తెలంగాణ టెన్త్ పరీక్షా ఫలితాలు ఈరోజు 30 (మంగళవారం) న మధ్యాహ్నం 1 గంటకు విడుదల అగును.
ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరుగగా మూల్యాంకన ప్రక్రియ ఏప్రిల్ 20 నాటికే పూర్తయింది. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5.08 లక్షల మందికి పైగా విద్యార్థులు పదోతరగతి పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 2,57,952 మంది బాలురు ఉన్నారు. అలాగే 2,50,433 లక్షల మంది బాలికలు ఉన్నారు.
కాగా గతేడాది మొత్తం 4,84,370 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా ఉత్తీర్ణత శాతం 86.60% ఉంది. దీనిలో బాలుర కంటే బాలికలు ఎక్కువగా 88.53%తో మెరిశారు. 84.68 మంది బాలురు పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు.









