10th Class Telugu Grammar – Jateeyaalu: In this article 100’s of Jateeyaalu were given and explained. Students can also Download in PDF format for free
జాతీయాలు అంటే ఒక జాతికి సంబంధించినవి. వీటినే పదబంధాలు, పలుకుబళ్లు, నుడికారాలు అని కూడా అంటారు.
జాతీయాలు – రకాలు
- శరీర అవయవాల ప్రమేయం ఉన్న జాతీయాలు
- పరిసరాల నుంచి వచ్చినవి
- సాంఘిక ఆచారాలు అలవాట్ల నుంచి ఉద్భవించినవి.
- పురాణ కథల నుంచి పుట్టినవి.
- జనశ్రుతిగా చెప్పుకునే కథల నుంచి వచ్చినవి.
- అతిశయోక్తుల ఆధారంగా ఏర్పడినవి.
- విశ్వాసాల (నమ్మకాలు) ఆధారంగా వచ్చినవి.
- అనుభవం ఆధారంగా వచ్చినవి.
- అనుకరణతో కూడినవి.
కొన్ని ముఖ్యమైన జాతీయాలు – వాడే సందర్భాలు (అర్థాలు)
శ్రీరామరక్ష = పరిరక్షించదగింది.
రామబాణం = తిరుగులేనిది
స్వస్తి పలుకు = ముగింపు చెప్పు
కాలధర్మం చెందడం = మరణించడం
కడుపు మాడ్చుకొను = పస్తులుండటం.
కారాలు, మిరియాలు నూరడం = మిక్కిలి కోపించడం
ఉలుకూ పలుకూ లేకపోవడం = జవాబు చెప్పకపోవడం
ఏనుగు పాడి = సమృద్ధి సంపద, మహదైశ్వర్యం
తూర్పారబట్టడం = విమర్శించడం
కలవరపడటం = కంగారు పడటం
గీటురాయి = కొలబద్ద
చిదంబర రహస్యం = శూన్యం, ఏమీ కనిపించనిది.
భీష్మ ప్రతిజ్ఞ = తీవ్రమైన శపథం
నలభీమ పాకం =ప్రశస్తమైన వంట
చుప్పనాతి బుద్ధి =ఓర్వలేనితనం
విశ్వామిత్ర సృష్టి = నూతన సృష్టి
కబంధ హస్తాలు = విడిపించుకోవడానికి వీలులేని దుర్మార్గపు పట్టు
రూపుమాపడం = శాశ్వతంగా తొలగించడం
మాట మీద నిలబడటం = ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం
నీరుకారి పోవడం = నిరుత్సాహపడటం
కనువిప్పు = జ్ఞానోదయం కావడం
మిన్నందుకోవడం = సంతోషంతో ఉప్పొంగిపోవడం
గజ్జె కట్టడం = పని ప్రారంభించడం.