AP NMMS Results 2023 Register Phase-2, Selection List Download

AP NMMS Results 2023  @ bseap.org: AP NMMS & NTSE Results 2023 has been released. Andhra Pradesh National Means cum Merit Scholarship exam for 8th Class was held on 20th March 2023. In this post we have updated the National Means cum Merit Scholarship Results Date. AP NMMS & NTSE Results 2023 have been released on 4th July 2023.

ఫిబ్రవరి 2023 లో జరిగిన నేషనల్ మీన్స్-కం-మెరిట్ స్కాలర్షిప్ పరీక్షలో ఎంపిక అయిన విద్యార్థులు విద్యా మంత్రిత్వ శాఖ, న్యూ ఢిల్లీ వారి నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ నందు 01-10-2023 నుండి తమ వివరములు నమోదు చేసుకొనుటకు అందుబాటులో ఉండును అని తెలియజేసినారు.

విద్యార్ధి వివరములు ఒక్క అక్షరం కూడా తేడా లేకుండా మెరిట్ కార్డ్ పైన ముద్రించిన విధంగానే ఆధార్ మరియు బ్యాంక్ పాస్ బుక్ లో ఉండేవిధంగా సరిచూసుకుని పోర్టల్ నందు తమ వివరములు ది. 30-11-2023 లోపు నమోదు చేసుకొనవలెను.

విద్యార్థి వివరములను సంబంధిత స్కూల్ నోడల్ ఆఫీసర్ లెవెల్ లో ది. 15-12-2023 లోపు క్షుణ్ణం గా పరిశీలించి, స్కూల్ నోడల్ ఆఫీసర్ లాగిన్ (INO) ద్వారా ధృవీకరించవలెను. పోర్టల్ అప్లికేషన్ మరియు వివరములను ధృవీకరించే పత్రములను విద్యార్థులు సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయంలో సమర్పించి ది. 30-12-2023 లోపు జిల్లా నోడల్ ఆఫీసర్ లాగిన్ (DNO) ద్వారా అప్లికేషన్ ను ధృవీకరించుకొనవలెను. ఈ తేదీలు ఎటువంటి పొడిగింపు ఉండదు అని పైన తెలిపిన తేదీల లోపు సంబంధిత INO మరియు DNO లు తప్పకుండా వారి వారి లాగిన్ ల ద్వారా అప్లికేషన్లను వెరిఫై చేయవలెను, లేనియెడల ఇక ఎప్పటికీ ఏ విధంగా కూడా స్కాలర్షిప్ మంజూరు కాబడదు అని విద్యా మంత్రిత్వ శాఖ, న్యూ ఢిల్లీ వారు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేయడమైనది. మెరిట్ కార్డ్ పైన ముద్రించిన విధంగానే ఆధార్ కార్డ్ పైన లేని విద్యార్థులు వెంటనే ఆధార్ మరియు బ్యాంక్ పాస్ బుక్ లతో సరిచేయించుకొనవలెను. లేని యెడల వెంటనే సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయంలో సంప్రదించవలెను.

అదేవిధంగా నవంబరు 2019, ఫిబ్రవరి 2021 మరియు మార్చి 2022 సంవత్సరములలో ఎంపిక కాబడి ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో/కళాశాలల్లో చదువుచున్న విద్యార్థులు ఈ సంవత్సరం తప్పకుండా రెన్యువల్ చేసుకొనవలెను. లేనియెడల స్కాలర్షిప్ మంజూరు కాబడదు. ఈ పథకం యొక్క విధి విధానాలు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ నందు పొందగలరు. విద్యా మంత్రిత్వ శాఖ, న్యూ ఢిల్లీ వారు నిర్దేశించిన గడువులోపు ఈ ప్రక్రియ పూర్తి చేయని విద్యార్థులకు స్కాలర్షిప్ మంజూరు కాబడదు. దానికి విద్యార్థి తల్లితండ్రులు మరియు సంబంధిత పాఠశాలవారే బాధ్యత వహించవలసి ఉంటుంది అని ప్రభుత్వ పరీక్షల కార్యాలయ సంచాలకులు శ్రీ డి. దేవానంద రెడ్డి గారు తెలియజేసారు.

AP NMMS Result 2023 Selection List

ది. 05-02-2023 న జరిగిన నేషనల్ మీన్స్-కం-మెరిట్ స్కాలర్షిప్ పరీక్షకు హాజరైన విద్యార్ధుల యొక్క సర్టిఫికెట్ ల తనిఖీ నిమిత్తం విద్యార్థుల లిస్ట్ ఈ కార్యాలయపు వెబ్సైటు నందు ఉంచడమైనది. ఆ లిస్ట్ లో పేరు ఉన్న విద్యార్థులు ది.29-03-2023 లోపు కుల, ఆదాయ మరియు 7 వ తరగతి మార్కుల శాతమును ధృవీకరించు పత్రము, అంగవైకల్యం ఉన్న విద్యార్ధులు వైకల్యమును ధృవీకరించు పత్రము, ఆధార్ కార్డ్ నకలు మొదలగునవి హాల్ టికెట్ జిరాక్స్ కాపీతో జతపరచి సంబంధిత పాఠశాల వారి ద్వారా జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయమునందు ఖచ్చితంగా సమర్పించవలెను.

29-03-2023 తేదీలోగా సర్టిఫికేట్ నకళ్లను అందజేయని విద్యార్ధుల యొక్క కులం OC గా పరిగణించబడును. తుది జాబితా విడుదల చేసిన తరువాత ఎట్టి పరిస్థితులలోనూ ఎటువంటి అభ్యర్ధనలు (స్పందన, కోర్టు వ్యాజ్యములు, లోకాయుక్త వ్యాజ్యములు) స్వీకరించబడవు. విద్యార్థి తల్లి తండ్రులు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని గడువు తేదీకు ముందుగానే సర్టిఫికేట్ లను సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయంనకు అందజేయబడులాగున చూసుకొనవలెను అని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ డి. దేవానంద రెడ్డి గారు తెలియజేశారు.

AP NMMS Merit List 2023 – AP NMMS Results @ bseap.org

Board NameDirectorate of Government Examinations (DGE), Andhra Pradesh
Name of ExamNational Means-cum-Merit Scholarship Scheme Examination for class VIII
Exam Date20th March 2023
Results Release Date10th December 2023
CategoryResults
Results Release Status
Available
Official Sitebseap.org

How to Check AP NMMS & NTSE Results 2023

  • Logon to the official Website at bseap.org
  • On the left sidebar find NMMS
  • Click on it and Search for NMMS Results 2023

Important Links to Check AP NMMS Results 2023

DOWNLOAD AP NMMS Selected students list

NMMS March 2023 – Selected students list

Press Note For NMMS March 2023

WhatsApp Channel New Join Now
WhatsApp Groups Join Now
Telegram Channel Follow Us
Twitter Follow Us
Google News Follow Us

BSE AP Home PageClick Here
AP NMMS Results 2023Click Here
AP NMMS School-wise List
Click Here