ప్రతి సంవత్సరం జూలై 11న ‘ప్రపంచ జనాభా దినోత్సవం’ జరుపుకుంటారు.
ఇది ఐక్యరాజ్యసమితి రూపొందించిన కార్యక్రమం. పెరుగుతున్న జనాభా, సమాజం, దేశాలు మరియు పర్యావరణంపై దాని ప్రభావం గురించి అవగాహన కల్పించడమే కాకుండా దానిని నియంత్రించడానికి కుటుంబ నియంత్రణ ప్రయోజనాలు, లింగ సమానత్వం, పేదరికం, తల్లి ఆరోగ్యం, మానవ హక్కులు మొదలైన జనాభా సమస్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో దీన్ని మొదలుపెట్టారు.
1987 జూలై 11న ప్రపంచ జనాభా 500 కోట్లకు (5 బిలియన్లకు) చేరుకున్న రోజును ‘ఫైవ్ బిలియన్ డే‘గా గుర్తించారు. ఈ సంఘటన నుంచి స్ఫూర్తి పొంది, ప్రపంచ బ్యాంక్‌లో సీనియర్ డెమోగ్రాఫర్ అయిన డాక్టర్ కె.సి. జకారియా ఈ సందర్భాన్ని ప్రపంచ జనాభా దినోత్సవంగా గుర్తించాలని ప్రతిపాదించారు. ఆయన ప్రతిపాదనను అనుసరించి, 1989లో అప్పటి ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP) గవర్నింగ్ కౌన్సిల్ ఈ దినోత్సవాన్నిప్రతిపాదించింది. దీన్ని 1990 డిసెంబర్‌లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం 45/216 ద్వారా ఆమోదించి ప్రపంచ జనాభా దినోత్సవాన్ని అదేరోజు కొనసాగించాలని నిర్ణయించింది. మొదటి కార్యక్రమం 1990 జూలై 11న 90 దేశాలలో జరిగింది.
ప్రపంచ జనాభా దినోత్సవం 2025: ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే…
“ఒక న్యాయమైన, ఆశాజనకమైన ప్రపంచంలో యువతకు వారు కోరుకున్న కుటుంబాలను సృష్టించే అధికారాన్ని కల్పించడం” (“Empowering young people to create the families they want in a fair and hopeful world”) అనేది ఈ సంవత్సరం ప్రపంచ జనాభా దినోత్సవం 2025 యొక్క థీమ్. యువత ఆరోగ్య సంరక్షణ, విద్య మరియు పునరుత్పత్తి హక్కులను పొందడం ఎంత ముఖ్యమో ఈ థీమ్ నొక్కి చెబుతుంది.
ప్రపంచ జనాభా దినోత్సవం కోసం గత కొద్ది సంవత్సరాల థీమ్‌లు
- 2024 ప్రపంచ జనాభా దినోత్సవం థీమ్: ఎవరినీ వదిలిపెట్టవద్దు, అందరినీ లెక్కించండి (Leave no one behind, count everyone).
- 2023 ప్రపంచ జనాభా దినోత్సవం థీమ్: లింగ సమానత్వం యొక్క శక్తిని ఆవిష్కరించడం: మన ప్రపంచంలోని అనంత అవకాశాలను అన్‌లాక్ చేయడానికి మహిళలు మరియు బాలికల గొంతులను పెంచడం.
- 2022 ప్రపంచ జనాభా దినోత్సవం 2022 థీమ్: 8 బిలియన్ల ప్రపంచం: అందరికీ స్థితిస్థాపక భవిష్యత్తు వైపు – అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మరియు అందరికీ హక్కులు మరియు ఎంపికలను నిర్ధారించడం.
- 2021 ప్రపంచ జనాభా దినోత్సవం థీమ్: సంతానోత్పత్తిపై కోవిడ్-19 మహమ్మారి ప్రభావం
- 2020 ప్రపంచ జనాభా దినోత్సవం థీమ్: కోవిడ్-19 మహమ్మారి మధ్య మహిళలు మరియు బాలికల ఆరోగ్యం మరియు హక్కులను ఎలా కాపాడుకోవాలి
- 2019 ప్రపంచ జనాభా దినోత్సవం థీమ్: ICPD యొక్క 25 సంవత్సరాలు: వాగ్దానాన్ని వేగవంతం చేయడం
- 2018 ప్రపంచ జనాభా దినోత్సవం థీమ్: కుటుంబ నియంత్రణ అనేది ఒక మానవ హక్కు.
ప్రపంచ జనాభా దినోత్సవం: కొన్ని ముఖ్యాంశాలు
ఐక్యరాజ్యసమితి ఆర్థిక మరియు సామాజిక వ్యవహారాల విభాగం అంచనా ప్రకారం రాబోయే దశాబ్దాలలో ప్రపంచ జనాభా పెరుగుదల రేటు తగ్గుతుందని చెప్పినప్పటికీ, 2020 కంటే 2050 నాటికి ప్రపంచ జనాభా 20-30% మధ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే 2080ల నాటికి 10.4 బిలియన్ల (1040 కోట్లు)కు చేరుకుంటుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. అయితే, కొందరు జనాభాశాస్త్రం నిపుణులు మాత్రం ఇది మరింత తొందరగా జరుగవచ్చని నమ్ముతున్నారు.
ప్రపంచ జనాభా దినోత్సవం 2025: జనాభాలో మొదటి 10 దేశాలు
ప్రస్తుత అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జనాభా కలిగిన మొదటి 10 దేశాలు
- భారతదేశం – 46 బిలియన్లు
- చైనా – 42 బిలియన్లు
- యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా – 347 మిలియన్లు
- ఇండోనేషియా – 286 మిలియన్లు
- పాకిస్తాన్ – 255 మిలియన్లు
- నైజీరియా – 238 మిలియన్లు
- బ్రెజిల్ – 213 మిలియన్లు
- బంగ్లాదేశ్ – 176 మిలియన్లు
- రష్యా – 144 మిలియన్లు
- ఇథియోపియా – 135 మిలియన్లు
(వివిధ మీడియా సేకరణల నుంచి స్పూర్తి పొంది)