Andhra Pradesh Residential Educational Institutions Society has Given Notification for Minority Schools Admissions 2024-25 for 5th,6th,7th, and 8th Classes through APRS (Minority) CAT 2024. Eligibility, Dates, Fee Details are given Here.
ఆంధ్రప్రదేశ్ మైనారిటీ గురుకుల విద్యాలయముల సంస్థ నిర్వహించబడుచున్న పాఠశాలల్లో 5,6,7,8 తరగతులకు 2024-25 విద్యా సంవత్సరం. ప్రవేశానికి నిర్వహించబడు APRS Minority CAT-2024 కొరకు దరఖాస్తుల స్వీకరణ తేదీ 01-05-2024 నుండి 31-05-2024 తేదీ వరకు జరుగును.
ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థచే నడుపబడుచున్న 12 మైనారిటీ గురుకుల పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి (ఇంగ్లీషు మీడియం) లో విద్యార్థులను ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేసి, ఎంపికైన వారికి పాఠశాల కేటాయింపు జరుగును.
APRS Minority Schools Admissions | |
Prospects | Click Here |
Application Form | Click Here |
Application Start Date | 01/05/2024 |
Application Last Date | 31/05/2024 |
అర్హతలు
విద్యార్థినీ విద్యార్థులు భారతపౌరులై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుతూ ఉండవలెను.
5 వ తరగతి ప్రవేశం కొరకు సంబంధిత పాత జిల్లాలోని మండలంలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2022-23 విద్యాసంవత్సరంలో 3వ తరగతి చదివి, 2023-24 విద్యాసంవత్సరంలో 4వ తరగతి చదువుతూ ఉండవలెను. ఓ.సి మరియు బి.సి (O.C, B.C) లకు చెందినవారు 01.09.2013 నుండి 31.08.2015 మధ్య పుట్టి ఉండాలి. యస్.సి. మరియు యస్.టి (SC,ST) లకు చెందినవారు 01.09.2011 నుండి 31.08.2015 మధ్య పుట్టి ఉండాలి.
6 వ తరగతి ప్రవేశం కొరకు సంబంధిత పాత జిల్లాలోని మండలంలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2023-24 విద్యా సంవత్సరంలో 5 వ తరగతి చదివి ఉండాలి. ఓ.సి. మరియు బి.సి.లకు చెందినవారు 01.09.2012 నుండి 31.08.2015 మధ్య పుట్టి ఉండాలి. యస్.సి. మరియు యస్.టి (SC & ST) లకు చెందినవారు 01.09.2010 నుండి 31.08.2014 మధ్య వుట్టి ఉండాలి.
7వ తరగతి ప్రవేశం కొరకు సంబంధిత పాత జిల్లాలోని మండలంలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2023-24 విద్యా సంవత్సరంలో 6వ తరగతి చదివి ఉండాలి. ఓ.సి. మరియు బి.సి.లకు చెందినవారు 01.09.2011 నుండి 31.08.2013 మధ్య పుట్టి ఉండాలి. యస్.సి. మరియు యస్.టి. (SC & ST లకు చెందినవారు 01.09.2009 నుండి 31.08.2013 మధ్య పుట్టి ఉండాలి.
8 వ తరగతి ప్రవేశం కొరకు సంబంధిత పాత జిల్లాలోని మండలంలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2023-24 విద్యా సంవత్సరంలో 7 వ తరగతి చదివి ఉండాలి.ఓ.సి. మరియు బి.సి.లకు చెందినవారు 01.09.2010 నుండి 31.08.2012 మధ్య పుట్టి ఉండాలి. యస్.సి. మరియు యస్.టి (SC & ST) లకు చెందినవారు 01.09.2008 నుండి 31.08.2012 మధ్య పుట్టి ఉండాలి.
f) మైనారిటీ విద్యార్థులు, మైనారిటీ పాఠశాలల్లో ప్రవేశం కొరకు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో చదివి ఉండే చ్చును.
ఆదాయపరిమితి
అభ్యర్ధి యొక్క తల్లి, తండ్రి/సంరక్షకుల సంవత్సరాదాయము (2023-24) రూ.1,00,000/- మించి ఉండరాదు లేదా తెల్లరేషన్ కార్డు కలిగిన వారు అర్హులు.
SC & ST విద్యార్థినీ విద్యార్థులు దరఖాస్తు చేసుకొనుటకు మార్గదర్శకాలు
SC & ST విద్యార్థినీ విద్యార్థులు మైనారిటీ పాఠశాలల్లో ప్రవేశము కొరకు దరఖాస్తు చేయు విధానం మైనారిటీ విద్యార్థుల కంటే భిన్నంగా ఉంటుంది. వీరు ప్రవేశం కొరకు ప్రవేశ పరీక్ష తప్పనిసరిగా వ్రాయవలసి ఉంటుంది.
కావున, SC & ST విద్యార్థినీ విద్యార్థులు ప్రవేశము కొరకు వెబ్ సైట్ నందు ఉంచబడిన APRS CAT ప్రాస్పెక్టస్ ని చూడగలరు.
మైనారిటీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకొనుటకు మార్గదర్శకాలు
a) మైనారిటీ గురుకుల పాఠశాలల్లో చేరాలనుకునే మైనారిటీ అభ్యర్థులు అడ్మిషన్ల కోసం APRS CAT కి హాజరు కానవసరం లేదు.
b) అభ్యర్ధులు https://aprs.apcfss.in వెబ్సైట్ను సందర్శించి, దరఖాస్తును మరియు ప్రాస్పెక్టస్లు డౌన్లోడ్ చేసుకొనవలెను. c) అభ్యర్థి ప్రాస్పెక్టస్ ను జాగ్రత్తగా చదవవలెను మరియు అడ్మిషన్ కోసం అర్హత ప్రమాణాల గురించి సంతృప్తి చెందిన తర్వాత, అభ్యర్థి పేరు. పుట్టిన తేదీ, ఆధార్ నంబర్ మరియు మొబైల్ నంబర్ మొదలైన వాటితో అవసరమైన డేటాతో దరఖాస్తును పూరించవలెను.
d) అప్లికేషన్లో వినియోగములో ఉన్నమొబైల్ నంబర్ను పేర్కొనవలెను.
ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల ప్రత్యేకతలు:
- ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుచున్నవి.
- ఈ విద్యాలయాలు పూర్తిగా గురుకుల విధానంలోనే విద్యను అందిస్తున్నవి. మరియు విద్యాలయాలు అన్నియు ఆంగ్ల మాధ్యమం మరియు ఉర్దూ మాధ్యమంలో నిర్వహించబడుచున్నవి. ఈ విద్యాలయాలలో ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ వహించబడును.
- ఈ విద్యాలయాలలో మంచి మౌళిక వసతులతో కూడిన ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, క్రీడాప్రాంగణాలు అందుబాటులో ఉన్నాయి.
- విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి కొరకు, విద్యతో పాటుగా, సహ పాఠ్యాంశాలు మరియు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
- ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు లోకో పేరెంట్ గా నియమించబడును. వీరు ప్రతి విద్యార్ధి పట్ల వ్యక్తిగత శ్రద్ధ తీసుకొనెదరు.
- దైనందిన కార్యక్రమాలు ఉదయం గం. 5 లకు శారీరక వ్యాయామంతో ప్రారంభమై, బోధనా తరగతులు మరియు ఇతర అభ్యసన కార్యక్రమాలు రాత్రి గం. 9.00 వరకు కొనసాగుతాయి.
- విద్యార్థులకు గణిత ఒలింపియాడ్ సైన్స్ ఫెయిర్ మరియు NTSE ప్రతిష్ఠాత్మక పరీక్షల కొరకు తర్పీదు ఇవ్వబడును. ఉత్తమ మరియు మంద అభ్యాసకుల కొరకు ప్రత్యేక తరగతులు నిర్వహించబడును.
ముఖ్యమైన సమాచారం & సహాయం కొరకు ఫోన్ నంబర్లు:
a) ఈ ప్రాస్పెక్టస్లో పేర్కొన్న తేదీలు మరియు షెడ్యూల్ కాలానుగుణంగా జారీ చేయబడిన మార్గదర్శకాల ప్రకారం మారవచ్చును. అందువల్ల అభ్యర్థులు సంబంధిత పాఠశాల ప్రిన్సిపాల్ ను ఎప్పటికప్పుడు సంప్రదించవలెను.
b) అభ్యర్థులు నవీకరించబడిన సమాచారం కోసం వెబ్సైట్ మరియు ప్రెస్ నోట్స్ ను కూడా గమనించాలని సూచించడమైనది. పై సూచనలను విస్మరించడం ద్వారా ఎవరైనా అభ్యర్థి తన అవకాశాన్ని కోల్పోయినట్లయితే, సొసైటీ బాధ్యత వహించదు.
c) అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే / ఏదైనా స్పష్టత అవసరమైతే, ప్రాస్పెక్టస్ను జాగ్రత్తగా చదవండి, వెబ్సైట్ అందించిన సమాచారాన్ని గమనించండి, అవసరమైన సమాచారాన్ని పొందడానికి సంబంధిత ప్రిన్సిపాల్ ను సంప్రదించండి.
d) అభ్యర్థులు పై మార్గముల ద్వారా అవసరమైన సమాచారాన్ని పొందడంలో విఫలమైతే, అతను/ఆమె క్రింద ఇవ్వబడిన ‘హెల్ప్ లైన్ నంబర్లను పని దినాలలో ఉదయం 10.00 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు మాత్రమే సంప్రదించగలరు: దరఖాస్తు సహాయం కొరకు : శ్రీ బి. శ్రీనివాస రావు ii. ఫిర్యాదుల కొరకు 9391005813 శ్రీ శ్రీమతి కె. భారతి లక్ష్మి : 9391005812 సం/- (ఆర్. నరసింహారావు) కార్యదర్శి