కీలక అంశాలు:
దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలు జులై 17వ తేదీ నుంచి హర్యానా రాష్ట్రంలోని జింద్ మరియు సోనిపత్ (Jind-Sonipat) నగరాల మధ్య నడవనుంది.
ఈ రైలు 89 కిలోమీటర్ల (వన్ వే) దూరాన్ని కేవలం రెండు గంటల్లో పూర్తి చేయనుంది. ఇది ప్రతిరోజూ రెండు రౌండ్ ట్రిప్పులు (Round trips) తిరుగుతుంది.
ఈ రైలు మార్గమధ్యంలో జింద్ సిటీ, పాండు పిండార, లలిత్ ఖేడా, భంభేవా, ఇషాపూర్ ఖేరీ, బుటానా, ఖండ్రాయ్, గోహనా, రభ్రా, లాత్, మోహనా హర్యానా, బర్వాస్ని తో సహా మొత్తం 12 స్టేషన్లలో ఆగుతుంది.
కాలుష్య రహిత, పర్యావరణహితమైన భవిష్యత్ ప్రయాణ సాధనాల రూపకల్పనలో భాగంగా భారతీయ రైల్వే ఈ సరికొత్త హైడ్రోజన్ రైలును అందుబాటులోకి తీసుకువస్తోంది.
Daily Current Affairs in Telugu (17 జూలై 2026) తెలుగులో కరెంట్ అఫైర్స్

