ప్రవేశ పద్ధతి
1. పూర్తికాలిక (రెగ్యులర్) ప్రోగ్రాంలలో ప్రవేశం నిమిత్తం ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రవేశ పరీక్షలో 100 మార్కులకు బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు (Multiple choice) పరీక్ష ఉంటుంది. కానీ ప్రదర్శనా కళల ప్రొగ్రాంలలో (అంటే లలితకళాపీఠంలోని ప్రొగ్రాంలలో) ప్రవేశ పరీక్ష సిద్ధాంతానికి 50 మార్కులు, ప్రాయోగికానికి 50 మార్కులతో ఉంటుంది.
2. నిర్ణీత సీట్ల సంఖ్య కంటే తక్కువ దరఖాస్తులు వచ్చిన ప్రోగ్రాంలకు మౌఖిక ప్రవేశ పరీక్ష ఆధారంగా మార్కుల ప్రతిపాదిక ఆధారంగా ప్రవేశం కల్పించడం జరుగుతుంది.
3. సాయంకాలం ప్రొగ్రాంలన్నింటికీ మౌఖిక పరీక్ష మార్కుల ఆధారంగా ప్రవేశం కల్పించడం జరుగుతుంది.
4. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు జరుగుతాయి. యు.జి, పి.జీ ప్రోగ్రాంలలో ప్రవేశానికి కనీసం 36 శాతం (ఎస్.సి./ఎస్.టి./వికలాంగ అభ్యర్థులకు 15 శాతం ) మార్కులు పొందిన అభ్యర్థులు అర్హులు. ప్రదర్శన కళల ప్రోగ్రాంలలో సిద్ధాంతం, ప్రాయోగికం పరీక్షల్లో విడివిడిగా కనీస నిర్ణీత అర్హత మార్కులు 18+18 (ఎస్.సి./ఎస్.టి. /వికలాంగ అభ్యర్థులకు 7.5+7.5) పొందిన వారే ప్రవేశానికి అర్హులవుతారు.
5. ప్రతి ప్రోగ్రాంలో పదిహేను మంది కంటే తక్కువమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొన్నట్లయితే ఆ ప్రోగ్రాం. నిర్వహించడం వీలుపడదు. దరఖాస్తు రుసుము వాపసు ఇవ్వబడదు.
ప్రవేశ పరీక్షా కేంద్రాలు
సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం లోని ప్రోగ్రాం లకు ప్రవేశ పరీక్షలను హైదరాబాద్,
వరంగల్ ప్రాంగణాలలో నిర్వహించడం జరుగుతుంది.