Dialogue on Health Diplomacy
గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆరోగ్య దౌత్యంపై చర్చ (Dialogue on Health Diplomacy) ని గాంధీనగర్ లో ప్రారంభించారు. భారత విదేశాంగ శాఖ, గుజరాత్ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.
Advantage Assam
రాష్ట్రంలో జరగనున్న పెట్టుబడిదారుల సదస్సు కోసం ‘అడ్వాంటేజ్ అస్సాం’ అనే మొబైల్ అప్లికేషన్‌ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ శుక్రవారం ప్రారంభించారు.
Qinghai Province registers warmest year in 2024
వాతావరణ రికార్డులు అందుబాటులో ఉన్న 1961 నుంచి చూస్తే “ప్రపంచపు పైకప్పు” గా పిలువబడే చైనాలోని క్వీన్ఘై ప్రావిన్స్ 2024 లో అత్యంత ఉష్ణోగ్రతను నమోదు చేసింది.
237,000 people displaced in DR Congo
అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న కాంగో దేశంలో 2025 ప్రారంభం నుండి ఇప్పటిదాకా సుమారు 237,000 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషనర్ (UNHCR) శుక్రవారం తెలిపింది.
మిషన్ దిగంతర విజయవంతం
స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా ఉపగ్రహాలను భారత అంతరిక్ష స్టార్ట్ అప్ సంస్థలు పిక్సల్, దిగంతర ఏరోస్పేస్ జనవరి 15, 2025 బుధవారం నింగిలోకి పంపాయి.భూమి చుట్టూ తిరుగుతున్న వాటిల్లో 5 సెం.మీ. కంటే చిన్నగా ఉన్న వస్తువులను గమనించే సామర్థ్యమున్న స్పేస్ కెమెరా ఫర్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ (ఎస్‌సీఓటీ) ఉపగ్రహాన్ని ప్రయోగించామని దిగంతర ఏరోస్పేస్ వెల్లడించింది. అంతరిక్షంలో ఉపగ్రహాల సమూహాన్ని కలిగిన తొలి భారతీయ ప్రైవేటు సంస్థగా ఇది నిలిచింది. రానున్న రెండు నెలల్లో మరో మూడు ఫైర్‌ఫ్లై శాటిలైట్‌లను పంపుతామని, భవిష్యత్తులో మరో 18 ఉపగ్రహాలను ప్రయోగించాలనే ప్రణాళిక ఉన్నట్లు సంస్థ సీఈఓ అవైజ్ అహ్మద్ తెలిపారు. పిక్సల్ సంస్థ ఈ ప్రయోగం ద్వారా ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ రిజల్యూషన్ కలిగిన మూడు హైపర్ స్పెక్ట్రల్ శాటిలైట్ (ఫైర్‌ఫ్లైస్)లను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అందుకున్న గుకేష్, మను భాకర్

ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ విశ్వ విజేతగా భారత గ్రాండ్ మాస్టర్, యువ కెరటం దొమ్మరాజు గుకేశ్ క్రీడల్లో భారత దేశ అత్యున్నత అవార్డు అయినటువంటి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ను అందుకున్నాడు. అలాగే పారిస్ 2024 ఒలింపిక్స్ లో ఇండియాకు రెండు పతకాలు అందించిన షూటర్ మను భాకర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును అందుకుంది. వీరిద్దరూ శుక్రవారం(జనవరి 17) రాష్ట్రపతి భవన్‌లో జరిగిన జాతీయ క్రీడా అవార్డుల వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి అవార్డులు పొందారు.
మొత్తం 32 మంది అథ్లెట్లు అర్జున అవార్డుతో సత్కరించబడ్డారు. వీరిలో 17 మంది పారా అథ్లెట్లు ఉన్నారు. పారిస్ పారాలింపిక్స్ లో మన అథ్లెట్లు ఏడు స్వర్ణాలు, తొమ్మిది రజతాలతో సహా 29 పతకాలు దేశానికి తీసుకొచ్చారు.
ఖోఖో ప్రపంచ కప్ 2025: సెమీస్ లోకి భారత పురుషుల, మహిళల జట్లు
ఖో ఖో ప్రపంచకప్ 2025లో భారత పురుషుల, మహిళల జట్లు వరుసగా పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్‌లపై అద్భుతమైన విజయాలతో సెమీ-ఫైనల్‌లోకి అడుగుపెట్టాయి. శుక్రవారం ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఖో ఖో ప్రపంచ కప్‌లో భారత పురుషుల జట్టు అద్భుతమైన ప్రదర్శనతో శ్రీలంకపై 100-40 తేడాతో సూపర్ విక్టరీ అందుకుంది.పురుషుల విభాగంలో భారత్, ఇరాన్, నేపాల్, దక్షిణాఫ్రికా జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి.