అది 2021వ సంవత్సరం. టోక్యో పారా ఒలింపిక్ 50 మీటర్ల షూటింగ్ క్రీడాపోటీ ఫైనల్ జరుగుతోంది. జనంతో కిక్కిరిసిన స్టేడియంలోకి చక్రాల కుర్చీపై ఓ మహిళ తొణకని ఆత్మస్థైర్యంతో ప్రవేశించింది. ఆ పోటీలో కాంస్యపతకాన్ని కైవసం చేసుకుంది. అప్పటికే 10మీ. ఎయిర్ రైఫిల్ లో బంగారు పతకాన్ని సాధించింది. ఆ మహిళే ‘అవని లేఖరా’. ఒకే పారా | ఒలింపిక్స్లో రెండు పతకాలను భారతదేశానికి అందించిన ఏకైక మహిళ ఆమె. తన పదకొండు సంవత్సరాల వయస్సులో జరిగిన కారు ప్రమాదంలో రెండు కాళ్ళు కోల్పోయి అంగవైకల్యం పొందినా! అధైర్యపడలేదు. తన చదువును కొనసాగిస్తూనే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తనకిష్టమైన షూటింగ్ అకాడమిలో చేరి శిక్షణ పొందింది. షూటింగ్ విభాగంలో మన దేశానికి స్వర్ణపతకం అందించిన ‘అభినవ్ బింద్రా’ను ఆదర్శంగా తీసుకుంది. అదే విభాగంలో రాణించి 2021లో రాజీవ్ ఖేల్త్న అవార్డును, 2022లో రాష్ట్రపతి చేతుల మీదుగా ‘పద్మశ్రీ’ అవార్డుని అందుకుని ఎందరికో ఆదర్శంగా నిల్చింది. జీవితంలో ఏదైనా సాధించడానికి సంకల్పబలం ఉండాలే కాని శారీరక వైకల్యం ఎంతమాత్రం అడ్డుకాదని నిరూపించింది. -పత్రిక వార్త
ఉద్దేశం.
ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల పట్ల సహానుభూతితో ఉండాలని, వారిలో ఆత్మస్థైరాన్ని నింపి, వారికి అండగా నిలవాలని, వారి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం.
రచయిత పరిచయం
రచయిత పేరు : డా|| వి. చంద్రశేఖరరావు
జననం- మరణం : 13/04/1959 08/07/2017
తల్లిదండ్రులు : మహాలక్ష్మి, దేవసహాయం దంపతులు
జన్మస్థలం : ప్రకాశం జిల్లా
ఇతర రచనలు జీవని, మాయాలాంతరు, ద్రోహవృక్షం, లెనిన్స్ మొదలగు కథాసంపుటాలు. నల్ల : మిరియం చెట్టు, ఐదు హంసలు, ఆకుపచ్చని దేశం నవలలు రచించారు.
ఇతర విశేషాలు : జీవని నాటకానికి ఉత్తమ నాటకంగా బహుమతి.