ప్రతి శిశువూ కొన్ని సహజ వారసత్వ లక్షణాలతో ఒక నిర్దిష్ట సాంఘిక ఆర్ధిక భావావేశ వాతావరణంలో జన్మిస్తాడు. ఆ పైన అధికారిక శక్తులూ సంస్థలూ అతన్ని తమకి అనుగుణంగా తయారు చేసుకుంటాయి. నేను నా తండ్రి నుంచి నిజాయితీనీ, ఆత్మ క్రమశిక్షణనీ అందిపుచ్చుకున్నాను. మా అమ్మ నుంచి మంచితనంలో నమ్మకాన్నీ, సానుభూతినీ అందుకున్నాను. నాతో పాటే నా ముగ్గురు సోదరులూ, నా సోదరీను. కానీ జలాలుద్దీన్, షంషుద్దీన్లతో నేను గడిపిన సమయమే నా బాల్యంలోని అద్వితీయతకూ, నా తదనంతర జీవితంలోని మార్పుకీ కారణమనాలి. జలాలుద్దీన్లో, షంషుద్దీన్లో కానవచ్చిన సహజాత ప్రజ్ఞ ఏ పాఠశాలల్లోనూ ఏ తర్ఫీదు వల్లా పొందలేని వివేకం. అది భాషకి అతీతంగా ప్రపంచం పట్ల స్పందించగల నేర్పు. అనంతర కాలంలో నా జీవితంలో ప్రకటితమైన సృజనాత్మకతకి నా బాల్యం వారి సాహచర్యంలో గడవడమే కారణమని నిస్సంకోచంగా చెప్పగలను.
- ఒక విజేత ఆత్మకథ
కవి పరిచయం
రచయిత పేరు : శీలా వీర్రాజు
జననం : 22-04-1939
మరణం : 01-06-1922
తల్లిదండ్రులు : వీరభద్రమ్మ, సూర్యనారాయణ దంపతులు
రచనలు :
* సమాధి, మబ్బుతెరలు, రంగుటద్దాలు, ఊరు వీడ్కోలు చెప్పింది, మనసులో కుంచె మొదలగు కథాసంపుటాలు.
* కొడిగట్టిన సూర్యుడు, కిటికీ కన్ను, ఎర్రడబ్బా రైలు, పడుగుపేకల మధ్య జీవితం మొదలైన కవితా సంపుటాలు.
* మైనా, కరుణించని దేవత, వెలుగురేఖలు మొదలైన నవలలను వ్రాశారు.
కలం పేరు : “శీలావీ”
పురస్కారాలు : 1969 లో “మైనా” నవలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.
“చేజారిన బాల్యం” అనే ఈ పాఠ్యాంశం శీలా వీర్రాజు రచించిన “కలానికి ఇటూ అటూ” అనే వ్యాస సంపుటి నుండి గ్రహింపబడింది.









