The Andhra Pradesh Open School Society (APOSS) has issued a notification regarding the SSC and Intermediate fee payment dates on its official website at www.apopenschool.org. According to the notification, the fee Payment Link for SSC & Intermediate (APOSS) public examinations will be active from December 01, 2025.
APOSS 10th & Inter FEE Payment Dates
APOSS SSC & Intermediate Public Examinations, March 2026 exam fee payment schedule:
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యా పీఠం, అమరావతి వారిచే నిర్వహించబడు పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు, మార్చి-2026 హాజరగుటకు గాను, పరీక్ష ఫీజా ది. 01.12.2025 నుండి 15.12.2025 వరకు, అభ్యాసకులు ఏదేని APONLINE సేవా కేంద్రము లేదా ONLINE PAYMENT GATEWAY ద్వారా గాని నేరుగా చెల్లించ వచ్చును.
పరీక్ష రుసుము చెల్లించుటకు గడువు తేదీల వివరములు
క్రమ సంఖ్య | అంశములు | ఎ.పి.టి. ఆన్ లైన్ ద్వారా పరీక్ష ఫీజు చెల్లించు తేదీలు | ఎ.ఐ సమన్వయ కర్తలు, డి.ఇ.ఓ కు యన్.ఆర్ లు సమర్పించు తేది | డి.ఇ.ఓ లు రాష్ట్ర కార్యాలయమునకు యన్.ఆర్ లు సమర్పించు తేది | |
| నుండి | వరకు | ||||
| 1 | అపరాధ రుసుము లేకుండా | 01.12.2025 | 10.12.2025 | 16.12.2025 | 17.12.2025 |
| 2 | ఒక సబ్జెక్టునకు రూ.25/-అపరాధ రుసుముతో | 11.12.2025 | 12.12.2025 | ||
| 3 | ఒక సబ్జెక్టునకు రూ.50/-అపరాధ రుసుముతో | 13.12.2025 | 15.12.2025 | ||
ఇంటర్మీడియట్ నకు రూ.1000/- మరియు యస్.యస్.సి నకు రు.500/- తో పాటు ఆయా సబ్జెక్టు లకు నిర్దేశిం చిన పరీక్షా ఫీజును చెల్లించవలెను.
పరీక్షా ఫీజు చెల్లించుటకు కాల నిర్ణయ పట్టికను సార్వత్రిక విద్యా పీఠం వారి వెబ్ సైట్: www.apopenschool.ap.gov.in .
APOSS Fee Details:
రుసుము వివరములు:
| వ.సం. | వివరములు | రిజిస్ట్రేషన్ ఫీజు | పరీక్ష ఫీజు | మొత్తము |
| అ | జనరల్ | |||
| 1 | పదవతరగతి -థియరీ ఒక సబ్జెక్టునకు | రూ.5/- | రూ.95/- | రూ.100/- |
| 2 | ఇంటర్మీడియట్-థియరీ ఒక సబ్జెక్టునకు | రూ.5/- | రూ.145/- | రూ.150/- |
| 3 | ఇంటర్మీడియట్-ప్రాక్టికల్ ఒక సబ్జెక్టునకు | రూ.5/- | రూ.95/- | రూ.100/- |
| ఆ | ఉత్తీర్ణులుకాని ఇంటర్మీడియట్ అభ్యాసకులు ఉత్తీర్ణత పొందిన సబ్జెక్టు ఒక్కింటికి బెటర్మెంట్ కొరకు – (ఈ సదుపాయము ఐదు సంవత్సరాల కాలములో ఒక్కసారి మాత్రమే అభ్యాసకులు వినియోగించుకొను అవకాశము కలదు) | |||
| 4 | ఇంటర్మీడియట్-థియరీ ఒక సబ్జెక్టునకు | రూ.5/- | రూ.245/- | రూ.250/- |
| 5 | ఇంటర్మీడియట్-ప్రాక్టికల్ ఒక సబ్జెక్టునకు | రూ.5/- | రూ.95/- | రూ.100/- |
| ఇ | ఇంప్రూవ్ మెంట్ ఇంతకుముందు అన్ని సబ్జెక్టుల నందు పాస్ అయిన అభ్యాసకులకు (ఈ సదుపాయము ఐదు సంవత్సరముల లోపల మాత్రమే అభ్యాసకులు వినియోగించుకొను అవకాశము కలదు) | |||
| 6 | పదవతరగతి -థియరీ ఒక సబ్జెక్టునకు | రూ.5/- | రూ.195/- | రూ.200/- |
| 7 | ఇంటర్మీడియట్-థియరీ ఒక సబ్జెక్టునకు | రూ.5/- | రూ.295/- | రూ.300/- |
| 8 | ఇంటర్మీడియట్-ప్రాక్టికల్ ఒక సబ్జెక్టునకు | రూ.5/- | రూ.95/- | రూ.100/- |
| 9 | ఇంటర్మీడియట్ – తత్కాల్ రుసుము (సబ్జెక్టు రుసుము నకు అదనముగా) | – | – | రూ.1000/- |
| 10 | పదవ తరగతి- తత్కాల్ రుసుము (సబ్జెక్టు రుసుము నకు అదనముగా) | – | – | రూ.500/- |
పరీక్షఫీజు కట్టుటకు అర్హతలు:
(అ) 2025-26 విద్యా సంవత్సరం నందు ప్రవేశము పొంది, 31.08.2025 నాటికి యస్. యస్. సి. అభ్యర్థులు 14 సం||, ఇంటర్మీడియట్అభ్యర్థులు 15 సం|| వయస్సు నిండినవారు మాత్రమే పరీక్ష ఫీజు చెల్లించుటకు అర్హులు.
(ఆ) ఇంతకు పూర్వం విద్యా సంవత్సరములలో ప్రవేశము పొంది పరీక్షకు హాజరై తప్పిన అభ్యర్ధులు.
(ఇ) ఇంతకు పూర్వం విద్యా సంవత్సరములలో ప్రవేశము పొంది ఇంతవరకును పరీక్షకు హాజరు కాని అభ్యర్థులు.
2. పరీక్ష రుసుమును ఎ.పి.టి. ఆన్ లైన్ ద్వారా చెల్లించవచ్చును. డి.డి/ చలానా రూపములో స్వీకరించబడదు. మరియు, APOSS website: www.apopenschool.ap.gov.in పొందు పరచబడిన, ‘పేమెంట్ గేట్ వే’ ద్వారా, కూడా పరీక్ష రుసుమును, నెట్ బ్యాంకింగ్, డెబిట్ /క్రెడిట్ కార్డులతో, సెలవు దినములతో సహా ఎల్లవేళలా (24/7), చెల్లించవచ్చును.
3. ఎ.పి. టి. ఆన్ లైన్ / పేమెంట్ గేట్ వే’ ద్వారా చెల్లించిన పరీక్ష రుసుము రసీదును భద్రపర్చుకొనవలెను. ఫీజు చెల్లించిన రసీదు నందు మీ సబ్జెక్టులను సరి చూసుకొనవలెను. సరియైన సబ్జెక్టులకు ఫీజు చెల్లించనిచో, మరొకసారి ఫీజు చెల్లించవలసివచ్చును. ఒకసారి చెల్లించిన పరీక్ష రుసుము వాపసు ఇవ్వబడదు.
4. దివ్యాంగులు పరీక్షఫీజు నుండి మినహాయించబడినారు. ఐనను వారు పరీక్షలకు హాజరకాగోరు సబ్జెక్టులను ఎంపిక చేసుకొని, ఎ.పి.టి.ఆన్ లైన్/ ‘పేమెంట్ గేట్ వే’, నందు రిజిస్ట్రేషన్ మరియు ఎ.పి.టి. ఆన్ లైన్ వారి సేవా రుసుము చెల్లించి, తగిన రసీదు పొందగలరు. రసీదు నందు ఎంపిక చేసుకొన్న సబ్జెక్ట్ వివరములు సరిచూసుకొనగలరు.
5. ఒక సబ్జెక్టునకు కట్టిన రుసుము మరొక సబ్జెక్టు నకు బదలాయించబడదు మరియు సంబంధం లేని సబ్జెక్టులకు ఫీజు చెల్లించి హాజరు అయినచో ముందస్తు నోటీసు లేకుండా అట్టి పరీక్షలు రద్దు చేయబడును.
6. ఫీజు చెల్లించిన సబ్జెక్టులకు మాత్రమే పరీక్షకు అనుమతించబడుదురు. పరీక్షారుసుము చెల్లించకుండా ఏదేని సబ్జెక్ట్/ సబ్జెక్టులకు హాజరైన అట్టి పరీక్షలను ముందస్తు నోటీసు లేకుండా రద్దు చేయబడును.
7. కనీస వయస్సు లేని వారు ఫీజు చెల్లించి పరీక్షకు హాజరైనచో వారి ప్రవేశము మరియు పరీక్షలు రద్దు చేయబడును.
8. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం వారి నియమావళికి భిన్నముగా అభ్యాసకుడు రెండు వేరు వేరు అధ్యయన కేంద్రములలో అనుచిత ప్రవేశము పొంది మరియు రెండు అధ్యయన కేంద్రములలో పరీక్ష రుసుము చెల్లించిన ఎడల, అట్లు అనుచితముగా రెండు వేరు వేరు అధ్యయన కేంద్రములలో పొందిన ప్రవేశములను ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా రద్దు చేయబడును. మరియు చెల్లించిన పరీక్ష రుసుము వాపసు ఇవ్వబడదు.
APOSS 10th, Inter Fee Payment Schedule Notification March 2026









