Sports Authority of Telangana has released the Admission notification for 4th Class Admission into Sports Schools situated in Hakimpet, Karim Nagar and Adilabad. Mandal-level selection of Eligible candidates will be conducted from 16th to 19th June 2025, While District Level Selection will be conducted from 23rd to 26th June 2025 and State Level Selection will be done from 1st to 5th July 2025.
Important Dates
| Online Application Start Date | 07-06-2025 |
| Online Application End Date | 15-06-2025 till 05:00 PM |
| Mandal Level Selection Process | |
| Start Date | 16-06-2025 |
| End Date | 19-06-2025 |
Selection Process
Children will be Selected on the basis of Performance in Physical Efficiency Tests.
మండల, జిల్లాస్థాయిలో ఎత్తు, బరువు, 30 మీటర్ల ఫ్లైయింగ్ స్టార్ట్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, 800 మీటర్ల రన్నింగ్, 6.10 మీటర్ల షటిల్ రన్, మెడిసన్ బాల్‌త్రో(కిలో బరువు), వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలీటీ టెస్ట్ అండ్ మెడికల్ టెస్ట్‌లు నిర్వహిస్తారు. రాష్ట్ర స్థాయిలో ఎత్తు బరువు, 30 మీటర్ల ఫ్లైయింగ్ స్టార్ట్, స్టాండింగ్ బ్రాడ్‌జంప్, 6.10 మీటర్ల షటిల్‌రన్, స్టాండింగ్ వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలిటీ టెస్ట్, మెడిసన్ బాల్ త్రో(కేజీ), 800 మీటర్ల రన్నింగ్ నిర్వహిస్తారు.
అర్హత
దొడ్డికాళ్లు, ఫ్లాట్‌ఫీట్, వెన్నుముక వంగి ఉన్నవారు, గుండె సంబంధిత జబ్బులు ఉన్నవారు, బౌ లెగ్స్ ఉన్న వారు, ఎముకలు విరిగినవారు అనర్హులు.
వయసు
- విద్యార్థులు 8 నుంచి 9ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి
- 01–09–2016 నుంచి 31–08–2017 మధ్య పుట్టిన వారు అర్హులు.
సీట్ల సంఖ్య
మొత్తంగా 60 మంది బాలురు, 60 మంది బాలికలకు అవకాశం కల్పిస్తారు. హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ స్కూళ్లలో 20 మంది బాలురు, 20 మంది బాలికల చొప్పున అవకాశం కల్పిస్తారు.
ఎంపికై న వారికి అథ్లెటిక్స్, అర్చరీ, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, రోయింగ్, వాలీబాల్, జూడో, ఫెన్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, రెజ్లింగ్ క్రీడాంశాల్లో శిక్షణ ఇస్తారు. రాష్ట్రస్థాయి, జాతీయస్థాయిలో రాణించిన వారికి భవిష్యత్‌లో రైల్వే, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, పోలీస్, బ్యాంక్స్, పోస్టల్ డిపార్ట్‌మెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, పీఈటీ, పీడీ, కోచ్‌లు, కార్పొరేట్ సెక్టార్లలో మంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
కావాల్సిన ధ్రువపత్రాలు
- ఒరిజినల్ ఆధార్‌కార్డు
- 4వ తరగతి చదువుతున్నట్లు సర్టిఫికెట్
- వయసు ధ్రువీకరణ పత్రం
- 3వ తరగతి ప్రోగ్రెస్ రిపోర్టు
- కమ్యూనిటీ సర్టిఫికెట్
- ఐదు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు







