AP 10th Class Telugu 2nd Lesson is Bathuku Gampa. Here the Notes and Guide are given for Download.
ఏపి పదవ తరగతి తెలుగు పుస్తకం తెలుగు పరిమళం లోని రెండో పాఠం బతుకు గంప నోట్స్ , గైడ్ ఇక్కడ ఇస్తున్నాం .. డౌన్లోడ్ చేసుకొని చదవ గలరు.
బతుకు గంప – తెలుగు పరిమళం
1. ప్రకాశం తల్లిగారికి ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి ?
2. 1884లో ప్రకాశం తండ్రిగారి అకాల మరణంతో, కుటుంబ బాధ్యతలన్నీ ఆయన తల్లి భుజాలపై పడ్డాయి.
కుటుంబాన్ని పోషించే భారం ఒంటరిగా ఆమె భరించాల్సి వచ్చింది.
2. ప్రకాశం తల్లిగారు ఏం నిర్ణయించుకున్నారు ?
2. పిల్లలకు ఇంగ్లీష్ విద్యను అందించాలనే ప్రకాశం తండ్రిగారి ఆకాంక్షలను నెరవేర్చడానికి, వారి తల్లి ఒంగోలులో
ఒక హెూటల్ను స్ధాపించి, దాని ద్వారా వచ్చే ఆదాయంతో పిల్లల చదువులను కొనసాగించాలని నిర్ణయించుకున్నారు.
3. పిల్లల అభివృద్ధి కోసం తల్లిదండ్రులు పడే శ్రమను గురించి చెప్పండి.
2. తమ పిల్లల అభివృద్ధి కోసం తల్లిదండ్రులు అంతులేని కృషి చేస్తారు. పిల్లలు చక్కటి విద్యను అభ్యసించి, జీవితంలో
ఉన్నత స్థానాన్ని అందుకోవాలని, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని తాపత్రయపడతారు. ఈ లక్ష్యాలను
చేరుకోవడానికి, తల్లిదండ్రులు ఎన్నో కష్టాలను భరిస్తూ, ఎడతెరిపి లేకుండా శ్రమిస్తూ, తమ సమయాన్ని పిల్లల
కోసం వెచ్చిస్తారు.