తే.గీ. బుద్ధిమంతుండు సాధించు బుద్ధి చేత
బాహు బలుడు జయించు దోర్బలము చేత
యోగ్యుడైన నరేశుడు యుక్తి చేత
గార్యసిద్ధిని జెందును గౌరవేశ!
(విదుర నీతి ద్వితీయాశ్వాసం 26 పద్యం)
భావం : తెలివిగలవాడు తన బుద్ధిని ఉపయోగించి పనుల్లో విజయాన్ని సాధిస్తాడు. భుజబలంతో శరీర శక్తితో బలం ఉన్నవాడు పనుల్లో విజయాన్ని సాధిస్తాడు. సరైన రాజు యుక్తితో అంటే బుద్ధి బలాన్ని, శరీర బలాన్ని తగు విధంగా ఉపయోగించుకుంటూ పనులను సాధిస్తాడు.
pdf
AP 10th Telugu 9th Lesson రాజధర్మం Rajadharmam Guide
Click Here