Daily Current Affairs in Telugu (17 జూలై 2026) తెలుగులో కరెంట్ అఫైర్స్

భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలు (First Hydrogen Train) ఏ మార్గంలో ప్రారంభం కానుంది?
జింద్ – సోనిపత్ (హర్యానా)

కీలక అంశాలు:

  • దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలు జులై 17వ తేదీ నుంచి హర్యానా రాష్ట్రంలోని జింద్ మరియు సోనిపత్ (Jind-Sonipat) నగరాల మధ్య నడవనుంది.

  • ఈ రైలు 89 కిలోమీటర్ల (వన్ వే) దూరాన్ని కేవలం రెండు గంటల్లో పూర్తి చేయనుంది. ఇది ప్రతిరోజూ రెండు రౌండ్ ట్రిప్పులు (Round trips) తిరుగుతుంది.

  • ఈ రైలు మార్గమధ్యంలో జింద్ సిటీ, పాండు పిండార, లలిత్ ఖేడా, భంభేవా, ఇషాపూర్ ఖేరీ, బుటానా, ఖండ్రాయ్, గోహనా, రభ్రా, లాత్, మోహనా హర్యానా, బర్వాస్ని తో సహా మొత్తం 12 స్టేషన్లలో ఆగుతుంది.

  • కాలుష్య రహిత, పర్యావరణహితమైన భవిష్యత్ ప్రయాణ సాధనాల రూపకల్పనలో భాగంగా భారతీయ రైల్వే ఈ సరికొత్త హైడ్రోజన్ రైలును అందుబాటులోకి తీసుకువస్తోంది.

Schools 360

Content Writer