జానపదుని జాబు: 10th Telugu 3rd Lesson – Janapaduni Jabu

జానపదుని జాబు . బోయి భీమన్న | Janapaduni Jabu – Boyi bheemanna : Get Important Information, Questions and Answers, Grammar, Kavi Parichayam and Other Study Material from this 3rd Lesson of AP 10th Telugu Text Book.

పాఠ్యాంశ ఉద్దేశం/నేపథ్యం

భారతదేశం వ్యవసాయ ప్రధానమైన దేశం. భారతదేశ జనాభాలో ఎక్కువమంది గ్రామాలలోనే నివసిస్తున్నారు. “గ్రామంలోని ప్రతి ఇల్లూ విద్యాగంధంతో గుబాళించి, అభివృద్ధి చెందితేనే మన దేశం సుసంపన్నంగా సస్యశ్యామలంగా ఉంటుంది” అని మహాత్మాగాంధీ అన్నారు. ఐతే ప్రస్తుతం గ్రామాలు ఎలా ఉన్నాయి ? వారి జీవితాలు ఎలా ఉంటాయి ? అనే విషయాలను వివరిస్తూ, గ్రామాల్లోని పేదలు, దళితుల జీవితాలను చిత్రిస్తూ ‘పల్లెటూరి లేఖలు’ అనే పేరుతో డా|| బోయి భీమన్న రచించాడు. ఇవి 1932లో ‘ జనవాణి’ పత్రికలో ప్రచురించబడ్డాయి. 1933లో ‘జానపదుని జాబులు’ అనే పేరుతో ‘ప్రజామిత్ర’లో ప్రచురింపబడ్డాయి. జానపదుడు చదువుకొన్నవాడు. పేదరికం వలన చదువు కొనసాగించలేడు. తన స్వగ్రామం వెళ్ళిపోతాడు. పల్లెటూరి పనుల్లో మునిగిపోతాడు. పట్నంలో శ్రీమంతుడైన మిత్రునికి లేఖలు రాస్తాడు. అందులో తన అవస్థలు రాస్తాడు. గ్రామాల్లోని పరిస్థితులు వివరిస్తాడు. వీటిని డా|| బోయి భీమన్నగారు రాశారు.

రచయిత పరిచయం | Kavi Parichayam

రచయిత : డా॥ బోయి భీమన్న

కాలం : 19 సెప్టెంబర్, 1911 – డిసెంబర్ 16, 2005.

జన్మస్థలం తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు గ్రామవాసి. నిరుపేద దళిత కుటుంబంలో జన్మించారు.

రచనలు:: తన 11వ ఏట రచనలు ప్రారంభించారు. గుడిసెలు కాలిపోతున్నాయ్, పాలేరు, జానపదుని జాబులు, రాగవైశాఖి, పిల్లీశతకం, ధర్మంకోసం పోరాటం మొ||నవి 70కి పైగా రచనలు చేశారు. ఈయన రచించిన పాలేరు’ ఎంతోమంది పేదలు, దళితుల కుటుంబాలలో వెలుగులు నింపింది.

అవార్డులు రివార్డులు : డా|| బోయి భీమన్నగారు రచించిన “గుడిసెలు కాలిపోతున్నాయ్” రచనకు 1975లో సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. 1973లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్ ఇచ్చి భారత ప్రభుత్వం సత్కరించింది. విశేషాలు : క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. జర్నలిస్టుగా పనిచేశాడు. 1940-45 మధ్యకాలంలో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాడు.

ప్రవేశిక

పంటను కౌలుచేసి, ధాన్యం రాసులు పోసి, తమ కడుపులు కాలుతూ ఉన్నా, కన్నీళ్ళు కారుతూ ఉన్నా, ఇనాందారులకు ఫలితం అంతా అప్పగించి వట్టిచేతులు నలుపుకొంటూ ఇండ్లకు పోయి పస్తులు పడే రైతుల దీనగతి ఎవరి హృదయం కరిగించదు ? ఈ మాటలు చెబుతున్నది ఎవరు ? ఏ సందర్భంలో చెబుతున్నాడో తెలుసుకోవడానికి పాఠం చదవండి.

ప్రియసఖా! నీ లేఖ అందింది. పట్నం జీవితం ఎలా ఉంటుందో అందులో తగ్గించావు, పల్లెటూరి జీవితాన్ని చిత్రిస్తూ ఉత్తరం రాయమన్నాను. నీది ఉత్తమమైన వాంచ. ఒకచోటి జీవిత విధానంతో మరొకటి జీవిత విధానాన్ని నిత్యమూ వాల్ని తెరాసుకొంటూ ఉండాలి. నుంచి చెడ్డలు, హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే సరి చేసుకోవాలి. ఈ వాంతనకు కలిగినందుకు అభినందిస్తున్నాను. నీ పట్న ఊతం – నా పల్లెటూరి జీవితంతో పోలిస్తే పరస్పర విరుద్ధంగా ఉంటుంది. నా జీవిత నిరాణాన్ని గురించి రాయడమంటే పల్లెటూళ్ళ పాత విధానాన్ని గురించి రాయడమన్నమాట. పల్లెటూళ్ళు అక్కడి వాళ్ళ ఉతాలు ఎలా ఉంటాయో నీకు తెలుసా ? విద్యుద్దీపాలతో, సంఖ్యలు ఉన్న మేడలలో హాయిగా సుఖించే నీకు ఏమి తెలుస్తుంది ? నీకు మా గ్రాము జీవితం అర్థం కావాలంటే, మా ఇంటికి ఒకసారి గా! ఈ పూరి గుడిసెలో ఒక్కరోజు ఉండు

ఇట్లు

నీ మిత్రుడు.

ప్రశ్నలు – జవాబులు – Important Questions & Answers

1 ఉత్తరాన్ని ఎవరు, ఎవరికి రాసి ఉంటారు ?

పల్లెటూరులో నివసించే వ్యక్తి పట్నంలో నివసించే తన మిత్రునికి ఉత్తరం రాసి ఉంటాడు.

2.దేని గురించి రాశాడు ?

పట్నవాసపు జీవితాన్ని, పల్లెటూరి జీవితంతో పోల్చి రాశాడు. పల్లెటూరి జీవితంలోని బాధలు రాశాడు.

3. లేఖను చదివారు కదా? మీరు ఏం గ్రహించారు ?

లేఖా రచయిత పల్లెటూరి వాడు. పేదవాడు. పట్నవాసంలో సుఖం ఉందని అతని భావన. పల్లెటూరి జీవితం, పట్నవానపు జీవితం పరస్పర విరుద్ధమైనవని అతని భావం.

4. పల్లెటూళ్ళ, పట్టణాల జీవితాలు పరస్పర విరుద్ధంగా ఉంటాయని ఎందుకన్నారు ?

పల్లెటూరి జీవితంలో సుఖం తక్కువ. ఆధునిక సౌఖ్యాలు తక్కువగా ఉంటాయి. కానీ, మనుషుల మధ్య స్నేహం ఎక్కువ. కలిసి మెలిసి ఉంటారు. ఒకరి కష్టసుఖాలలో అందరూ పాలు పంచుకొంటారు. ఆడుతూ పాడుతూ పనిపాటలు చేసుకొంటారు. హాయిగా కబుర్లు చెప్పుకొంటారు. స్వార్థం తక్కువ. చాలామంది వ్యవసాయం పైన జీవిస్తారు. పగలంతా శ్రమ పడతారు. రాత్రంతా హాయిగా నిద్రపోతారు. వాతావరణ కాలుష్యం ఉండదు. ప్రకృతిలో లీనమై జీవిస్తారు.

పట్టణాలలో జీవితాలు సుఖంగా ఉంటాయి. ఆధునిక సౌఖ్యాలు ఎక్కువ. కాని, ఎవరి స్వార్గం వారిది. ఎవరూ ఉద్యోగులే. మితిమీరిన కాలుష్యం అన్ని రకాల కాలుష్యాలకు నిలయం. ప్రకృతితో సంబంధంలేని జీవితాలు ఎవరినీ పట్టించుకోరు. మాట్లాడుకోరు. సహాయ సహకారాలు ఉండవు. ఇరుకు గదులలో నివాసాలు. చాలామంది అంతా తొందరే. విపరీతమైన రద్దీ, కంగారు, హడావుడి పరుగులు.

పల్లెటూళ్ళ గురించి మీకు తెల్సింది చెప్పండి.

అమ్మ ఒడిలోని కమ్మదనం పల్లెటూర్లలో ఉంది. తెలుగు భాషలోని తీయదనం అక్కడే ఉంది. పక్షుల కిలకిలారావాలతో మెలుకువ వస్తుంది. చెట్ల సందులలోంచి సూర్యోదయం చూడముచ్చటగా ఉంటుంది. లేగదూడల గంతులు బాగుంటాయి. కబుర్లు చెప్పుకొంటూ పొలాలకు వెళ్ళే రైతులతో సందడిగా ఉంటుంది. పిల్లలు చదువుల కోసం స్కూళ్ళకు వెడతారు. ఒకటే అల్లరి. అరుపులు, గోలగోలలా ఉంటుంది.

సాయంత్రం అందరూ ఇళ్ళకు చేరతారు. స్నానాలు చేసి, భోజనాలు చేస్తారు. పిల్లల ఆటలు, పాటలు, పెద్దల కబుర్లు, వేళాకోళాలు, వెక్కిరింతలు, నవ్వులు, నిద్రకుపక్రమిస్తారు.

కల్మషం లేని మనుషులు, కాలుష్యం లేని వాతావరణం. దొరికిన దానితో తృప్తి పడతారు. పెడతారు. తింటారు.

కఠిన పదాలకు అర్థాలు

దీపం బుడ్డి = చిన్నమూతి గల వెడల్పైన (దీపం) పాత్ర

కరకట్టు = కరెక్ట్ – సరియైనది

నిరుద్యోగం =ఉద్యోగం లేకపోవడం

అణా= 6 పైసలు (పాతకాలపు నాణెం)

పక్షం=తరపు

దుకాణం= పచారీ కొట్టు

సాన్నిధ్యం= దగ్గరగా ఉండడం

వాదన = తర్కం

మినపకుడుం – = వాసెనపోలు (మినపపిండి, వరినూకతో కలిపి ఆవిరిపై ఉడికించే ఇడ్లీ వంటిది)

గుణించి= లెక్కించి

Iఅవగాహన – ప్రతిస్పందన

పల్లె గొప్పదా ? పట్నం గొప్పదా ? మీరైతే దేన్ని సమర్థిస్తూ మాట్లాడతారు ? ఎందుకు ?

పల్లె గొప్పది : స్నేహం ఎక్కువ. మనుషుల మధ్య చక్కటి అనుబంధాలు ఉంటాయి. ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. కలసిమెలసి ఉంటారు. కష్టసుఖాలలో పాలుపంచుకొంటారు. కల్మషం ఉండదు. వాతావరణం కాలుష్యం ఉండదు. ప్రశాంతంగా ఉంటుంది. రణగొణ ధ్వనులు ఉండవు. ట్రాఫిక్ సమస్యలు ఉండవు. కమ్మటి గేదె పెరుగుతో అన్నం తినవచ్చు. తాజాకూరలు దొరకుతాయి. ఎవర్ని పలకరించినా నవ్వుతూ మాట్లాడతారు. పల్లె తల్లిలాంటిది. తల్లి దగ్గర ఉంటే ఎంత భద్రతగా ఉంటుందో, ఎంత హాయిగా ఉంటుందో అంత హాయిగా ఉంటుంది. పల్లెను నమ్మినవాడే తెలివైనవాడు పల్లెలు భూలోకస్వర్గం.

పట్నం గొప్పది : చదువుకు బాగుంటుంది. చాలా కాలేజీలు, స్కూళ్ళు, లైబ్రరీలు ఉంటాయి. చదువుకొనేందుకు చాలా అవకాశాలు ఉంటాయి. సేద తీరడానికి పార్కులు ఉంటాయి. సినిమాహాళ్ళు ఉంటాయి. అప్పుడప్పుడు సర్కర్లు కూడా ఉంటాయి. చదువుకొన్నాక మంచి ఉద్యోగానికి కూడా అవకాశం ఉంటుంది. ప్రతిభ చూపిస్తే ఉద్యోగంలో మంచి ప్రమోషన్ కూడా వస్తుంది. హాయిగా, సుఖంగా జీవించవచ్చు. చక్కటి నివాసాలు ఉంటాయి. రోడ్లు కూడా బాగుంటాయి. 24 గంటలూ జనంతో కళకళలాడుతూ ఉంటుంది. ఏ వస్తువైనా దొరుకుతుంది. ఎక్కడ నుండి ఎక్కడకు వెళ్ళాలన్నా వాహనాలు దొరకుతాయి. భయం ఉండదు. పెళ్ళివారిల్లులా సందడిగా ఉంటుంది.

(సూచన: విద్యార్థులలో ఎవరికి ఏది ఇష్టమైతే దానిని గొప్పదిగా చెప్పవచ్చు. )

2. గతంతో పోలిస్తే నేడు వ్యవసాయం చేసేవారి సంఖ్య క్రమేణా తగ్గుతోంది. దీనికి కారణాలు ఏమై ఉంటాయి.? తెల్పుకొని చర్చలో పాల్గొనండి.

జ. వ్యవసాయం చేయాలంటే ఓర్పు కావాలి. శారీరకంగా కష్టపడాలి. రాత్రనక, పగలనక కష్టపడాలి. చాలా బాధలుపడాలి. ఇప్పటివారికి ఓర్పు తక్కువ. కష్టపడే తత్వం తగ్గింది. నిరంతరం శ్రమపడే స్వభావం లేదు. సుఖవాంఛ పెరిగింది. సులువుగా డబ్బు సంపాదించాలనే కోరిక పెరిగిపోయింది. పట్నవాసపు మోజు పెరిగింది. చదువుకొని ఉద్యోగం చేయాలనే కోరిక పెరిగిపోయింది. వ్యవసాయంలో నష్టాలు కూడా కారణం. సరైన ధర రాదు. అప్పులతో బాధపడాలి. కూలిరేట్లు పెరిగిపోయాయి. ఖర్చులు పెరిగిపోయాయి. సౌఖ్యం తక్కువ. కష్టం ఎక్కువ. అందుకే వ్యవసాయం చేయడానికి నేడు ఇష్టం చూపించటం లేదు.

చదువుకొన్న వాళ్ళ గురించి, పట్టణవాసుల గురించి కవి ఏమని ప్రస్తావించారు?

జ. పట్టణంలో కాలం ఖచ్చితంగా పాటిస్తారు. పట్నం వాళ్ళు, పల్లెటూరి వాళ్ళు కష్టపడి సంపాదించిన దానిని తింటారు. ఎన్నో సుఖాలు అనుభవిస్తారు. ఆ సుఖాలన్నీ పల్లెటూరి వారు కష్టపడి సమకూర్చినవే.

జానపదుడు తన పట్టణం మిత్రుణ్ణి పల్లెటూరుకు ఎందుకు రమ్మని ఆహ్వానించాడు?

పల్లెటూరి వాళ్ళు పడే కష్టాన్ని చూడడానికి రమ్మన్నాడు. ఆ కష్టాలు తొలగిపోతే పల్లెటూళ్ళు, మానవ సంఘానికి ఇచ్చే ఆనందాన్ని అవగాహన చేసుకొనేందుకు రమ్మన్నాడు. పల్లెటూళ్లో దొరికే నారింజపళ్ళూ, వెలగపళ్ళూ, కొబ్బరి కురిడీలు మొదలైనవి తినడానికి రమ్మన్నాడు.

బోయి భీమన్న గురించి సొంతమాటల్లో రాయండి.

బోయి భీమన్న 19 సెప్టెంబర్, 1911లో తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు గ్రామంలో జన్మించారు. తన రచనల ద్వారా సమాజంలో మార్పు కోసం ప్రయత్నించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. కొంతకాలం జర్నలిస్టుగా పనిచేశారు. ఉపాధ్యాయుడిగా పనిచేశారు. డా|| బోయి భీమన్న గుడిసెలు కాలిపోతున్నాయి, పాలేరు, జానపదుని జాబులు, రాగవైశాభి, పిల్లీశతకం, ధర్మం కోసం పోరాటం మొదలైనవి 70కి పైగా రచనలు చేశారు. పాలేరు నాటకం చాలామంది జీవితాలను మార్చింది. ‘గుడిసెలు కాలిపోతున్నాయ్’ రచనకు 1975లో ఆంధ్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. 1978లో పద్మశ్రీ 2001లో పద్మభూషణ్ వరించాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం ‘కళాప్రపూర్ణ’, ‘గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. 1991లో రాజ్యలక్ష్మి అవార్డు వచ్చింది.

కింది ప్రశ్నలకు ఆలోచించి పదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

పల్లెటూళ్ళు సుభిక్షంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. అలాంటి పల్లెటూళ్ళు రోజు రోజుకూ తమ ఉనికిని, సంస్కృతిని, ఆత్మను కోల్పోతున్నాయి. ఇందుకు గల కారణాలు ఏమై ఉంటాయి? ఇవి కళకళ లాడాలంటే మనం ఏం చేయాలి?

పల్లెటూళ్ళు సుభిక్షంగా ఉండాలంటే, వ్యవసాయం లాభసాటిగా ఉండాలి. ‘దున్నేవాడిదే భూమి’ కావాలి. పండించిన పంటకు సరైన ధర రావాలి. ఎరువులు, పురుగుమందులు ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలి. నీటి సదుపాయం ఉండాలి. రైతులకు జీవిత భీమా ఉండాలి. అప్పుడు వ్యవసాయంపై జనానికి మక్కువ పెరుగుతుంది. పట్నపు వలసలు ఆగుతాయి. పల్లెలు కళకళలాడతాయి. పల్లెలు కళకళలాడితే ప్రభుత్వ ఖజానాలో కాసులు గలగలలాడతాయి. దేశం సుభిక్షంగా ఉంటుంది. ఉనికి : పల్లెటూళ్ళలో బ్రతుకు తెరువు లేక జనం పట్నాలకు వలసపోతున్నారు. జనం లేక పల్లెటూళ్ళు వెలవెలబోతున్నాయి. ఉన్న కొద్దిపాటి జనానికి పనులు లేవు, వ్యవసాయం చేసినా నష్టాలు తప్పడం లేదు. వారు కూడా పట్నాలకో, ఇతర దేశాలకో ‘పనికోసం’ వెళ్ళిపోవడానికి చూస్తున్నారు. అందుకే ఉనికి కోల్పోతున్నాయి. సంస్కృతి : పల్లెటూరిలో చాలా మంది వ్యవసాయదారులు ఉంటారు. ధాన్యపుగింజలకు లోటుండదు. తిండికి లోటు ఉండదు. అందుచేత ఎవరికైనా క్రొత్తవారికి కడుపునిండా తిండి పెట్టేవారు. ఆదరించేవారు, ఆప్యాయంగా పలకరించేవారు. పాడి పశువులుంటాయి. కనుక పాలు, పెరుగు, నెయ్యి సమృద్ధిగా ఉండేవి. ప్రతి ఇంటా ఇవి సమృద్ధిగా ఉండేవి. క్రొత్త వారికి ఉచితంగా ఇచ్చేవారు. ఇది పల్లెటూరి సంస్కృతి. కాని వ్యవసాయంలో కన్నీరే మిగులుతోంది. పశుపోషణ తలకు మించిన భారమౌతుంది. అందుచేత పల్లెటూళ్ళు తమ సంస్కృతిని కోల్పోతారు. అసలే జనాలు లేరు. ఉన్నవారికి బాధలు. ఇక సంస్కృతి ఎలా నిలబెట్టుకొంటారు.

ఆత్మ : పల్లెటూరికి ఆత్మ ఆత్మీయత. ఎవరినైనా ఆత్మీయంగా పలకరించడం పల్లెటూరి లక్షణం. కేవలం పలకరించడమే కాదు, వారి కష్ట సుఖాలలో పాల్గొనడం, పదిమందికి పెట్టడం, గలగలా నవ్వడం, చకచకా పనులు చేయడం. కల్మషం, మోసం తెలియకపోవడం, ఇవన్నీ పల్లెటూరి లక్షణాలు. కాని, పట్నవాసపు పోకడలు నేడు బాగా పెరిగిపోయాయి. అందుచేత ‘అమాయకత్వం’ స్థానంలో ‘మాయకత్వం వచ్చింది. మాయకత్వం ఉన్నచోట పై పేరాలో లక్షణాలేవీ ఉండవు. అందుచేతనే పల్లెటూరికి ‘ఆత్మ’ కూడా తొందరగా కనుమరుగవుతోంది. పల్లెటూళ్ళు కళకళలాడాలంటే వాటి ఉనికి, సంస్కృతి, ఆత్మలను కాపాడాలి. కేవలం ఉపన్యాసాల వల్ల ఇవి సాధ్యం కావు. పట్టుదలతో కృషి చేయాలి. సమాజాన్ని పూర్తిగా సంస్కరించాలి.

‘పల్లెటూళ్ళు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిళ్ళు’, దీన్ని సమర్థిస్తూ సమాధానం రాయండి. (లేదా) ‘పల్లెటూళ్ళు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిళ్ళు’ ఎలా ? (లేదా) పల్లె జీవితంలోని అనుకూల అంశాలను వివరిస్తూ పది వాక్యాలలో ఒక వ్యాసం రాయండి. (లేదా) మీరు నివసించేది పల్లెటూరైతే పల్లెటూరు గురించి, పట్నమైతే పట్నం గురించి ఏది సౌఖ్యంగా ఉంటుందో వివరిస్తూ రాయండి.

పల్లెటూళ్ళలో ట్రాఫిక్ సమస్యలు ఉండవు. రణగొణ ధ్వనులు ఉండవు. అందుచేత ప్రశాంతంగా ఉంటుంది. పెద్ద పెద్ద కర్మాగారాలుండవు. వాహనాల పొగ ఉండదు. అందుచేత కాలుష్యం ఉండదు. కాలుష్యం లేని నివాసమే స్వర్గం కదా! జనాభా తక్కువ కనుక సమస్యలుండవు. ఇరుకు ఉండదు. చక్కగా పచ్చటి ప్రకృతి, ఎటుచూసినా వరిచేలు, జొన్నచేలు, మొక్కలు, చెట్లతో కళకళలాడుతూ ఉంటుంది. హాయిగా అమ్మ ఒడిలోని కమ్మదనం అంతా పల్లెటూరి జీవితంలో అనుభవించవచ్చును.

ఎవర్ని పలకరించినా ఆప్యాయంగా మాట్లాడతారు. కష్ట సుఖాలలో చేదోడు వాదోడుగా ఉంటారు. దొంగల భయం ఉండదు. పక్షుల కిలకిలలతో రోజు ప్రారంభమౌతుంది. వెన్నెలలో ఆటలతో, కబుర్లతో, కథలతో, నవ్వులతో నిద్రమంచం పైకి చేరతాం. ఇంతకంటే సౌఖ్యవంతమైన జీవితం ఎక్కడా ఉండదు. అందుకే పల్లెటూర్లు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిళ్ళు అని ఖచ్చితంగా చెప్పవచ్చును.

క్రింది గద్యాన్ని చదివి, క్రింది ప్రశ్నలకు సమాధానములు రాయండి.

ఒకప్పుడు మానవజాతి ప్రగతికి సంకేతాలుగా భావింపబడిన సాంకేతిక అద్భుతాలు ఈ వేళ పర్యావరణానికి పెద్ద ప్రమాదాలుగా పరిణమిస్తున్నాయి. మన పరిశ్రమలు, కర్మాగారాలు, వాహనాలు, రకరకాల విద్యుత్ పరికరాలు పర్యావరణ కాలుష్యానికి ముఖ్యమైన కారణాలుగా ఉంటున్నాయి. వాతావరణంలో బొగ్గుపులుసు వాయువు, గ్రీన్‌హౌస్ వాయువులు ఎక్కువౌతున్నాయి. వీటి వలన తీవ్రమయిన పర్యావరణ సమస్యలు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 2050 నాటికి 15 మించి 35 శాతం జంతువులు నశించి పోయే ప్రమాదముందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

ప్రశ్నలు:

అ) వాతావరణ కాలుష్యానికి కారణమయిన వాయువులు ఏవి ?

ఆ) జంతువులు ఎందువలన నశించిపోతాయి ?

ఇ) సాంకేతిక అద్భుతాలు నేడు ఎట్టి ఫలితాలు ఇస్తున్నాయి ?

ఈ) 2050 నాటికి ఎలాంటి ప్రమాదమున్నదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు?

ఉ) పై గద్యం చదివి ఒక ప్రశ్నను తయారు చేయండి.

జవాబులు:

అ) బొగ్గుపులుసు వాయువు, గ్రీన్‌హౌస్ వాయువులు.

ఆ) పర్యావరణ సమస్యల వల్ల జంతువులు నశించిపోతాయి.

ఇ) పర్యావరణానికి పెద్ద ప్రమాదాలుగా పరిణమిస్తున్నాయి.

ఈ) 15 నుంచి 35 శాతం జంతువులు నశించిపోయే ప్రమాదం ఉన్నదని శాస్త్రజ్ఞులు అభిప్రాయపడుతున్నారు.

ఉ) ఈ గద్యాంశం ఏ విషయాన్ని తెలుపుతున్నది ?

జానపదుని జాబు రచయిత ఎవరు ? ఆయన అందుకున్న పురస్కారాలేవి ?

జానపదుని జాబు పాఠమును డా॥ బోయి భీమన్నగారు రచించారు. ఆయన రచించిన గుడిసెలు కాలిపోతున్నాయ్ రచనకు 1976లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. కేంద్ర ప్రభుత్వం 1973లో పద్మశ్రీ బిరుదునిచ్చింది. 2001లో పద్మభూషణ్ బిరుదునిచ్చి గౌరవించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదును ఇచ్చింది. 1978-84 మధ్య రాష్ట్ర ప్రభుత్వం శాసనమండలి సభ్యత్వం ఇచ్చి బోయి భీమన్న గారిని గౌరవించింది. 1991లో రాజ్యలక్ష్మి ఫౌండేషన్ వారు రాజ్యలక్ష్మి అవార్డును ఇచ్చి సత్కరించారు.

పల్లెటూరి జీవితం ఎలా ఉంటుందో తెలపండి ?

పల్లెటూరి జీవితం ఎంతో మనోహరంగా ఉంటుంది. అక్కడ చక్కని గాలి, ఎండ, నీరు దొరుకుతుంది. పాలు, కూరగాయలు దొరుకుతాయి. మంచి అందమైన చేలూ, కాలువలూ ఉంటాయి. అక్కడ ప్రకృతి మనోహరంగా ఉంటుంది. కాని, ఆధునిక సదుపాయాలు ఎవీ అక్కడ ఉండవు. అక్కడి ప్రజలు కలిసిమెలిసి జీవిస్తారు. ఒకరికి మరొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు.

పల్లెల్లో నివసించే వారందరూ నిజంగా సుఖపడుతున్నారని భావిస్తున్నారా ?

పల్లెలు నిజానికి సౌఖ్యనిలయాలు. పల్లెల్లో మంచి పాడిపంటలు ఉంటాయి. తాజా కూరగాయలు, చల్లని, కలుషితం కాని గాలి లభిస్తుంది. ప్రతి ఇల్లు ముగ్గులతో పూల తోరణాలతో కళకళలాడుతూ ఉంటుంది. గ్రామాల్లో ఆవులు, గేదెలు ఇచ్చే తాజా పాలు లభిస్తాయి. అక్కడ కల్మషం లేని ప్రజల పలకరింపులు దొరకుతాయి. పల్లె ప్రజలు పరస్పరం ఒకరికి మరొకరు సాయం చేసుకుంటారు. పల్లెల్లో మంచి తాజాపళ్ళు, కూరలు లభిస్తాయి.

కాని గ్రామాలలో కూడా కొన్ని లోటుపాట్లు ఉంటాయి. ముఖ్యంగా వాటికి రోడ్లు, ప్రయాణ సౌకర్యాలు ఉండవు. విద్య వైద్య సదుపాయాలు ఉండవు. కావలసిన వస్తువులు అన్నీ అక్కడ దొరకవు. సరుకులకై నగరాలకు వెళ్ళాలి. చదువులకు నగరాలకు వెళ్ళాలి. రోగం వస్తే మంచి డాక్టర్లు పల్లెల్లో ఉండరు. విద్యుచ్ఛక్తి కూడా 24 గంటలూ అక్కడ లభించదు. కొత్త బట్టలు వగైరా కావాలంటే నగరాలకు పల్లెవాసులు వెళ్ళాలి.

కాబట్టి పల్లెల్లో నివసించే వారందరూ నిజంగా సుఖపడుతున్నారని మనం భావించకూడదు. పల్లె ప్రజల కష్టాలు పల్లెవాసులకు ఉన్నాయి. పల్లె ప్రజలకు తగిన విశ్రాంతి లభించదు. 24 గంటలూ కష్టపడితే కానీ కూడు, గుడ్డ దొరకదు.

శ్రమదోపిడి గురించి రచయిత ఉద్దేశ్యమేమిటి ?

జి. సామాన్యంగా గ్రామాల్లో భూకామందులు, తమకున్న పొలాలను తాము సేద్యం చేసుకోకుండా గ్రామాల్లోని బీద రైతులకు కౌలుకు ఇస్తుంటారు. ఆ బీద రైతులు ధనికుల పొలాలను కౌలుకు తీసుకొని, కష్టపడి సేద్యం చేస్తుంటారు. రాత్రింబగళ్ళు కష్టపడి పండించిన ధాన్యాన్ని భూకామందులకు వారు కౌలుగా వారికి చెల్లిస్తారు. మిగిలిన ధాన్యాన్ని వారు తింటారు. కాని సామాన్యంగా కౌలు రైతులకు ఏమీ మిగలదు. భూకామందులు, బీద రైతుల శ్రమను దోపిడీ చేయడం క్రింద వస్తుంది.

బీదరైతులు శ్రమపడి పండించిన ఫలసాయాన్ని భూకామందులు దోచుకుంటున్నరన్నమాట నిజానికి శ్రమపడేవానికి ఫలాన్ని తినే హక్కు ఉంటుంది. కాని ఇక్కడ శ్రమ ఒకరిది, ఫలం మరొకరిది అవుతోంది.

దీనినే దృష్టిలో ఉంచుకొని రైతులు కష్టపడుతున్నారని, కాని దాని ఫలితం ఇనాందారుకు లభిస్తోందని చెప్పడమే ఇక్కడ రచయిత ఉద్దేశ్యమై ఉంటుంది.

పల్లె ప్రజల కష్టాలను వివరించండి.

జ. పల్లెలలో ప్రజలు కష్టపడి పంటలు పండిస్తారు. ఒకప్పుడు వర్షాలు ఉండవు. చేలకు నీళ్ళను తోడాలి. ఒకప్పుడు తోడుకోవడానికి సైతం వారికి నీళ్ళు దొరకవు. ఒక్కొక్కసారి అతివృష్టి, ఒక్కొక్కసారి అనావృష్టి సంభవిస్తుంది. వారి మోటర్లకు రాత్రింబవళ్ళు విద్యుచ్ఛక్తి ఉండదు. పాడిపశువులకు మేత లభించదు. రాత్రివేళల్లో కూడా చేనుకు నీరు పెట్టడానికి వారు వెళ్ళాల్సివస్తుంది. చీడపీడలకు పురుగుమందులు చల్లాలి. ఒకప్పుడు వారికి అవి ప్రమాదాన్ని తీసుకువస్తాయి.

చక్కగా పండిన పంట, ఒక్కరోజు పురుగు పట్టి తినేస్తుంది. ఇనాందారులకు కౌలు చెల్లించాక రైతుకు ఫలసాయం మిగలదు. ఒక్కొక్కసారి కాలం కలసి వస్తే పంట మిగులుతుంది. కాని రైతుకు దానికి తగిన ధర లభించదు.

రైతు పండించిన పంటలను వర్తకులు చౌకగా కొంటారు. కాని రైతుకు కావలసిన ఎరువులు వగైరా ఎక్కువ ధరకు కాని దొరకవు. పల్లె ప్రజలకు విద్యావైద్య సదుపాయాలు ఉండవు. వారికి రోడ్డు, బస్సు సౌకర్యాలు ఉండవు. ప్రతి వస్తువు కోసం నగరాలకు వెళ్ళాలి. రోగం వస్తే వారు నగరాలకు బళ్ళపై రోగులను తీసుకువెళ్ళాలి. ఒకప్పుడు మోసుకువెళ్ళాల్సివస్తుంది.

ఈ విధంగా పల్లెల్లో ప్రజలు ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు.

పల్లెల ప్రగతికి మీరిచ్చే సలహాలు, సూచనలు ఏవి ?

పల్లెలు బాగుపడాలంటే రైతులకు కావలసిన ఎరువు, పురుగుమందులు, విత్తనాలు చౌకగా వారికి అందించాలి. గ్రామాల్లో వ్యవసాయంతో పాటు, పాడి పరిశ్రమ అభివృద్ధి కావాలి. రైతులకు ప్రభుత్వం విత్తనాలు మంచివి చౌకధరలకు ఇవ్వాలి. తక్కువ వడ్డీకి బ్యాంకులు వారికి ఋణాలు ఇవ్వాలి. రైతులు తోటల్లో పశుగ్రాసాన్ని పెంచుకోవాలి. వారు పాడి పశువులను పెంచి, పాల ఉత్పత్తులను మంచి ధరలకు అమ్ముకోవాలి. రైతుల ఉత్పత్తులకు మంచి ధరలు లభించాలి. రైతులు కూరగాయలను పెంచాలి, గ్రామాల్లో ప్రజలకు విద్యావైద్య సదుపాయాలు కల్పించాలి. ప్రతి గ్రామానికి మంచినీటి కుళాయిలు, రోడ్లు, విద్యుచ్ఛక్తి సదుపాయం ఉండాలి. ప్రతి గ్రామానికి నగరాలకు పోవడానికి బస్సులు ఉండాలి. పల్లె ప్రజలు సంఘాలుగా ఏర్పడి గ్రామాలలో చెరువులు బాగు చేసుకోవాలి. మురికి నీరు దిగే కాలువలు బాగు చేసుకోవాలి.

ప్రభుత్వ సహాయంతో గ్రామాలకు రోడ్లు వేసుకోవాలి. గ్రామీణ స్త్రీలు డ్వాక్రా సంఘాలలో చేరి, లఘు పరిశ్రమలను చేపట్టాలి. పల్లెలలోని ప్రజలు తమ పిల్లలను తప్పక చదివించాలి. పిల్లలందరికీ టీకాలు వేయించాలి.

పల్లెలకు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పల్లె ప్రజలు తీరిక సమయాల్లో చేతి వృత్తులు చేపట్టి దాని ద్వారా ధనం సంపాదించాలి రైతులు పండించే ఉత్పత్తులకు న్యాయమైన మంచి ధరలు లభించేలా అధికారులు చర్యలు చేపట్టాలి గ్రామాల్లోని పోరంబోకు పొలాల్లో రైతులు సమష్టిగా సహకార వ్యవసాయం చేపట్టాలి.

పల్లెటూళ్ళ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరాలను వివరించండి.

పల్లెటూళ్ళలో ప్రజలు ఒకరినొకరు ఆప్యాయంగా అక్కా బావా అంటూ పలకరించుకుంటారు. పల్లెలలో పండుగలు, ఉత్సవాలు, వేడుకగా జరుగుతాయి. సంక్రాంతి, దసరా వంటి పండుగలకు, గ్రామాలు చక్కగా ఆలంకరింపబడతాయి. ప్రతి ఇంటికి రంగుల పూలతోరణాలు కడతారు. వివిధ వాయిద్యాలు మ్రోగిస్తారు. గంగిరెద్దులు, గరగలు, విచిత్రవేషాలు తోలుబొమ్మలాటలు, హరికథలు వగైరా ఉంటాయి. ఈ కళలు మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుతున్నాయి. భోగిమంటలు, హరిదాసుల కీర్తనలు సంక్రాంతికి ఉంటాయి. వీటి వల్ల మన ప్రజలకు ప్రాచీన సంస్కృతీ వైభవం తెలుస్తుంది. గ్రామాలు పరిశుభ్రంగా ఉండి, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. భోగిమంటల వల్ల, ముగ్గుల వల్ల దోమలు వగైరా దూరం అవుతాయి. మనుష్యుల మధ్య సత్సంబంధాలు పెరుగుతాయి. ఒకరి కష్టసుఖాల్లో ఒకరు పాలుపంచుకుంటారు. పల్లెటూళ్ళు మన ప్రాచీన సంస్కృతీ వైభవాన్ని వెల్లడించే కేంద్రాలు. ఈ సంస్కృతి సంప్రదాయాలను మనం కాపాడుకుంటే మన భారతదేశ ప్రాచీన నాగరికతా వైభవం కాపాడబడుతుంది.

FAQ

జానపదుని జాబు పాఠం రచయిత ఎవరు?

జానపదుని జాబు పాఠం రచయిత బోయి భీమన్న.

బోయి భీమన్న ఎప్పుడు , ఎక్కడ జన్మించారు?

WhatsApp Channel New Join Now
WhatsApp Groups Join Now
Telegram Group Join Now
Twitter Follow Us
Google News Follow Us

బోయి భీమన్న 19 సెప్టెంబర్, 1911లో తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు గ్రామంలో జన్మించారు.

బోయి భీమన్నగారికి వచ్చిన అవార్డులు గురించ్గి రాయండి

డా|| బోయి భీమన్నగారు రచించిన “గుడిసెలు కాలిపోతున్నాయ్” రచనకు 1975లో సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. 1973లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్ ఇచ్చి భారత ప్రభుత్వం సత్కరించింది. విశేషాలు : క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. జర్నలిస్టుగా పనిచేశాడు. 1940-45 మధ్యకాలంలో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాడు.

For More Educational News Updates, Join us on Twitter | Follow us on Google News | Join Our WhatsApp Groups | Connect with our Telegram Channel