ఎమల్షన్లు (Emulsions).
14) నిత్యజీవితంలో రసాయన శాస్త్రం (Chemistry in Everyday Life):
* సబ్బులు (Soaps), డిటర్జెంట్లు (Detergents), ఔషధాలు (Medicines – Analgesics, Antibiotics), గాజు (Glass), సిమెంట్ (Cement), పేలుడు పదార్థాలు (Explosives – RDX, TNT).
15) పర్యావరణ రసాయన శాస్త్రం (Environmental Chemistry):
* ఆమ్ల వర్షాలు (Acid Rains), గ్రీన్ హౌస్ ప్రభావం (Greenhouse Effect), ఓజోన్ పొర క్షీణత (Ozone Depletion), క్లోరో ఫ్లోరో కార్బన్లు (CFCs), నీటి శుద్ధీకరణ (Water purification).
- ఇంధనాలు (Fuels):
* పెట్రోలియం (Petroleum), సహజ వాయువు (Natural Gas – LPG, CNG), బొగ్గు రకాలు (Types of Coal), బయో-డీజిల్ (Bio-diesel).
జీవశాస్త్రము (Biology)
1) జీవశాస్త్రం – పరిచయం (Introduction to Biology):
* జీవశాస్త్ర విభాగాలు (Branches of Biology – Anatomy, Morphology, Cytology, etc.), ప్రముఖ జీవశాస్త్రవేత్తలు మరియు వారి ఆవిష్కరణలు (Famous Biologists and their Discoveries).
2) కణశాస్త్రం (Cytology):
* కణ నిర్మాణం (Cell structure), కణాంగాలు మరియు వాటి విధులు (Cell Organelles and their functions – Mitochondria, Ribosomes, Lysosomes, Nucleus), కణ విభజన (Cell Division – Mitosis and Meiosis).
3) జీవుల వర్గీకరణ (Classification of Living Organisms):
* ఐదు రాజ్యాల వర్గీకరణ (Five Kingdom Classification), ద్వినామ నామకరణం (Binomial Nomenclature), వృక్ష మరియు జంతు రాజ్య వర్గీకరణ (Plant and Animal Kingdom classification).
4) వృక్ష శరీరధర్మశాస్త్రం (Plant Physiology):
* మొక్కల కణజాలాలు (Plant Tissues), మొక్కలలో నీరు మరియు ఖనిజాల రవాణా (Transport of water and minerals).
5) మొక్కలలో పోషణ మరియు కిరణజన్య సంయోగక్రియ (Nutrition and Photosynthesis in Plants):
* కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియ (Process of Photosynthesis), కాంతి మరియు నిష్కాంతి చర్యలు (Light and Dark Reactions), పత్రహరితం (Chlorophyll).
6) మొక్కలలో శ్వాసక్రియ (Respiration in Plants):
* వాయు సహిత మరియు అవాయు శ్వాసక్రియ (Aerobic and Anaerobic Respiration), గ్లైకోలిసిస్ (Glycolysis), క్రెబ్స్ వలయం (Krebs cycle).
7) మొక్కలలో నియంత్రణ మరియు సమన్వయ వ్యవస్థ (Control and Coordination in Plants):
* వృక్ష హార్మోన్లు (Plant Hormones – Auxins, Gibberellins, Cytokinins, Abscisic acid, Ethylene).
8) మొక్కలలో ప్రత్యుత్పత్తి మరియు అనువంశికత (Reproduction and Heredity in Plants):
* పుష్పం నిర్మాణం (Structure of Flower), పరాగసంపర్కం (Pollination), ఫలదీకరణం (Fertilization), విత్తనాల వ్యాప్తి (Dispersal of seeds).
9) మొక్కలు – ఆర్థిక ప్రాముఖ్యత (Plants – Economic Importance):
* ఔషధ మొక్కలు (Medicinal plants), కలపనిచ్చే మొక్కలు (Timber yielding plants), సుగంధ ద్రవ్యాలు (Spices).
10) జంతువుల శరీరధర్మశాస్త్రం – మానవ పోషణ (Animal Physiology – Human Nutrition):
* కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు (Carbohydrates, Proteins, Fats), విటమిన్లు – రసాయన నామాలు మరియు లోప వ్యాధులు (Vitamins – Chemical names and Deficiency diseases), ఖనిజ లవణాలు (Minerals).
11) శ్వాస వ్యవస్థ (Respiratory System):
* ఊపిరితిత్తుల నిర్మాణం (Structure of Lungs), శ్వాసక్రియ విధానం (Mechanism of Breathing), వాయు మార్పిడి (Exchange of gases).
12) జీర్ణ వ్యవస్థ (Digestive System):
* జీర్ణనాళం (Alimentary canal), జీర్ణ గ్రంధులు (Digestive glands), ఎంజైములు (Enzymes) మరియు జీర్ణక్రియ (Digestion).
13) ప్రసరణ వ్యవస్థ (Circulatory System):
* గుండె నిర్మాణం (Structure of Heart), రక్త నాళాలు (Blood Vessels – Arteries, Veins), రక్త వర్గాలు (Blood Groups), రక్త స్కందనం (Blood Coagulation).
14) విసర్జన వ్యవస్థ (Excretory System):
* మూత్రపిండాల నిర్మాణం (Structure of Kidneys), నెఫ్రాన్ (Nephron), విసర్జక పదార్థాలు (Excretory products), డయాలసిస్ (Dialysis).
15) నాడీ వ్యవస్థ, నియంత్రణ మరియు సమన్వయం (Nervous System, Control and Coordination):
* మెదడు భాగాలు (Parts of Brain – Cerebrum, Cerebellum, Medulla), వెన్నుపాము (Spinal cord), నాడీ కణం (Neuron).
16) ప్రత్యుత్పత్తి వ్యవస్థ (Reproductive System):
* పురుష మరియు స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు (Male and Female Reproductive organs), పిండం అభివృద్ధి (Embryo development), సంతానలేమి చికిత్సలు (IVF).
17) అస్థిపంజర వ్యవస్థ – ఎముకలు, కీళ్లు (Skeletal System – Bones, Joints):
* ఎముకల వర్గీకరణ (Classification of bones), కీళ్ల రకాలు (Types of Joints), అస్థిపంజర వ్యాధులు (Bone disorders).
18) జ్ఞానేంద్రియాలు (Sense Organs):
* కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం (Eye, Ear, Nose, Tongue, Skin) – నిర్మాణం మరియు విధులు.
19) వినాళ గ్రంధులు – హార్మోనులు (Endocrine System – Hormones):
* పియూష, థైరాయిడ్, అడ్రినల్ గ్రంధులు (Pituitary, Thyroid, Adrenal glands), హార్మోన్ల లోపాలు మరియు అతివృష్టి ప్రభావాలు.
20) జన్యు శాస్త్రము (Genetics):
* మెండల్ నియమాలు (Mendelian Laws), DNA మరియు RNA నిర్మాణం, క్రోమోజోములు (Chromosomes), జన్యుపరమైన వ్యాధులు (Genetic disorders).
21) మానవ ఆరోగ్యం మరియు వ్యాధులు (Human Health and Diseases):
* బాక్టీరియా, వైరస్, ఫంగస్, ప్రోటోజోవా వ్యాధులు (Bacterial, Viral, Fungal, Protozoan diseases), టీకాలు (Vaccines), రోగనిరోధక వ్యవస్థ (Immune System).
22) సూక్ష్మజీవ శాస్త్రము (Microbiology):
* సూక్ష్మజీవుల రకాలు (Types of Microorganisms), యాంటీ బయాటిక్స్ (Antibiotics), కిణ్వనం (Fermentation).
23) ఆవరణ శాస్త్రము మరియు పర్యావరణం (Ecology and Environment):
* ఆవరణ వ్యవస్థ (Ecosystem), ఆహార గొలుసు (Food chain), జీవవైవిధ్యం (Biodiversity), కాలుష్యం (Pollution).
24) జీవ సాంకేతిక శాస్త్రము (Biotechnology):
* జన్యు ఇంజనీరింగ్ (Genetic Engineering), క్లోనింగ్ (Cloning), స్టెమ్ సెల్స్ (Stem Cells), DNA ఫింగర్ ప్రింటింగ్ (DNA Fingerprinting).
జనరల్ స్టడీస్
సైన్స్ అండ్ టెక్నాలజీ (Science & Technology)
1) విజ్ఞానశాస్త్రము (General Science) – శాస్త్ర మరియు సాంకేతిక రంగాలలో సమకాలీన పరిణామాలు (contemporary developments in science and technology) మరియు నిత్యజీవితంలో పరిశీలన, అనుభవంలోని శాస్త్ర సంబంధిత విషయాలతో సహా వాటి ప్రభావాలు (implications including matters of everyday observation and experience). ఏ శాస్త్రీయ విభాగంలోనూ ప్రత్యేక అధ్యయనం చేయని ఒక విద్యావంతుడైన వ్యక్తి నుండి ఆశించే పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన సమకాలీన అంశాలు (contemporary issues relating to protection of environment as may be expected of a well educated person who has not made a special study of any scientific discipline).
- అంతరిక్ష సాంకేతిక విజ్ఞానం (Space Technology):
* భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) – చరిత్ర మరియు నిర్మాణం (History and Structure).
* ఉపగ్రహ ప్రయోగ వాహనాలు (Launch Vehicles – SLV, ASLV, PSLV, GSLV, SSLV).
* రకాలు – ఉపగ్రహాలు (Types of Satellites – Communication, Remote Sensing, Navigation).
* మైలురాయి వంటి మిషన్లు (Key Missions – Chandrayaan-1, 2, 3, Mangalyaan, Gaganyaan, Aditya-L1).
* గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్స్ (Global Navigation Systems – GPS, NavIC, GLONASS).
2) రక్షణ సాంకేతిక విజ్ఞానం (Defense Technology):
* భారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO) – విధులు (Functions).
* క్షిపణి వ్యవస్థలు (Missile Systems – Agni, Prithvi, Akash, Nag, Trishul).
* క్రూయిజ్ క్షిపణులు (Cruise Missiles – BrahMos, Nirbhay).
* యుద్ధ విమానాలు మరియు హెలికాప్టర్లు (Fighter Aircrafts & Helicopters – Tejas, Rafale, Apache).
* నౌకాదళం – జలాంతర్గాములు మరియు విమానవాహక నౌకలు (Navy – Submarines, Aircraft Carriers – INS Vikrant).
* రాడార్ వ్యవస్థలు మరియు డ్రోన్ టెక్నాలజీ (Radar Systems and Drone Technology).
3) అణు సాంకేతిక విజ్ఞానం (Nuclear Technology):
* భారత అణుశక్తి కార్యక్రమం – మూడు దశల ప్రణాళిక (India’s Three-stage Nuclear Power Program).
* అణు రియాక్టర్లు – రకాలు (Types of Nuclear Reactors – PHWR, PWR, Breeder Reactors).
* అణు విద్యుత్ కేంద్రాలు – స్థానాలు (Nuclear Power Plants in India and their locations).
* రేడియో ఐసోటోపులు – అనువర్తనాలు (Radioisotopes – Applications in Medicine, Agriculture, and Food preservation).
4) ఇంధన రంగం (Energy Sector):
* పునరుత్పాదక ఇంధన వనరులు (Renewable Energy – Solar, Wind, Tidal, Geothermal).
* పునరుత్పాదక కాని ఇంధన వనరులు (Non-renewable Energy – Coal, Natural gas).
* నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ (National Green Hydrogen Mission).
* ఇంధన సెల్స్ మరియు బ్యాటరీ టెక్నాలజీ (Fuel Cells and Battery Technology – Lithium-ion batteries).
* అంతర్జాతీయ సౌర కూటమి (International Solar Alliance – ISA).
5) జీవ సాంకేతిక శాస్త్రం (Biotechnology):
* జెనెటిక్ ఇంజనీరింగ్ మరియు క్లోనింగ్ (Genetic Engineering and Cloning).
* జన్యుపరంగా మార్పిడి చేసిన పంటలు (GM Crops – Bt Cotton, Bt Brinjal, GM Mustard).
* స్టెమ్ సెల్ టెక్నాలజీ (Stem Cell Technology).
* DNA ఫింగర్ ప్రింటింగ్ మరియు దాని ఉపయోగాలు (DNA Fingerprinting and its applications).
* బయో-మెడిసిన్ మరియు టీకాలు (Bio-medicine and Vaccines – Covaxin, Covishield, mRNA vaccines).
6) నానో సాంకేతిక శాస్త్రం (Nanotechnology):
* నానో మెటీరియల్స్ – కార్బన్ నానో ట్యూబ్స్, గ్రాఫీన్ (Nano materials – Carbon Nanotubes, Graphene).
* ఆరోగ్య రంగంలో నానో టెక్నాలజీ – డ్రగ్ డెలివరీ (Nanotechnology in Healthcare – Drug delivery).
* ఎలక్ట్రానిక్స్ మరియు పర్యావరణంలో అనువర్తనాలు (Applications in Electronics and Environment).
7) కంప్యూటర్స్ మరియు సమాచార సాంకేతిక విజ్ఞానం (Computers & Information Technology):
* కంప్యూటర్ల వర్గీకరణ మరియు సూపర్ కంప్యూటర్లు (Classification of Computers and Supercomputers – PARAM series).
* ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence – Generative AI, ChatGPT).
* ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (Internet of Things – IoT) మరియు క్లౌడ్ కంప్యూటింగ్ (Cloud Computing).
* సైబర్ సెక్యూరిటీ – మాల్వేర్, వైరస్లు, ఫిషింగ్ (Cyber Security – Malware, Viruses, Phishing).
* బ్లాక్‌చైన్ టెక్నాలజీ మరియు క్రిప్టో కరెన్సీ (Blockchain Technology and Crypto Currency).
* 5G మరియు 6G సాంకేతికత (5G and 6G Technology).
- ఇతర ముఖ్యమైన అంశాలు (Additional Important Topics):
*రోబోటిక్స్ (Robotics): పారిశ్రామిక రోబోలు, హ్యూమనాయిడ్ రోబోలు (ఉదా: వ్యోమమిత్ర).
*మేధో సంపత్తి హక్కులు (Intellectual Property Rights – IPR): పేటెంట్లు, కాపీరైట్లు, ట్రేడ్ మార్కులు మరియు GI ట్యాగులు.
*సముద్రయాన సాంకేతికత (Oceanography/Blue Economy): డీప్ ఓషన్ మిషన్ (Deep Ocean Mission), సముద్రయాన అన్వేషణ.
*ప్రభుత్వ విధానాలు (Government Policies): సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ (STIP).
2) జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన వర్తమాన అంశాలు – కరెంట్ అఫైర్స్ (Current events of national and international importance).
ఈ విభాగం కోసం కనీసంగా గత ఆరు నెలల కరెంట్ అఫైర్స్ ను క్షుణ్ణంగా చదవడంతో పాటు, కనీసం గత పన్నెండు నెలల కాలంలో అత్యంత ప్రాముఖ్యతగాంచిన అంశాలను గురించి సమగ్రంగా తెలుసుకోవడం మంచిది.
3) భారతదేశ చరిత్ర (History of India) – సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయ కోణాల్లో భారతదేశ చరిత్రపై గల విస్తృత సాధారణ అవగాహన (emphasis will be on broad general understanding social, economic, cultural and political aspects). & భారత జాతీయ ఉద్యమం (Indian National Movement).
01) శిలాయుగము – ప్రాచీన, మధ్య, నవీన శిలాయుగాలు, లోహ యుగము (Stone Age – Palaeolithic, Mesolithic, Neolithic and Metal Ages)
02) హరప్పా నాగరికత, సింధూ నాగరికత – త్రవ్వకాలు, ఆనాటి పరిస్థితులు (Harappan Civilization / Indus Valley Civilization – Excavations and Socio-Economic Conditions)
03) వేదకాలము / ఆర్య నాగరికత – తొలివేద కాలము, మలివేద కాలము, వేదసాహిత్యాలు (Vedic Period / Aryan Civilization – Early and Late Vedic Periods, Vedic Literature)
04) జైన మతము (Jainism)
05) బౌద్ధ మతము (Buddhism)
06) షోడశ మహాజనపదాలు – మగధ రాజ్య విస్తరణ – హర్యాంక, శిశునాగ, నంద, మౌర్య, శుంగ మరియు కణ్వ వంశాలు (Sixteen Mahajanapadas – Expansion of Magadha: Haryanka, Shishunaga, Nanda, Maurya, Shunga and Kanva Dynasties)
07) పారశీక, గ్రీకు దండయాత్రలు (Persian and Greek Invasions)
08) మౌర్య సామ్రాజ్యము (Mauryan Empire)
09) మౌర్యుల అనంతర యుగము – శుంగవంశం, కణ్వ వంశం, ఛేది వంశం, ఇండో గ్రీకులు, శకులు, పార్థియన్లు (Post-Mauryan Era – Shunga, Kanva, Chedi Dynasties, Indo-Greeks, Shakas and Parthians)
10) కుషాణులు (Kushanas)
11) శాతవాహనులు (Satavahanas)
12) సంగం యుగం – చేర, చోళ, పాండ్య రాజ్యవంశాలు (Sangam Age – Chera, Chola and Pandya Dynasties)
13) గుప్తుల కాలం (Gupta Period)
14) గుప్తానంతర యుగము – మైత్రిక, మౌఖరీ, గౌడ, వర్మ వంశాలు మరియు పుష్యభూతి వంశం – హర్ష వర్ధనుడు (Post-Gupta Era – Maitraka, Maukahari, Gauda, Varma and Pushyabhuti Dynasties – Harsha Vardhana)
15) పశ్చిమ/బాదామీ/వాతాపి చాళుక్యులు + కళ్యాణీ చాళుక్యులు + వేంగీ చాళుక్యులు/తూర్పు చాళుక్యులు (Western/Badami/Vatapi Chalukyas + Kalyani Chalukyas + Vengi/Eastern Chalukyas)
16) పల్లవులు (Pallavas)
17) రాష్ట్రకూటులు (Rashtrakutas)
18) నవీన చోళులు (Imperial Cholas)
19) రాజపుత్రులు – చౌహానులు, ఘూర్జర ప్రతిహారులు, పరమారులు, సోలంకీలు, కాలచూరీలు, చందేళులు, గహద్వాలులు, రాథోడ్లు (Rajputs – Chauhans, Gurjara-Pratiharas, Paramaras, Solankis, Kalachuris, Chandelas, Gahadvalas and Rathores)
20) భారతదేశంలోకి ఇస్లాం రాక + ముస్లింల దండయాత్రలు + అరబ్బుల దండయాత్రలు + తురుష్కుల దండయాత్రలు (Advent of Islam in India + Muslim Invasions + Arab and Turkish Invasions)
21) ఢిల్లీ సుల్తానులు – బానిస వంశము + ఖిల్జీవంశము + తుగ్లక్ వంశము + సయ్యద్ వంశము + లోడీ వంశము (Delhi Sultanate – Slave, Khilji, Tughlaq, Sayyid and Lodi Dynasties)
22) మధ్యయుగంలో మత సంస్కరణోద్యమాలు – భక్తి ఉద్యమము + సూఫీ ఉద్యమము (Medieval Religious Reform Movements – Bhakti and Sufi Movements)
23) కాకతీయులు (Kakatiyas)
24) పాండ్యులు (Pandyas)
25) విజయనగర సామ్రాజ్యము (Vijayanagara Empire)
26) బహమనీ సామ్రాజ్యము (Bahmani Kingdom)
27) కుతుబ్ షాహీలు (Qutub Shahis)
28) మొగల్ సామ్రాజ్యము (Mughal Empire)
29) మహారాష్ట్రులు/మరాఠాలు (Marathas)
30) పీష్వాల యుగము (Era of Peshwas)
31) సిక్కు మతము (Sikhism)
32) భారతదేశానికి ఐరోపా వారి రాక (Advent of Europeans to India)
33) బ్రిటీష్ సామ్రాజ్య స్థాపన – కర్ణాటక యుద్ధాలు – ప్లాసీ యుద్ధము – బక్సార్ యుద్ధము – ఆంగ్లో మైసూరు యుద్ధాలు – ఆంగ్లో మరాఠా యుద్ధాలు – ఆంగ్లో సిక్కు యుద్ధాలు – బొబ్బిలి యుద్ధము (Establishment of British Empire – Carnatic Wars, Battles of Plassey & Buxar, Anglo-Mysore, Anglo-Maratha, Anglo-Sikh and Bobbili Wars)
34) బ్రిటీష్ వారి పరిపాలన – బ్రిటీష్ సార్వభౌమాధికారం + బ్రిటీష్ వారి ఆర్ధిక విధానాలు + బ్రిటీష్ వారి పరిపాలన సంస్కరణలు (British Rule – British Sovereignty, Economic Policies and Administrative Reforms)
35) బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ గవర్నర్ జనరల్స్ (Governor Generals of British East India Company)
36) 1857 తిరుగుబాటు (Revolt of 1857)
37) బ్రిటీష్ పార్లమెంట్ – వైశ్రాయిలు (British Parliament – Viceroys of India)
38) జాతీయోద్యమంలో పత్రికా రంగము (Role of Press in the National Movement)
39) జాతీయోద్యమంలో వివిధ సంస్థల పాత్ర (Role of various Organizations in the National Movement)
40) సాంస్కృతిక పునరుజ్జీవనం – బ్రహ్మసమాజం, ప్రార్ధనా సమాజం, ఆర్య సమాజం, రామకృష్ణమఠం, దివ్యజ్ఞాన సమాజం, ఇతర సాంస్కృతిక ఉద్యమాలు (Socio-Cultural Renaissance – Brahma Samaj, Prarthana Samaj, Arya Samaj, Ramakrishna Mission, Theosophical Society and other Movements)
41) మతసంస్కరణోద్యమాలు – సంఘసంస్కర్తలు (Religious Reform Movements – Social Reformers)
42) మితవాద యుగము 1885-1905 (Moderate Phase)
43) అతివాద యుగము 1905-1919 (Extremist Phase)
44) బెంగాల్ విభజన – స్వదేశీ ఉద్యమము + హోం రూల్ ఉద్యమము (Partition of Bengal – Swadeshi Movement and Home Rule Movement)
45) గాంధీ యుగము 1919-1947 (Gandhian Era)
46) భారత జాతీయ సైన్యము (Indian National Army – INA)
47) విప్లవాత్మక ఉద్యమము – విప్లవకారులు (Revolutionary Movement – Revolutionaries)
48) ఉద్యమాలు – కమ్యూనిస్టు/కార్మిక + రైతు + గిరిజన + దళిత + వెనుకబడిన తరగతుల ఉద్యమాలు (Other Movements – Communist/Labour, Peasant, Tribal, Dalit and Backward Class Movements)
49) దేశ విభజన – అసఫ్ జాహీ, నిజాం పాలన (Partition of India – Asaf Jahi and Nizam Rule)
50) స్వదేశీ సంస్థానాల ఏకీకరణ – హైదరాబాద్ సంస్థానం (Integration of Princely States – Hyderabad State)
51) దేశ విభజన – ముస్లీం లీగ్ (Partition of India – Role of Muslim League)
4) భారతదేశ భౌగోళిక శాస్త్రం (Geography of India)
01) భారతదేశ ఉనికి మరియు క్షేత్రీయ అమరిక (Location and Physical Setting)
02) భారతదేశ నైసర్గిక స్వరూపము (Physiography of India)
03) భారతదేశము – శీతోష్ణస్థితి (Climate of India)
04) భారతదేశము – సహజ ఉద్భిజ సంపద – అడవులు (Natural Vegetation and Forests)
05) భారతదేశము – నదీ వ్యవస్థ – నీటిపారుదల – బహుళార్ధసాధక ప్రాజెక్టులు (River Systems, Irrigation and Multipurpose Projects)
06) భారతదేశము – మృత్తికలు (Soils of India)
07) భారతదేశము – వ్యవసాయ రంగము (Agriculture)
08) భారతదేశము – శక్తి వనరులు (Energy Resources)
09) భారతదేశము – ఖనిజ వనరులు (Mineral Resources)
10) భారతదేశము – పరిశ్రమలు (Industries)
11) భారతదేశము – రవాణా రంగము (Transport System)
12) భారతదేశము – జనాభా (Population / Demography)
13) భారతదేశము – దర్శనీయ ప్రదేశాలు – పర్యాటక రంగము (Tourism and Places of Interest)
14) భారతదేశంలో వర్తకం లేదా వాణిజ్యం (Trade and Commerce)
5) భారత రాజనీతి శాస్త్రము (Indian Polity)
01) రాజ్యాంగ స్వభావం, పరిణామక్రమం మరియు ఆవిర్భావానికి దోహదపడిన చట్టాలు (Nature, Evolution and Acts that aided the Constitution)
02) భారత రాజ్యాంగ సభ – రాజ్యాంగ పరిషత్తు మరియు దాని కమిటీలు (Constituent Assembly and its Committees)
03) భారత రాజ్యాంగ ఆధారాలు, జాతీయ గుర్తులు మరియు జాతీయ పతక నియమావళి (Sources of Constitution, National Symbols and Flag Code)
04) రాజ్యాంగ విశిష్ట లక్షణాలు, ప్రవేశిక మరియు మౌలిక స్వరూప సిద్ధాంతము (Salient Features, Preamble and Basic Structure Doctrine)
05) ప్రాథమిక హక్కులు (Fundamental Rights)
06) ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు మరియు వాటి మధ్య సంబంధం (DPSP, Fundamental Duties and their Relationship)
07) శాసన వ్యవస్థ రకాలు – ఏకసభ మరియు ద్విసభ (Types of Legislatures – Unicameral and Bicameral)
08) కేంద్ర ప్రభుత్వం – భారత రాష్ట్రపతి మరియు అతని అధికారాలు (Union Government – The President of India and Powers)
09) రాష్ట్రపతి అత్యవసర అధికారాలు – అత్యవసర పరిస్థితి మరియు రాష్ట్రపతి పాలన (Emergency Powers and President’s Rule)
10) ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి మరియు ఉప ప్రధానమంత్రి (Vice-President, Prime Minister and Deputy PM)
11) కేంద్ర మంత్రిమండలి మరియు కేబినెట్ కమిటీలు (Union Council of Ministers and Cabinet Committees)
12) భారత పార్లమెంట్ – లోక్ సభ మరియు రాజ్యసభ (Indian Parliament – Lok Sabha and Rajya Sabha)
13) శాసన నిర్మాణ ప్రక్రియ – బిల్లుల రకాలు మరియు ఆమోద ప్రక్రియలు (Legislative Process – Types of Bills and Approval)
14) పార్లమెంట్ సంఘాలు – పార్లమెంటరీ కమిటీలు మరియు వేదికలు (Parliamentary Committees and Forums)
15) ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల విశ్లేషణ (Analysis of Current Union and State Governments)
16) రాష్ట్ర ప్రభుత్వం – గవర్నర్ (State Government – The Governor)
17) ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర మంత్రి మండలి (Chief Minister and State Council of Ministers)
18) రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ – శాసనసభ మరియు శాసనమండలి (State Legislature – Assembly and Council)
19) శాసనసభా కమిటీలు మరియు స్థాయి సంఘాలు (Legislative Committees and Standing Committees)
20) కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలన మరియు భారత న్యాయ వ్యవస్థ లక్షణాలు (Administration of UTs and Features of Indian Judicial System)
21) సుప్రీంకోర్టు – నిర్మాణం, అధికారాలు మరియు విధులు (The Supreme Court – Structure and Powers)
22) రాష్ట్ర హైకోర్టు మరియు దిగువ స్థాయి కోర్టులు – సివిల్, క్రిమినల్, వాణిజ్య కోర్టులు (High Courts and Subordinate Courts)
23) జాతీయ న్యాయమండలి, గ్రామ న్యాయాలయాలు, లోక్ అదాలత్ మరియు మధ్యవర్తిత్వ కేంద్రాలు (National Law Council, Gram Nyayalaya, Lok Adalat and Arbitration)
24) న్యాయసమీక్ష, న్యాయవ్యవస్థ క్రియాశీలత మరియు ట్రిబ్యునల్స్ (Judicial Review, Judicial Activism and Tribunals)
25) కేంద్ర – రాష్ట్రాల మధ్య శాసన, కార్యనిర్వహణ మరియు ఆర్థిక సంబంధాల పంపిణీ (Distribution of Legislative, Administrative and Financial Powers)
26) భారత సమాఖ్య మరియు కేంద్ర రాష్ట్ర సంబంధాలు (Indian Federation and Centre-State Relations)
27) రాజ్యాంగబద్ధ సంస్థలు – UPSC, SPSC మరియు CAG (Constitutional Bodies – UPSC, SPSC and CAG)
28) భారత ఆర్థిక సంఘం మరియు కేంద్ర రాష్ట్ర సంబంధాల సంస్కరణల ఆవశ్యకత (Finance Commission and Necessity of Centre-State Reforms)
29) రాజమన్నార్ కమిటీ, సర్కారియా కమీషన్ మరియు ఎం.ఎం.పూంచీ కమిషన్ (Rajamannar, Sarkaria and M.M. Punchhi Commissions)
30) భారత రాజ్యాంగంలోని ఏకకేంద్ర, సమాఖ్య లక్షణాలు, ప్రత్యేక హోదా మరియు నీతి ఆయోగ్ (Unitary & Federal Features, Special Status and NITI Aayog)
31) రాజ్యాంగ సవరణ ప్రక్రియ మరియు ముఖ్యమైన రాజ్యాంగ సవరణలు (Constitutional Amendment Process and Important Amendments)
32) స్థానిక స్వపరిపాలన – CDP, NES మరియు బల్వంతరాయ్ మెహతా, అశోక్ మెహతా కమిటీలు (Local Self-Govt – CDP, NES, Balwant Rai and Ashok Mehta Committees)
33) దంత్ వాలా, సింఘ్వీ, సర్కారియా మరియు తుంగన్ కమిటీలు (Dantwala, Singhvi, Sarkaria and Thungon Committees)
34) 73వ రాజ్యాంగ సవరణ చట్టం మరియు ఉమ్మడి ఏపీలో పంచాయితీ రాజ్ – రాజు, వెంగళరావు కమిటీలు (73rd Amendment and PR in Combined AP – Raju and Vengala Rao Committees)
35) సి.నరసింహం, విఠల్ కమిటీలు, గ్రామ సభ మరియు పెసా (PESA) చట్టం (Narasimham & Vithal Committees, Gram Sabha and PESA Act)
36) గ్రామ పంచాయితీ, మండల మరియు జిల్లా పరిషత్ – అధికారాలు, విధులు మరియు యంత్రాంగము (Gram Panchayat, Mandal & Zilla Parishad – Powers and Machinery)
37) పంచాయితీ రాజ్ సంస్థల పనితీరు మరియు సమస్యలు (Performance and Issues of Panchayati Raj Institutions)
38) 74వ రాజ్యాంగ సవరణ చట్టము మరియు పట్టణ స్థానిక స్వపరిపాలన రకాలు (74th Amendment and Types of Urban Local Bodies)
39) సహకార సంఘములు మరియు షెడ్యూల్, గిరిజన ప్రాంతాల పరిపాలన (Cooperative Societies and Admin of Scheduled and Tribal Areas)
40) రాజకీయ పార్టీలు, పార్టీ ఫిరాయింపుల చట్టం, ప్రాంతీయవాదం, కొత్త రాష్ట్రాల డిమాండ్ – శ్రీకృష్ణ కమిషన్ మరియు జాతీయ సమగ్రత – NSC, NATGRID (Political Parties, Anti-Defection, Regionalism, Srikrishna Commission and National Integrity – NSC, NATGRID)
41) సంక్షేమ యంత్రాంగం – SC/ST అకృత్యాల నిరోధక చట్టం మరియు SC, ST, BC, మహిళా, మైనారిటీ కమిషన్లు (Welfare Mechanism – SC/ST Atrocities Act and Welfare Commissions)
42) సమాచార హక్కు చట్టం, లోక్ పాల్, లోకాయుక్త మరియు గవర్నెన్స్ – ఇ గవర్నెన్స్, సైబర్ భద్రత (RTI, Lokpal, Lokayukta and Governance – E-Governance, Cyber Security)
6) భారతదేశ ఆర్థిక వ్యవస్థ (Indian Economy) – దేశ రాజకీయ వ్యవస్థ (Country’s political system), గ్రామీణాభివృద్ధి (rural development), ప్రణాళికలు (planning) మరియు భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు (economic reforms in India).
01) భారత ఆర్థిక వ్యవస్థ మరియు సామాజిక ఆర్థిక లక్ష్యాలు (Indian Economy and Socio-Economic Goals) – ప్రస్తుత పరిస్థితి (Current Status), సామాజిక ఆర్థిక లక్ష్యాలు మరియు విజయాలు (Socio-Economic Goals and Achievements).
02) ఆర్థిక సంస్కరణలు మరియు సుస్థిరాభివృద్ధి (Economic Reforms and Sustainable Development) – ఎల్.పి.జి 1991 సంస్కరణలు (LPG 1991), సెజ్ చట్టం (SEZ Act), నియంత్రణ సంస్థల ఏర్పాటు (Regulatory Bodies), నీతి ఆయోగ్ మరియు సహకార సమాఖ్య వాదం (NITI Aayog and Cooperative Federalism), సమ్మిళిత మరియు సుస్థిర అభివృద్ధి (Inclusive and Sustainable Development).
03) పంచవర్ష ప్రణాళికలు (Five Year Plans) – ప్రణాళికల సామాజిక ఆర్థిక లక్ష్యాలు మరియు కేటాయింపులు (Socio-Economic Goals and Allocations of Five Year Plans).
04) వ్యవసాయం – ప్రాథమికాంశాలు మరియు పరిశ్రమలు (Agriculture – Fundamentals and Industries) – జీడీపీలో వ్యవసాయ రంగం పాత్ర (Role of Agriculture in GDP), ఉత్పత్తి, పంపిణీ మరియు విత్తపర సమస్యలు (Production, Distribution and Financial Issues), వ్యవసాయ రంగంలో పరిశ్రమల వృద్ధి (Growth of Industries in Agriculture Sector).
05) భూ సంస్కరణలు మరియు హరిత విప్లవం (Land Reforms and Green Revolution) – ప్రణాళికా కాలంలో వ్యవసాయం (Agriculture in Planning Period), భూ సంస్కరణలు (Land Reforms), హరిత విప్లవము (Green Revolution), వ్యవసాయ కమతాలు (Agricultural Land Holdings).
06) వ్యవసాయ విధానాలు మరియు మౌలిక వసతులు (Agricultural Policies and Infrastructure) – జాతీయ వ్యవసాయ విధానాలు (National Agri Policies), సాగునీటి వసతి (Irrigation), ఎరువుల పంపిణీ (Fertilizer Distribution).
07) వ్యవసాయ విత్తం మరియు మార్కెటింగ్ (Agricultural Finance and Marketing) – రుణాల లభ్యత మరియు పరపతి (Credit Availability), వ్యవసాయ సరుకుల మార్కెటింగ్ మరియు సహకార సంఘాలు (Agri-Marketing and Cooperatives).
08) భీమా, ఆహార భద్రత మరియు పథకాలు (Insurance, Food Security and Schemes) – వ్యవసాయ భీమా పథకాలు (Agri-Insurance Schemes), నూతన జాతీయ వ్యవసాయ విధానం 2000 (New Agri Policy 2000), ఆహార భద్రతా చట్టం (Food Security Act), ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన పథకాలు (Current Govt Schemes).
09) పారిశ్రామిక అభివృద్ధి మరియు విధానాలు (Industrial Development and Policies) – పారిశ్రామిక అభివృద్ధి మరియు ప్రధాన లక్షణాలు (Industrial Development and Features), పారిశ్రామిక విధాన తీర్మానాలు (Industrial Policy Resolutions), ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల ఉత్పాదకత (Productivity of Public and Private Sectors).
10) చిన్న పరిశ్రమలు మరియు కంపెనీల చట్టం (Small Industries and Companies Act) – చిన్న పరిశ్రమలు (Small Industries), పారిశ్రామిక రుగ్మతలు మరియు ఖాయిలా (Industrial Sickness and Closure), నూతన కంపెనీల చట్టం 2013 మరియు దుగ్గల్ కమిటీ (New Companies Act 2013 and Duggal Committee).
11) పారిశ్రామిక విత్తం మరియు కార్పొరేట్ రేటింగ్స్ (Industrial Finance and Corporate Ratings) – పారిశ్రామిక విత్త సహాయ సంస్థలు (Industrial Financial Institutions), మహారత్న, నవరత్న, మినీరత్న వివరాలు (Details of Maharatna, Navratna, Miniratna), ఫెరా మరియు ఫెమా చట్టాలు (FERA and FEMA Acts).
12) ఐటి పరిశ్రమ మరియు టెలికామ్ విధానం (IT Industry and Telecom Policy) – ఐటి పరిశ్రమ వృద్ధి మరియు ప్రభుత్వ పాత్ర (Growth of IT Industry and Government Role), నూతన టెలికామ్ విధానము (New Telecom Policy), ఐటీఈఎస్ – ఆధారిత సేవలు (IT Enabled Services – ITES).
13) వనరులు మరియు జనాభా ధోరణులు (Resources and Population Trends) – భౌతిక మరియు విత్త మూలధనం (Physical and Financial Capital), జనాభా పరిమాణం, కూర్పు మరియు పెరుగుదల ధోరణులు (Population Size, Composition and Growth Trends).
14) మానవాభివృద్ధి మరియు శ్రామిక విభజన (Human Development and Labour Distribution) – మానవాభివృద్ధి సూచీ – HDI (Human Development Index), జనాభా సంబంధిత ఉపయోగార్హ వనరు (Population as a Useful Resource), వృత్తి పరమైన శ్రామిక విభజన (Occupational Distribution of Labour).
15) బ్యాంకింగ్ వ్యవస్థ మరియు ఆర్‌బీఐ (Banking System and RBI) – బ్యాంకింగ్ నిర్మాణ స్వరూపము (Banking Structure), భారతీయ రిజర్వ్ బ్యాంకు (Reserve Bank of India), ముఖ్య వాణిజ్య బ్యాంకులు (Major Commercial Banks).
16) ఆర్థిక మరియు ద్రవ్య విధానాలు (Fiscal and Monetary Policies) – ఆర్‌బీఐ ద్రవ్య విధానము (RBI Monetary Policy), కోశ విధానము మరియు లోటు విధానము (Fiscal Policy and Deficit Policy), విత్త అసమతుల్యత మరియు ద్రవ్యలోటు (Fiscal Imbalance and Deficit).
17) మూలధన మార్కెట్ మరియు బీమారంగం (Capital Market and Insurance Sector) – మూలధన మార్కెట్ మరియు సెబి (Capital Market and SEBI), ఆర్థిక విత్త సంస్థలు మరియు పెట్టుబడి సంస్థలు (Financial and Investment Institutions), బీమారంగం (Insurance Sector).
18) విదేశీ వాణిజ్యం మరియు అంతర్జాతీయ సంస్థలు (Foreign Trade and International Organizations) – నూతన విదేశీ వర్తక విధానం 2015-20 (New Foreign Trade Policy 2015-20), విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు – FDI (Foreign Direct Investment), IMF, WB, IBRD, GATT, WTO – విధులు.
19) బడ్జెట్ మరియు పన్నుల విధానం (Budget and Taxation) – బడ్జెట్ రకాలు మరియు తయారీ (Types and Preparation of Budget), పార్లమెంటరీ విత్త సంఘాలు (Parliamentary Financial Committees), కేంద్ర బడ్జెట్ 2020-21 (Central Budget 2020-21), పన్నుల రకాలు మరియు ఆదాయం (Types of Taxes and Revenue).
20) జీఎస్టీ, ద్రవ్యం మరియు ద్రవ్యోల్బణము (GST, Money and Inflation) – వాట్ మరియు జీఎస్టీ ప్రభావం (VAT and Impact of GST), ద్రవ్యం – భావన, రకాలు, ముద్రణ మరియు సప్లయ్ (Money – Concept, Types, Printing and Supply), నోట్ల రద్దు తదనంతర పరిణామాలు (Post-Demonetization Impact), ద్రవ్యోల్బణము – రకాలు, కారణాలు మరియు నివారణలు (Inflation – Types, Causes and Control).
21) జాతీయ ఆదాయం మరియు సంక్షేమ పథకాలు (National Income and Welfare Schemes) – జాతీయాదాయ భావనలు – GDP, NDP, తలసరి ఆదాయం (National Income Concepts – GDP, NDP, Per Capita Income), కేంద్ర ప్రభుత్వ పథకాలు (Central Government Schemes).
| Arithmetic | It will include questions on problems relating to number system, simple interest, compound interest, ratio & proportion, average, percentage, profit & loss, time & work, work & wages, time & distance, clocks & calendars, partnership, mensuration etc. |
| Test of Reasoning | It will include questions of both verbal & non-verbal type ar.d include question on analogies, similarities and differences, spatial visualisation, spatial spatial orientation, problem solving, analysis, judgment, decision making, visual memory etc. |
| General Studies |
|
ఎపి పోలీస్ సిలబస్ డౌన్లోడ్ లింక్స్
| కానిస్టేబుల్ సిలబస్ PDF లో | ఇక్కడ క్లిక్ చేయండి |
| ఎస్సై సిలబస్ PDF లో | ఇక్కడ క్లిక్ చేయండి |
అభ్యర్దులారా , మేము ఈ ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షలకు పూర్తీ మెటీరియల్ త్వరలో ఉచితంగా అందించ బోతున్నాము. వివరాలకు వాట్స్ అప్ గ్రూప్ లో చేరండి. క్రింది లింకు ద్వారా చేరవచ్చు.




