Telangana SA2 6th Class Telugu Important Questions is given in this Article.
TS SA2 6th Class Telugu Exam 2023: Overview
Name of the Exam | Summative Assessment-2 |
Exam Conducted by | State Council of Educational Research and Training, Telangana (TS SCERT) |
Academic Year | 2023-23 |
State | State |
Exam Dates | 12th April 2023 |
Category | Question Papers |
Class | 6th Class |
Subject | Telugu |
Download Format | |
Official Website | scert.telangana.gov.in |
6th Class Lesson అభినందన
కవి పరిచయం
- కాలం: 1947
- కవి పేరు : శేషం లక్ష్మీనారాయణాచార్య 1998
- సొంత ఊరు : కరీంనగర్ జిల్లాలోని నగునూర్.
- తల్లిదండ్రులు : కనకమ్మ, నరహరిస్వామి.
- ఉద్యోగం : రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేశాడు. శేషం లక్ష్మీనారాయణాచార్య
- రచనలు : అనేక పద్య, వచన, గేయ కవితలను రచించాడు.
- ఇతర విషయాలు : ఈయన రచనలు వివిధ పత్రికల్లో ప్రచురింపబడ్డాయి. టీ.వీ., రేడియోల్లో కూడా ప్రసారమయ్యాయి. ఈయన రాసిన విమర్శనా వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచారసభ వారి ‘స్రవంతి’ ! పత్రికలో ప్రచురించబడ్డాయి.
- కవితా నైపుణ్యం : లలితమనోహరమైన దైవభక్తి, దేశభక్తి గేయాలను రాయడంలో ఈయనది అందెవేసిన చేయి.
“దేశపురోగతి” అంటే ఏమిటి? దేశపురోగతికి తోడ్పడిన వారిలో మీకు తెలిసినవారి పేర్లు రాయండి.
జ. “దేశపురోగతి” అంటే దేశాభివృద్ధి. దేశం వివిధ రంగాలలో అభివృద్ధి చెందటాన్నే దేశపురోగతి అంటారు. దేశంలోని ప్రజలు ‘కూడు-గూడు-గుడ్డ’ అనే మూడింటికి లోటు లేకుండా జీవించగలిగితే ఆ దేశం పురోగతి చెందినట్లే లెక్క జవహర్‌లాల్ నెహ్రూ, లాల్ బహుదూర్ శాస్త్రి, వల్లభబాయి పటేల్, అంబేద్కర్, జాకీర్ హుస్సేన్ వంటి నాయకులెందరో దేశపురోగతికి తోడ్పడినవారే.
దేశానికి నీతికర్మశీలుర ఆవశ్యకత ఏమిటి?
నీతికర్మశీలురు ఏ ప్రలోభాలకు లొంగరు. వారు తమ విధిని తాము సక్రమంగా నిర్వర్తిస్తారు. వారిలో స్వార్థ చింతన ఉండదు. తప్పుడు పనులు చేయడానికి ఇష్టపడరు. సత్ప్రవర్తనతో, సత్యసంధతతో ధర్మమార్గాన పయనిస్తారు. వారి వల్ల దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి దేశానికి నీతికర్మశీలుర ఆవశ్యకత ఎంతో ఉంది. –
అవిశ్రాంత సేద్యంతో ఆకలిమంటలను ఆర్పడమంటే ఏమిటి?
పంటలు పండితేనే ప్రజలకు ఆహారం లభిస్తుంది. ప్రాణికోటి ఆహారం పైన ఆధారపడి ఉంటుంది. అటువంటి పంటలను పండించే రైతు దేశానికి వెన్నెముక, పంటలు పండకపోతే దేశంలో కరవు ఏర్పడుతుంది. ప్రజలు ఆకలితో అల్లాడిపోతారు. అందువల్ల రైతు విరామం లేకుండా పంటలను పండిస్తూ, ఇతరుల ఆకలిమంటలను చల్లారుస్తాడని పై వాక్యానికి అర్థం.
ఈ గేయ రచయిత గురించి సొంతమాటల్లో రాయండి.
జ ‘అభినందన’ గేయ రచయిత శేషం లక్ష్మీనారాయణాచార్య. ఈయనకు దేశభక్తి ఎక్కువ. అందుకే దేశం కోసం శ్రమపడే ముఖ్యమైన ఇద్దరు వ్యక్తులను దృష్టిలో పెట్టుకొని ఈ గేయం రచించాడు. ఆ ఇద్దరు వ్యక్తులలో ఒకరు రైతు. మరొకరు సైనికుడు. వారిద్దరూ లేకపోతే దేశ ప్రజలకు తిండి, దేశానికి రక్షణ ఉండదన్నాడు. వారిని అభినందిస్తూ సరళమైన మాటలతో చక్కని గేయం అందించాడు రచయిత.
‘అభినందన’ గేయ సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి.
జ. రైతులకు, సైనికులకు వందనాలు. మెచ్చుకోవడం అనే చల్లని చందనాలను వాళ్లకు సమర్పిస్తున్నాం. కష్టాన్ని దాచుకోని రైతులకు, ఎవరికీ తలవంచని సైనికులకు దేశాభివృద్ధికి మూలాలైన ఈ గొప్పవారికి వందనాలు. అభినందనలు. నేలతల్లి సంతోషపడేటట్టుగా, నెత్తురు చెమటగా మారుతుండగా, బంగారాన్ని పండిస్తూ, అభివృద్ధికి బాటలు చూపే రైతులకు వందనాలు. కంటికి రెప్ప వలె, చేను చుట్టూ కంచె వలె, ఈ జన్మభూమికి కవచం వలె ఉండి కాపాడుతున్న గొప్ప వీరులైన జవాసులకు వందనాలు. దురాశ అనే మాయకు లోబడకుండా మంచి మనసు గలవారై నిమిషం కూడా తమ విధిని మరువకుండా నీతితో ప్రవర్తించే జవానులకు వందనాలు. విరామం లేకుండా పంటలను పండిస్తూ, ఇతరుల ఆకలి మంటలను చల్లారుస్తూ కష్టించి పనిచేసే రైతులకు వందనాలు. దేశభక్తినే ఖడ్గంగా ధరించి, శత్రుసైన్యాలను చంపి, దేశ కీర్తి పతాకాన్ని ఆకాశం నిండా ఎగరేసిన గొప్ప వీరులగు జవానులకు అభినందనలు.
“వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే” అని రైతులు, సైనికుల గురించి గేయం పాడుకున్నారు కదా! అట్లాగే తల్లి, తండ్రి, గురువు, మంచి మిత్రులు, గొప్పవాళ్ళు… ఇట్లా ఎవరి గురించైనా వందనాలు వందనాలు… అని అభినందనలు తెలుపుతూ ఒక చిన్న గేయాన్ని రాయండి.
‘అమ్మకు వందనాలు వందనాలు వందనాలు వందనాలు వందనాలు అభినందన చందనాలు అభినందన చందనాలు కష్టపడి నవమాసాలు మోసి ఆటపాటల అలరింపజేసి నేర్పుగ విద్యాబుద్ధులు నేర్పించే కనిపెంచిన మాతృమూర్తికి కల్పవృక్షం లాంటి కన్నతల్లికీ కలకాలం కంటికి రెప్పలా వందనాలు వందనాలు కాపాడే కన్నతల్లికి అభినందన చందనాలు.
గేయ రచయితకు దేశభక్తి కలదని ఎలా చెప్పగలవు?
జ. మన భారతదేశాన్ని రక్షించేవారు సైనికులు. దేశాన్ని రక్షించే సైనికులకు వందనాలు చెప్పడం ద్వారా కవి తన దేశభక్తిని చాటుకొన్నాడు. దేశ ప్రజలకు తిండి పెట్టేది ‘రైతు. రైతుకు నమస్కారాలు చెప్పడం ద్వారా కవి తన దేశభక్తిని చాటుకొన్నాడు. భారతదేశ పురోగతికి కారకులైన వారందరికీ కవి నమస్కారాలు తెలిపాడు. ఒక్క నిముషం కూడా విశ్రాంతి తీసుకోకుండా కష్టపడే వారి వల్ల దేశానికి మంచి పేరు వస్తుంది. అందుకే వారికి నమస్కరించి కవి తన దేశభక్తిని వెల్లడించాడు.
ింది పేరా చదువండి. ఇచ్చిన నానిలో సరియైన సమాధానం గుర్తించండి.
రైతు దేశానికి వెన్నెముక వంటివాడు. వ్యవసాయం ఒకప్పుడు స్వయం ఆధారితంగా ఉండేది. ఇంట్లో ఉన్న గొడ్డూ, గోదా రైతుకు కావలసిన ఎరువును అందించేవి. సేంద్రియ ఎరువులతో పంటలు పండేవి. ఆహారధాన్యాలు ఆరోగ్యాన్ని ఇచ్చేవి. రసాయనిక ఎరువులు రాగానే పరిస్థితులు మారిపోయాయి. వాటిలోని విషపదార్థాలు, ఆహారధాన్యాలు, ఆకుకూరలు మొదలైన వాటిలోకి ఇంకి మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. రసాయనిక ఎరువులు వాడడం వల్ల భూసారం క్షీణించిపోతుంది.
1. దేశానికి వెన్నెముక వంటివాడెవరు
? అ) జవాను ఆ) రైతు ఇ) నీతిమంతులు ఈ) పై ముగ్గురూ
2. భూసారం ఎందుకు క్షీణిస్తోంది ?
అ) రసాయనిక ఎరువుల వాడకం వల్ల ఇ) పరిస్థితులు మారడం వల్ల • ఈ) సేంద్రియ ఎరువుల వల్ల
3. పొలానికి ఏ ఎరువు మంచిది ?
అ) రసాయనిక ఎరువు ఆ) యూరియ ఈ) సేంద్రియ ఎరువు
4. విషపదార్థాలు దేనిలో ఉంటాయి ?
అ) సేంద్రియ ఎరువులలో ఆ) పచ్చిరొట్టలో ఇ) రసాయనిక ఎరువులలో ఈ) పెంటలో
5. సేంద్రియ ఎరువులు దేని నుండి లభిస్తాయి ?
అ) పశువుల నుండి ఆ) చెట్ల నుండి ఇ) మందుల నుండి ఈ) నీటి నుండి ఆ) నీరులేక
ప్రగతి మార్గదర్శకులెవరు?
జ. నీతి నిజాయితీలతో పనిచేసేవారు. ఒక్క నిముషం కూడా విశ్రాంతి లేకుండా కష్టపడేవారు. దేశం కోసం ప్రాణాలర్పించేవారు. దేశం కోసం జీవించేవారు. దేశం యొక్క పేరు ప్రతిష్ఠలను పెంచేవారు. దేశం కోసం నిరంతరం కష్టపడేవారు మనదేశ ప్రగతికి మార్గదర్శకులు.
అవిశ్రాంత సేద్యంతో ఆకలి మంటలను ఆర్పే దెవరు ? ఎలా?
జ. రైతు పొలం దున్నుతాడు. విత్తనాలు నాటుతాడు. నాట్లు వేస్తాడు. కలుపు మొక్కలను తీస్తాడు. ఎరువులు చల్లుతాడు. కంటికి రెప్పలా చేను కాపలా కాస్తాడు. పండిన చేను కోస్తాడు. కుప్ప వేస్తాడు. కుప్ప నూర్చుతాడు. ధాన్యం బస్తాలలోకి ఎత్తుతాడు. అవి బియ్యంగా మరపట్టించుకొంటారు. ఆ అన్నం తిని ఆకలిమంటలను చల్లార్చుకొంటారు. అంటే పొలం దున్నడం నుండి అన్నం కంచంలోకి వచ్చే వరకు రైతుకు విశ్రాంతి లేదు.
2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) అభినందన ఎవరికి? ఎందుకు?
జ. కవి రైతులకు, జవాన్లకు, నీతికర్మశీలురకు అభినందన చందనాలందించాడు. రైతులు నిరంతరం కష్టపడతారు. ఎండ, వాసలను లెక్కచేయకుండా వ్యవసాయం చేస్తారు. పంటలు పండిస్తాడు. దేశ ప్రజల ఆకలి తీరుస్తారు. అందుకే రైతులకు కవి అభినందనలందించాడు. జవాన్లు భారతదేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. తీవ్రవాదులు, శత్రుదేశాల నుండి భారతదేశాన్ని రక్షిస్తున్నారు. దేశ సరిహద్దులను జాగ్రత్తగా కాపాడుతున్నారు. ప్రాణాలను కూడా లెక్కచేయకుండా పోరాడుతున్నారు. అందుకే కవి జవాన్లలకు అభినందన చందనాలు సమర్పించాడు. నీతికర్మశీలురు నిముషం కూడా వృథా చేయరు. ఎటువంటి ప్రలోభాలకు లొంగరు. ఎవరి మాయలోనూ | – పడరు. అటువంటి నీతి నిజాయితీలు కలవారి వలన దేశ సంపద పెరుగుతుంది. దేశ గౌరవం పెరుగుతుంది. అందుకే వారికి కవి అభినందన చందనాలను అర్పించాడు.
ఆ) భరతమాత పురోగతికి ప్రాతిపదికలగు ఘనులెవరు? ఎందుకు ?
భారతదేశం అభివృద్ధి చెందాలంటే వీరజవాన్లు కావాలి. రైతులు కావాలి. నీతి నిజాయితీలతో పనిచేసేవారు | కావాలి. దేశ సంపద పెంచే ఆర్థికశాస్త్రవేత్తలు కావాలి. నూతనమైనవి కనిపెట్టే మేధావులు కావాలి. అటువంటి | వారంతా మన భారతదేశ పురోగతికి మూలకారకులు. దేశ ప్రజలందరినీ సడిపించే నాయకులు కూడా పురోగతికి కారకులు. పైన పేర్కొన్న వారిలో ఎవరు లేకపోయినా దేశం అభివృద్ధి చెందదు. అందుకే పైన చెప్పిన వారందరినీ | కవి దేశాభివృద్ధికి మూలకారకులుగా పేర్కొన్నాడు. జవాన్లు రక్షణ కల్పిస్తున్నారు. రైతులు తిండి పెడుతున్నారు. ఇదే విధంగా తమ పనిని తాము కచ్చితంగా చేసే వారంతా దేశ అభివృద్ధికి మూలమైన ఘనులే.