AP SCERT has released TOEFL – CBA 3- SLAS 2024 Conducting guidelines GO.
TOEFL
- TOEFL READINESS టెస్ట్ రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసి DCEB లకు అందచేసిన జాబితాలోని పాఠశాలల్లో 3, 4, 5 తరగతులకు ఏప్రిల్ 10వ తేదిన మరియు 6, 7, 8, 9 తరగతులకు ఏప్రిల్ 12 తేదిన నిర్వహించబడును.
- జిల్లాల వారీగా పాఠశాలల వివరాలు, రోల్ వివరాలు ఇవ్వబడినవి.
- DCEB లు పాఠశాలలో విద్యార్దుల వాస్తవ సంఖ్య ఆధారంగా ప్రశ్న పత్రాలు ఆయా పాఠశాలకు అందించవలెను.
- 3, 4, 5 తరగతులకు ఒక ప్రశ్న పత్రము , 6, 7, 8, 9 తరగతులకు మరొక ప్రశ్న పత్రము ఇవ్వబడును.
- రీడింగ్, లిసనింగ్ విభాగాలలో ప్రశ్నలు ఉండును.
- ప్రీ ప్రింటెడ్ OMR పై విద్యార్ధులు తమ సమాధానాలను బబుల్ చేయవలెను (CBA లలో మాదిరిగానే )
- లిసనింగ్ కి ఆడియో క్లిప్స్ IFP / SMART TV / టీచర్ ట్యాబ్స్ లలో రాష్ట్ర స్తాయి నుంచి IT సెల్ వారిచే పరీక్ష రోజు పంపబడును.
- ఆయా పాఠశాలల్లో IFP / SMART TV / టీచర్ ట్యాబ్స్ కు ఏమైనా రిపేర్ ఉంటె ముందుగానే రిపేర్ చేయించుకొనవలెను.
- DCEB లు DNO (IT) లు సమన్వయము తో వ్యవహరించవలెను.
- పరీక్ష నిర్వహణకు TOEFL మాన్యువల్ లో సూచించిన రూమ్స్ అలోట్ మెంట్ సీటింగ్ అరేంజ్ మెంట్ విధానం పాటించాలి.
- TOEFL మాన్యువల్ ప్రతి టీచర్ చదివేలా సాఫ్ట్ కాపీ షేర్ చేయవలెను. సంబందిత నిబంధనలు తప్పనిసరిగా పాటించవలెను.
- ప్రశ్న పత్రాలు విద్యార్ధులకు తిరిగి ఇవ్వరాదు. USED/ UNUSED ప్రశ్న పత్రాలు తిరిగి పాఠశాలల నుంచి DCEB కి తెప్పించవలెను. తదుపరి సూచనల వరకు వాటిని సీల్ వేసి భద్రపరచవలెను.
- OMR లు CBA తరహాలో ప్రత్యేకంగా ప్యాక్ చేసి DCEB కి తెప్పించి తదనంతరం స్కానర్ కి అందించవలెను.
- OMR లో కుడి చేతి వైపు ఉన్న FORM CODE /SCHOOL USE ఓన్లీ అని ఉన్న బాక్స్ లో ఫిల్ చేయనవసరం లేదు.
- ప్రీ ప్రింటెడ్ OMR రాని లేదా OMR పాడైన విద్యార్ధులకు బఫర్ OMR లలో NAME, UDISE CODE / STUDENT ID/ CLASS తదితర వివరాలు ఫిల్ చేయవలెను.
- టీచర్ ATTENDANCE APP లో OMR స్కానింగ్ ఆప్షన్ ENABLE చేయబడుతుంది. దాని ద్వారా ONLINE ATTENDANCE కోసం OMR స్కాన్ చేయవలెను.
CBA-3
1. CBA 3 పరీక్షలు ఏప్రిల్ 6 వ తేదీ నుంచి జరుగును.
2. గతం లో మాదిరిగానే OMR పద్దతి లో పరీక్షలు నిర్వహించబడును.
3. కాకినాడ జిల్లాకు మాత్రం OCR పద్దతిలో CBA 3 మాత్రమె నిర్వహించబడును.
4. కాకినాడ జిల్లాకు మాత్రం OCR లో బబుల్ కి బదులుగా రైట్ టిక్ మార్క్ చేయవలెను. దీనికి సంబంధించిన వీడియో విడుదల చేయబడును.
5. కాకినాడ జిల్లాకు మాత్రం ప్రత్యేకంగా టీచర్లకు అన్ని CBA పరీక్షల అనంతరం OMR సమాధానాల స్కానింగ్ కొరకు ఒక APP లింక్ షేర్ చేయబడును.
6. OCR స్కానింగ్ APP తమ మొబైల్స్ లో ఇన్స్టాల్ చేసుకుని సమాధానాలు నమోదు చేసిన OMR ను టీచర్లు స్కాన్ చేయవలసి ఉంటుంది. అందుకు సంబంధించిన వీడియో విడుదల చేయబడుతుంది.
7. టీచర్లు స్కాన్ చేసిన అనతరం అయా OCR లను సీల్ వేసి పాఠశాలలో HM కంట్రోల్ లో భద్రపరచవలెను. తదుపరి తగిన సూచనలు జారీ చేయబడతాయి.
8. కాకినాడ మినహా మిగిలిన జిల్లాలలో గతం లో మాదిరి గానే OMR లు DCEB లు వెనక్కి తెప్పించుకోవాలి. DCEB APPROVED స్కానర్ తో స్కాన్ చేయించుకోవాలి.
SLAS – 2024
1. SLAS – 2024 పరీక్ష 4వ తరగతి విద్యార్ధులకు April 16th న జరుగుతుంది.
2. తెలుగు, ఇంగ్లీష్, గణితం సబ్జెక్టులపై విద్యార్థులకు SLAS నిర్వహిస్తారు. ప్రతి విద్యార్థి ఏదైనా రెండు సబ్జెక్టులను
కలిపి రాస్తారు.
3. OMR పద్ధతి లో SLAS నిర్వహించబడును.
4. ఇంగ్లీష్ మరియు తెలుగు సబ్జెక్టులలో, ఇన్విజిలేటర్ విద్యార్థులకు చదవి వినిపించాల్సిన కథ/ గద్యం/పద్యం/గేయం/ పోస్టర్లు 2 ఉంటాయి.
5. రెండు సబ్జెక్టులు ఒకదాని తర్వాత ఒకటి నిర్వహించబడతాయి. మొదటి పేపర్ ఉదయం 9:00 నుండి 10:30
వరకు మరియు రెండవ పేపర్ ఉదయం 10:45 నుండి మధ్యాహ్నం 12:15 వరకు ఉంటుంది.
6. పరీక్ష తర్వాత, విద్యార్థులు విద్యార్థి అభిప్రాయ సేకరణ కు రూపొందించిన ప్రశ్నాపత్రాన్ని పూరించాలి. ఇన్విజిలేటర్ప్ర తి ప్రశ్నను చదవాలి మరియు విద్యార్థులు తమ జవాబుని OMRలో గుర్తించాలి. దీన్ని పూరించడానికి వారికి 15 నిమిషాలు (12:15 PM – 12:30 PM) ఇవ్వబడుతుంది.
7. పాఠశాల ప్రశ్నా పత్రం మరియు ఉపాధ్యాయుల ప్రశ్నాపత్రం కూడా పాఠశాలకి Google Form రూపంలో పంపబడతాయి. పరీక్ష ముగిసేలోపు పాఠశాలలో 4వ తరగతి బోధించే ఉపాధ్యాయులు, ఉపాధ్యాయుల ప్రశ్నాపత్రాన్ని (Teachers questioner) మరియు HMలు పాఠశాల ప్రశ్నాపత్రాన్ని (School questioner) పూరించాలి.
8. ప్రతి పాఠశాలలో, SLAS కు హాజరయ్యే విద్యార్థుల గరిష్ట సంఖ్య 40. అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నట్లయితే, మీరు 40కి చేరుకునే వరకు ప్రతి 3వ విద్యార్థిని ఎంపిక చేయాలి.