త్వరలో తెలంగాణ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ రాబోతుందా? ఇందుకు సంబంధించిన వార్త ఒకటి నెట్ లో చక్కర్లు కొడుతోంది. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు అని మీడియా చెపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 34,694 మంది బూత్ వాలంటీర్లను నియమించడానికి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోబోతున్నారు అని, ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నివేదిక సమర్పించాల్సిందిగా పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించినట్లు సమాచారం.
ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ రెడ్డి.. మెరుగైన పరిపాలనకు ఆంధ్రప్రదేశ్ లాగా బూత్ వాలంటీర్ వ్యవస్థ అవసరమని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వాటి ఫలితాలను నిజమైన అర్హులకు అందేలా చూడడం, పారదర్శక పాలన వ్యవస్థను అందించడం లాంటి బాధ్యతలను క్షేత్రస్థాయిలో నిర్వర్తించేందుకు బూత్ వాలంటీర్ల వ్యవస్థ అవసరం అని ఆయన చెప్పారు. దీనికి అనుగుణంగా ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు వాలంటీర్ వ్యవస్థ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోందని అదే సమయంలో పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తున్న క్రియాశీల కార్యకర్తలకు పని కల్పించినట్లు అవుతుందన్న అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం.
ఏది ఏమైనా దీనికి సంబంధించిన వివరాలు అండాల్సి ఉంది.
Source: teluguvidyarthi.com and Other Inputs