WCD Nandyal Anganwadi Jobs 2025 అర్హతలు, ఎలా అప్లై చేయాలంటే…

నోటిఫికేషన్ సంఖ్య:. WDC02-ESTOEOAS(AWS)/1/2025-SA(1)-WDCWNDL తేది: 26-06-2025

నంద్యాల జిల్లా పరిధి లో 6 ఐసిడియస్ ప్రాజెక్ట్ ల లో ని మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు, మిని అంగన్వాడీ కార్యకర్తలు మరియు అంగన్వాడీ ఆయాలు నియమకమున కై అర్హులైన స్త్రీ అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి.

ఖాళీల వివరాలు 

మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు02 
మినీ అంగన్వాడి కార్యకర్త లు02
అంగన్వాడీ ఆయాలు37
మొత్తం 41

అంగన్వాడీ కార్యకర్త పోస్టునకు కావాల్సిన అర్హతలు:-

1. అభ్యర్థి తప్పని సరిగా 10 వ తరగతి ఉత్తీర్ణులై ఉండవలను
2. అభ్యర్థినులు తేదీ 01.07.2024 నాటికి 21 వ సం. ల వయస్సు నిండి 35 సం. ల వయస్సు లోపు వారై ఉండవలెను
3. అభ్యర్థినులు తప్పనిసరిగా వివాహితురాలై ఉండవలెను మరియు స్థానిక నివాసితురాలై ఉండవలెను
4. యస్.సి. యస్ టి జనవాస ప్రాంతాలలో అభ్యర్థినిల లో 21 సం. వయసు నిండిన వారు లేనిచో దిగువ వయస్సు 18 సం. నిండిన వారిని పరిగణలోనికి తీసుకొనబడను. 

మినీ అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ ఆయా పోస్టునకు కావాల్సిన అర్హతలు:-

1. అభ్యర్థి తప్పనిసరిగా 10 వ తరగతి ఉత్తీర్ణులై ఉండవలను. ఒక వేళ 10 వ తరగతి వాళ్ళు ఎవరూ
లేనిచో ఎక్కువ చదువు చదివి ఉత్తీర్ణులై ఉండవలయును.

2. అభ్యర్థినులు తేదీ 01.07.2024 నాటికి 21 వ సం. ల వయస్సు నిండి 35 సం.ల వయస్సు లోపు వారై ఉండవలెను
3. అభ్యర్థినులు తప్పనిసరిగా వివాహితురాలై ఉండవలెను మరియు స్థానిక నివాసితురాలై ఉండవలెను
4. యస్. సి. యస్ టి జనావాస ప్రాంతాలలో అభ్యర్థినిల లో 21 సం. వయసు నిండిన వారు లేనిచో దిగువ వయస్సు 18 సం. నిండిన వారిని పరిగణలోనికి తీసుకొనబడను

జతపరచవలసిన ధృవ పత్రములు:-

1. పుట్టిన తేదీ/ వయస్సు దృవీకరణ పత్రము
2. కుల ధృవీకరణ పత్రము (యస్సీ అభ్యర్థినులు ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య: 7, తేది: 13.4.25 ప్రకారం వారి
యొక్క కులం ఏ గ్రూప్ నకు వర్తిస్తుందో తెలియజేస్తున్న ధృవీకరణ పత్రం (లేటెస్ట్) ది జతపరచవలయును.
3. విద్యార్హత దృవీకరణ పత్రము – యస్.యస్.సి మార్క్ లిస్ట్, టి.సి, మరియు యస్. యస్. సి
లోపు ఎక్కువ తరగతి చదివిన మార్క్ లిస్ట్ మరియు టి. సి. జతపరచవలయును.
4. నివాసస్థల దృవీకరణ పత్రము
5. వితంతువు అయినచో నచో భర్త మరణ దృవీకరణ పత్రము మరియు 18 సం.ల పిల్లలు ఉన్నచో, వారి
యొక్క వయసు దృవీకరణ పత్రము.
6. వికలాంగులు అయినచో పి. హెఎచ్ సర్టిఫికేట్
7. ఆధారు కార్డ్ మరియు
8. రేషన్ కార్డ
దరఖాస్తు వెంట అవసరమగు ధృవ పత్రములు జిరాక్స్ కాపీలను (సెల్ఫ్ అబ్జెస్టేషన్ చేయవలెను) జతపరచి సంబంధిత సి. డి. పి. ఒ కార్యాలయమునకు తేదీ: 01.07.2025 నుండి తేది:10.07.2025 లోపల అందజేయాలి 

Publication of Press Note for notification of certain posts in the district i.e., Anganwadi Workers and Anganwadi Helpers in NANDYAL DISTRICT – Click Here.

PDF
WCD Nandyal Anganwadi Notification PDF
Click Here

Official Website – Click Here

Contents
For More Educational News Updates on Sarkari NaukriSarkari Result, and Employment News Notification. Join us on Twitter | Join Our WhatsApp Groups | Connect with our Telegram Channel

Schools 360

Content Writer

Schools360 Helpline Online
Hello, How can I help you? ...
Click Here to start the chat...