APPSC GROUP-1, GROUP-2, UPSC, SSC, RRB, IBPS,SBI వంటి అనేక పోటీ పరీక్షలలో కరెంట్ అఫైర్స్ అనేది తప్పనిసరి అంశం. గత 24 గంటలలోని కరెంట్ అఫైర్స్ బిట్స్ రూపంలో క్విజ్ గా మీకు అందిస్తున్నాం.
1.ఇటీవల భారత రాష్ట్రపతి శ్రమతి ద్రౌపది ముర్ము ఏ రాష్ట్ర పోలీసులకు అత్యున్నత పురస్కారమైన ‘ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్’ ను బహూకరించారు?
జ: సిక్కిం
2.దేశవ్యాప్తంగా డిజిటల్ పరిపాలనను మరింత బలోపేతం చేయడానికి మరియు ప్రభుత్వ ఆన్‌లైన్ సేవల నాణ్యతను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించిన పోర్టల్ పేరు?
జ: ‘నేషనల్ ఇ-గవర్నెన్స్ సర్వీస్ డెలివరీ అసెస్‌మెంట్’ (NeSDA) 2025
NeSDA పూర్తి రూపం ఏమిటి..?
జ: National e-Governance Service Delivery Assessment.
3.భారత వైమానిక దళానికి (IAF) చెందిన ప్రతిష్టాత్మక ‘సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్’ ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుంది
జ: 30 ఏళ్ళు
4.సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ ఎప్పుడు స్థాపించారు?
జ: 1996లో బీదర్ కేంద్రంగా ప్రారంభించారు.
5. భారతదేశం, దక్షిణ కొరియా మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఏర్పడిన ‘సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం’ (CEPA – Comprehensive Economic Partnership Agreement) అప్‌గ్రేడ్ కోసం 12వ విడత చర్చలు ఎక్కడ జరిగాయి?
జ: న్యూఢిల్లీ
4.శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (SRS) స్టాటిస్టికల్ రిపోర్ట్ 2024 ప్రకారం భారత దేశంలో సంతానోత్పత్తి రేటు (TFR – Total Fertility Rate) ఎంత ఉంది?
జ: 1.9 శాతం ( ఇది రీప్లేస్‌మెంట్ స్థాయి (సమతుల్యతను కాపాడే స్థాయి) కంటే కిందకు పడిపోయింది)
5. అత్యధిక TFR కలిగిన రాష్ట్రం
జ: బిహార్ (2.9)
6. అత్యల్ప TFR కలిగిన ప్రాంతం
జ: దిల్లీ (1.2)
7. వృద్ధుల జనాభా (60 ఏళ్లు పైబడిన వారు) అధికంగా ఉన్న రాష్ట్రం
జ: కేరళ (15.1%)




