TSPSC Group-3 Syllabus 2023: ఇక్కడ మీరు గ్రూప్ 3 సిలబస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందుగా విశ్లేషణ చూడండి .
TSPSC Group 3 Syllabus 2023 (Download) TSPSC Group III Services Exam Pattern
పేపర్ | సబ్జెక్టు | ప్ర(మల్టిపుల్ ఛాయిస్)శ్నలు | కాల వ్యవధి (గంటలు) | గరిష్ట మార్కులు |
పార్ట్-ఎ వ్రాత పరీక్ష (అబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు) | ||||
పేపర్-1 | జనరల్ స్టడీస్ : సాదారణ సామర్ధ్యాలు | 150 | 2½ | 150 |
పేపర్- II | చరిత్ర, రాజకీయ వ్యవస్థ, సమాజం 1) తెలంగాణ సామాజిక – సాంస్కృతిక చరిత్ర, 2) భారత రాజ్యాంగం, రాజకీయాలపై అవగాహన | 150 | 2½ | 150 |
పేపర్- III | ఆర్ధిక వ్యవస్థ – అభివృద్ధి 1) భారత ఆర్థిక వ్యవస్థ : అంశాలు, సవాళ్ళు ii) తెలంగాణ ఆర్థిక వ్యవస్థ – అభివృద్ధి III) అభివృద్ధి, మార్పులు తదితర అంశాలు | 150 | 2½ | 150 |
మొత్తం మార్కులు: | 450 |
పేపర్ – || – చరిత్ర, రాజకీయ వ్యవస్థ, సమాజం
1. తెలంగాణ సామాజిక – సాంస్కృతిక చరిత్ర, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం :
1. శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణు కుండినులు, ముదిగొండ-వేములవాడ చాళుక్యులు సాంస్కృతిక ఔన్నత్యానికి తోడ్పాటు, సామాజిక వ్యవస్థ మత పరిస్థితులు ; ప్రాచీన తెలంగాణ లో బౌద్ధ వాదం, జైన వాదం, భాషా సాహిత్యాలు, వృద్ధి, కళలు, వాస్తు శాస్త్రంలలో వృద్ధి.
2. కాకతీయ రాజ్యస్థాపన – సామాజిక సాంస్కృతిక అభివృద్ధికి వారి తోడ్పాటు; కాకతీయుల పాలనలో తెలుగు భాష సాహిత్యాల వృద్ధి, కళలు, వాస్తుశాస్త్రం, కళలు వృద్ధి : తెలుగు భాషా సాహిత్యాల వృద్ధి, కాకతీయులకు వ్యతిరేకంగా ప్రజానిరసన , సమ్మక్క – సారక్క తిరుగుబాటు, కుతుబ్ షాహీల సామాజిక, సాంస్కృతిక తోడ్పాటు – బాషా సాహిత్యాలు, కళలు, వాస్తు విజ్ఞానం, పండుగలు, నృత్య సంగీతాల వృద్ధి : సమ్మిళిత సంస్కృతి ఆవిర్భావం.
3. అసఫ్ జాహీ వంశ పాలన : నిజాం – బ్రిటీష్ వారి మధ్య సంబందాలు , సాలార్ జంగ్ సంస్కరణలు – వాటి ప్రభావం, నిజాం ప్రభువుల పాలనలో సాంఘిక – సాంస్కృతిక, మతపరమైన పరిస్థితులు సంస్కరణలు, ఉస్మానియా విశ్వా విద్యాలయం స్థాపన – ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల వృద్ధి, మధ్య తరగతి వర్గాల అవతరణ..
4. తెలంగాణ లో సాంఘిక-సాంస్కృతిక, రాజకీయ చైతన్యం : ఆర్య సమాజం ఆంధ్ర మహాసభ, ఆంధ్ర సారస్వత పరిషత్తు, భాషా సాహిత్య, గ్రంథాలయ ఉద్యమాలు, ఆది హిందూ ఉద్యమం, ఆంధ్ర మహిళా సభ, మహిళా ఉద్యమాల వృద్ధి – గిరిజన తిరుగుబాట్లు, రాంజీగోండు, కొమరం బీం – తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ; కారణాలు, పర్యవసానాలు.
5. ఇండియన్ యూనియన్ లోకి హైదరాబాద్ రాష్ట్రం విలీనం – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ, పెద్ద మనుషుల ఒప్పందం – ముల్కీ ఉద్యమం 1952-56, తెలంగాణ సంరక్షణల ఉల్లంఘన – ప్రాంతీయ అసమానతలు తెలంగాణ అస్తిత్వ చైతన్యం : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఆందోళన 1969-70 – వివక్షలకు వ్యతిరేకంగా ప్రజా నిరసనల వృద్ధి , తెలంగాణ ణ రాష్ట్ర ఏర్పాటు దిశగా ఉద్యమాలు 1971-2014.
||. భారత రాజ్యాంగం – రాజకీయాలపై అవగాహన :
–
1. భారత రాజ్యాంగ పరిణామక్రమం – స్వబావం, ముఖ్య లక్షణాలు – ప్రవేశిక
2. ప్రాధమిక హక్కులు – ఆదేశిక సూత్రాలు – ప్రాధమిక విధులు.
3. భారత సమాక్య వ్యవస్థ విశిష్ట లక్షణాలు – కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య శాసన సంబంధ, పరిపాలన సంబంధ అధికారాల విభజన.
4. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు – రాష్ట్రపతి ప్రధాన మంత్రి, మంత్రి మండలి, గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రిమండలి – – అధికారాలు, విధులు.
5. గ్రామీణ, పట్టాన ప్రాంతాల పాలన, ప్రత్యేకించి 73, 74 రాజ్యాంగ సవరణల్లో ప్రస్తావించిన అంశాలు.
6. ఎన్నికల వ్యవస్థ : స్వేచ్చాయుత, నిష్పాక్ష ఎన్నికలు; ఎన్నికల అక్రమాలు, రాజకీయ పార్టీలు.
7. భారతదేశంలో న్యాయవ్యవస్థ – క్రియాశీల న్యాయవ్యవస్థ.
8. ఎ) షెడ్యుల్డు కులాలు, షెడ్యుల్డు తెగలు, బలహీన వర్గాలు, మహిళలు, అల్ప సంఖ్యాక వర్గాల సంరక్షణకు ప్రత్యేక నిబందనలు.
బి) జాతీయ పెడ్యుల్డు కులాల కమిషన్, జాతీయ పెడ్యుల్డు తెగల కమిషన్, జాతీయ బలహీన వర్గాల కమిషన్ ఆధ్వర్యంలో సంక్షేమ పరిరక్షణ యంత్రాంగాలు – అమలు అంశాలు.
9. భారత రాజ్యాంగం : నూతన సవాళ్ళు,
III. సామాజిక నిర్మితి, వివిధ అంశాలు, ప్రభుత్వ విదానాలు :
1. భారతీయ సామాజిక నిర్మాణం – భారత సమాజ ముఖ్య లక్షణాలు, కులం, కుటుంబం, వివాహం రక్త సంబంధం, మతం, తెగలు, మహిళలు, మధ్య తరగతి – తెలంగాణ సమాజపు సామాజిక – సాంస్కృతిక లక్షణాలు.
2. సామాజిక అంశాలు : అసమానతలు, మనహాయింపు ధోరణులు, కులవాదం, మత, కుల, వర్గావాదం, ప్రాంతీయవాదం, మహిళలపై హింస, బాలకార్మికత, మానవుల అక్రమరవాణ, వికలాంగులు, వయోవృద్ధులు.
3. సామాజిక ఉద్యమాలు : రైతాంగ ఉద్యమాలు, తెగల ఉద్యమాలు, బలహీన వర్గాల ఉద్యమాలు, దళిత ఉద్యమాలు, పర్యావరణ ఉద్యమాలు, మహిళా ఉద్యమాలు, ప్రాతీయ స్వయం ప్రతిపత్తి ఉద్యమాలు, పానవహక్కుల ఉద్యమాలు.
4. తెలంగాణ కు సంబందించిన ప్రత్యేక సామాజిక అంశాలు : పెట్టి, జోగిని, దేవదాసీ వ్యవస్థ, బాల కార్మికత, బాలిక శిశువుల ఫ్లోరోసిస్. వలస, రైతాంగ సంక్షోభం, చేనేత కార్మికుల సంక్షోభం.
5. సాంఘిక విధానాలు – సంక్షేమ కార్యక్రమాలు : షెడ్యుల్డు కులాలు, షెడ్యుల్డు తెగలు, ఇతర బలహీన వర్గాలు, అల్ప సంఖ్యాక వర్గాలు. మహిళలు, కార్మికులు, వికలాంగులు, బాలలు తదితర వర్గాలకు నిశ్చయాత్మక విధానాలు; ఉద్యోగాలు, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, గ్రామీణ-పట్టణ అభివృద్ధి కార్యక్రమాలు, స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ అదితర సంక్షేమ కార్యక్రమాలు.
పేపర్- III -ఆర్థిక వ్యవస్థ – అభివృద్ధి
1. భారత ఆర్థిక వ్యవస్థ : వివిధ అంశాలు, సవాళ్ళు
1. వృద్ధి – అభివృద్ధి – వృద్ధి – అభివృద్ధి భావనలు – వృద్ధి అభివృద్ధి మధ్య సంబంధం.
2. ఆర్థిక వృద్ధి చర్యలు : జాతీయ ఆదాయం – నిర్వచనం, జాతీయ ఆదాయం, భావనలు గణించే పద్ధతులు నామ మాత్రపు ఆదాయం, వాస్తవ ఆదాయం.
3. పేదరికం – నిరుద్యోగం • పేదరికం భావనలు ఆదాయం ఆధారంగా పేదరికం, ఆదాయేతర ఆధారాల పేదరికం, పేదరికం గణన, నిరుద్యోగం – నిర్వచనం నిరుద్యోగం రకాలు.
4. భారత ఆర్ధిక వ్యవస్థ లో ప్రణాళిక రచన : లక్ష్యాలు : ప్రాధామ్యాలు. వ్యూహాలు, పంచవర్ష ప్రణాళికలు విజయాలు – 12 వ పంచవర్ష ప్రణాళిక, సమ్మిళిత వృద్ధి – నీతి ఆయోగ్.
II, తెలంగాణ ఆర్ధిక వ్యవస్థ – అభివృద్ధి :
1. విభజనకు పూర్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ఆర్ధిక స్వరూపం (1956-2014) : నిర్లక్ష్య ధోరణులు నీరు (బబావాత్ కమిటి), నిధులు (లలిత, భార్గవ, వాంచు కమిటీలు), ఉద్యోగాలు (జై భారత్ కమిటి, గిర్ గ్లానీ కమిటీ) – తక్కువ అభివృద్ధి.
2. తెలంగాణలో భూ సంస్కరణలు : మద్య వర్తుల వ్యవస్థ రద్దు – జమీందారీ, జాగ్రరీ, ఇనాందారీ వ్యవస్థల రద్దు, కౌలుదారు సంస్కరణలు : చూ పరిమితి ; పెడ్యుల్డు ప్రాంతాల్లో భూ పరాయికరణ.
3. వ్యవసాయం – అనుబంధ రంగాలు : రాష్ట్ర స్థూల ఉత్పత్తి లో వ్యవసాయం – అనుబంధ రంగాల వాటా, భూ కమతాల విస్తరణ, వ్యవసాయంపై ఆధారపడడం, నీటి పారుదల సాగునీటి వనరులు : మెట్ట భూముల వ్యవసాయ సమస్యలు, వ్యవసాయ పరపతి.
4. పారిశ్రామిక, సేవల రంగాలు : పారిశ్రామిక అభివృద్ధి : పారిశ్రామిక రంగం నిర్మాణం, వృద్ధి – సూకు స్థాయి, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమల (ఎం ఎస్ ఎం ఇ) రంగం, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, తెలంగాణ పారిశ్రామిక విధానం, సేవల రంగం నిర్మాణం – వృద్ధి,
III. అభివృద్ధి – మార్పులకు సంబంధించిన అంశాలు :
1. అభివృద్ధి చలన శీలత : భారతదేశంలో ప్రాతీయ అసమానతలు సాంఘిక అసమానతలు కులం తెగలు, లింగవివవక్షత, మతం, వలసలు, పట్టణీకరణ.
2. అభివృద్ధి – నిరాశ్రయత : భూసేకరణ విధానం : నిర్వాసితుల పునరావాసం.
3. ఆర్ధిక సంస్కరణలు : వృద్ధి, పేదరికం, అసమానతలు – సామాజిక అభివృద్ధి (విద్య-ఆరోగ్యం), సామాజిక పరివర్తన, సాంఘిక భద్రత.
4. సుస్థిర అభివృద్ధి – భావన, గణన, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు.