AP TTC 42 Days Summer Training Course 2025 Apply Online

By Schools 360

at


Applications are invited for TTC 42-day Summer Training Course. The course will be held at Visakhapatnam, Kakinada, Guntur, Kadapa and Anantapur from 01-05-2025 to 11-06-2025. Online application will be available from 03-04-2025 to 25-04-2025 on the website of the Government Examinations Office www.bse.ap.gov.in. The last date for online application is 25-04-2025. No applications will be accepted after the closure of online applications, and no offline applications will be accepted. Only candidates who are 18 years of age or older, are not more than 45 years of age as of 01-05-2025, and possess any of the following qualifications are eligible.

TTC 42 రోజుల వేసవి టైనింగ్ కోర్సు కు దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి. ఈ కోర్సు విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కడప మరియు అనంతపురంలో ది: 01-05-2025 నుండి 11-06-2025 వరకు జరుగును. ఆన్లైన్ అప్లికేషన్ ది.  03-04-2025 నుండి 25-04-2025 వరకు ప్రభుత్వ పరీక్షల కార్యాలయ వెబ్సైట్ www.bse.ap.gov.in నందు అందుబాటులో ఉండును. ఆన్లైన్ అప్లికేషన్ కు చివరి తేదీ 25-04-2025. ఆన్లైన్ అప్లికేషన్ ముగించబడిన తరువాత ఎటువంటి అభ్యర్ధనలు అంగీకరించబడవు మరియు ఎటువంటి ఆఫ్ లైన్ అప్లికేషన్ లు అంగీకరించబడవు. ది:01-05-2025 నాటికి 18 సంవత్సరాలు నిండినవారు మరియు 45 సంవత్సరాల లోపు వయసు ఉండి కింద చెప్పబడిన అర్హతలలో ఏదో ఒకటి కలిగిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.

విద్యార్హతలు:

  1. 10 వ తరగతి పాస్ అయ్యి TCC లోయర్ పూర్తి చేసి ఉండాలి.
  2. SSC ఒకేషనల్ కోర్సు పూర్తి చేసి ఉండాలి.
  3. Board of Intermediate Education, AP జారీ చేసిన vocational పాస్ certificate కలిగి ఉండాలి.
  4. State Board of Technical & Training (S.B.T.Ε.Τ), Α.Ρ వారు జారీ చేసిన సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
  5. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు కలిగిన I. T. I ఇన్స్టిట్యూట్ వారు జారీ చేసిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
  6. Industries మరియు Commerce డిపార్ట్మెంట్ వారు జారీ చేసిన లేదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ హ్యాండ్లూమ్ వీవింగ్ వారు జారీ చేసిన పాస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
  7. తెలుగు విశ్వ విద్యాలయం వారు జారీ చేసిన కర్నాటిక్ మ్యూజిక్ (వోకల్ లేదా వీణ లేదా వయొలిన్) లలో డిప్లొమా సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
  8. ఏదైనా విశ్వ విద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

కావున ఈ కోర్సుకు అప్లై చేసుకొనదలచిన విద్యార్ధులు 25-04-2025 లోపు అప్లై చేసుకొసి కోర్సు కేంద్రం ఏ జిల్లా ఎంపిక చేసుకుంటే ఆ జిల్లాకు సంబంధించిన జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయంలో అప్లికేషన్ ప్రింట్ తో పాటు విద్యార్హతలకు సంబంధించిన ధృవీకరణ పత్రాలు సబ్మిట్ చేసి 01-05-2025 నుండి తరగతులకు హాజరు కావలసినదిగా ప్రభుత్వ పరీక్షల సంచాలకులు డా|| కె వి శ్రీనివాసులు రెడ్డి గారు తెలియజేసారు.

PDF
Press Note – TTC 42 Days Training Online Application – 2025
Click Here

 

Choose Schools360 on Google

For More Educational News Updates on Sarkari NaukriSarkari Result, and Employment News Notification. Join us on Twitter | Join Our WhatsApp Groups | Connect with our Telegram Channel
Share This Article

Schools 360

Content Writer